Telangana Highest Rainfall : తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు
జలాశయాలకు వరద నీరు చేరుతోంది. వరద నీరుతో జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. వాగులు, వంకలు పొంగుతున్నాయి. తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో అన్ని గేట్లు ఎత్తివేత వేశారు.

Telangana Rains (7)
Heavy Rains In Telangana : తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు అయింది. కొత్తగూడెం జిల్లాలో దుమ్ముగూడెంలో 12 సెంటీమీటర్లు, మనుగురు లో 10 సెంటీమీటర్లు, ములుగు జిల్లా అలుబాక లో 8.8సెంటీమీటర్లు, కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో 8.1సెంటీమీటర్లు, కామారెడ్డిలో 7.6సెంటీమీటర్లు, మెదక్ జిల్లా నాగాపూర్ 7.4సెంటీమీటర్లు, నిజామాబాద్ జిల్లా మొస్రా 7.2సెంటీమీటర్లు, నిర్మల్ లో 7.1సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.
కొమురంభీం జిల్లా చింతలమానేపల్లి మండం దిందా వద్ద వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. నాలుగు రోజులుగా దిందా గ్రామానికి రాకపోకలు నిలిచాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. జిల్లాలో సగటు 42.3 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదు అయింది. చెరువులు, కాలువల్లోకి వరద నీరు చేరుతోంది. రాళ్ళ వాగు, కప్పల వాగులకు వరద ఉధృతి పెరిగింది. గన్నారం, ఎడపల్లి, నవిపేట, మొస్రా, డిచ్ పల్లి, గుపన్ పల్లి , మల్కాపూర్, తుంపల్లి లో 5 సెంటి మీటర్ల వర్షం పాతం నమోదు అయింది.
Telangana Heavy Rains : తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిజామాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ చేశారు. ఖమ్మం జిల్లాలో రెండు రోజులుగా జోరువాన కురుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షం పడుతోంది. ఇప్పటికే వేసిన పైర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఇక వరి, మిర్చి సాగు పెరననుంది. సత్తుపల్లి మండలం గంగారంలో అత్యధిక వర్షపాతం 19.8 మిల్లీ మీటర్లు నమోదు అయింది.
జలాశయాలకు వరద నీరు చేరుతోంది. వరద నీరుతో జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. వాగులు, వంకలు పొంగుతున్నాయి. తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో అన్ని గేట్లు ఎత్తివేత వేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి జలకళ సంతరించుకుంది. రెడ్ ఆలర్ట్ తో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. కొత్తగూడెం, ఇల్లందు, సత్తుపల్లి, కొయగూడెం ఓసీ, మణుగూరు ఓసీలలో వరద నీరు నిలవడంతో బొగ్గు ఉత్పత్తి ఆగింది.
AP Heavy Rains : ఏపీలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా నిన్నటి నుండి ఏకదాటిగా కురుస్తున్న వర్షాలు పడుతున్నాయి. సత్తుపల్లి, కిష్టారం సింగరేణి ఉపరితల గనుల్లో 38 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువుకు వరద పోటెత్తింది. సామర్థ్యం 16 అడుగులకు గానూ వరద నీరు 15.5 అడుగులకు చేరుకుంది.
తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోంది. ఆవర్తన ప్రభావంతో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
Yamuna again Danger Mark : మళ్లీ పెరిగిన యమునా నదీ నీటిమట్టం
హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 13 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టరేట్ల లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ లకు సీఎస్ శాంతి కుమారి ఆదేశాలు ఇచ్చారు.