AP Heavy Rains : ఏపీలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు

బలమైన ఈదరు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జులై నెలలో సాధారణ వర్షపాత నమోదు అయిందని అన్నారు.

AP Heavy Rains : ఏపీలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు

AP Heavy Rains

Updated On : July 19, 2023 / 8:58 AM IST

Heavy Rains : ఏపీలో నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. ఒరిస్సాను ఆనుకుని ఆవర్తనం కొనసాగుతోంది. రానున్న 48 గంటల్లో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో నాలుగు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. వర్షాలతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారిణి సునంద తెలిపారు.

ఏపీలో పలు చోట్ల జోరు వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు. మరో నాలుగు రోజులపాటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

Telangana Heavy Rains : తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ

బలమైన ఈదరు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జులై నెలలో సాధారణ వర్షపాత నమోదు అయిందని అన్నారు. రుతుపవనాల ఆలస్యంతో జూన్ నెలలో తక్కువ వర్షపాతం నమోదు అయిందని తెలిపారు. పాడేరులో భారీ వర్షం కురిసింది. కుంభ వృష్టితో పాడేరు తడిసి ముద్దైంది. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో ప్రజుల తీవ్ర ఇబ్బందులు పడ్డారు.