Telangana Heavy Rains : రానున్న ఐదు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు.. 8 జిల్లాలకు ఎల్లో అలర్జ్ జారీ

రానున్న 24 గంటల్లో అత్యధిక వర్ష పాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Telangana Heavy Rains : రానున్న ఐదు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు.. 8 జిల్లాలకు ఎల్లో అలర్జ్ జారీ

Telangana Rains (4) (1)

Updated On : June 26, 2023 / 8:22 AM IST

Heavy Rains Yellow Alert : తెలంగాణలో భారీ వర్షాలు కురువనున్నాయి. రానున్న ఐదు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురువనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రానున్న 24 గంటల్లో అత్యధిక వర్ష పాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

రాష్ట్రంలోని కొమురంభీం అసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమందని తెలిపింది. ఉత్తర, ఈశాన్య మధ్య తెలంగాణ జిల్లాలకు వర్ష ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొంది. హైదరాబాద్ లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముందని వెల్లడించింది. పగలు సాధారణ పరిస్థితి ఉన్నా సాయంత్రానికి వాతావరణం మారుతుందని పేర్కొంది. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Stay Fit During Monsoons : వర్షాకాలంలో ఫిట్‌గా ఉండేందుకు సహాయపడే ఆహారపు అలవాట్లు ఇవే !

గత 24 గంటల్లో కురిసిన వర్షాలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మెదక్ జిల్లా కౌడిపల్లి, రామాయంపేటలో 6 సెంటీమీటర్లు, హైదరాబాద్ జిల్లా షేక్ పేటలో సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా మునిపల్లి, రాయ్ కోడ్, నిజామాబాద్ జిల్లా కోటగిరిలో 5 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదు అయింది.

సంగారెడ్డి జిల్లా నాయ్ కల్, మెదక్ జిల్లా నర్సాపూర్, నారాయణపేట జిల్లా ఊట్కూర్, కామారెడ్డి, వికారాబాద్ జిల్లా మార్పల్లిలో 4 సెంటీమీటర్లు, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్, హైదరాబాద్ జిల్లా గోల్కొండలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.