Home » kadapa
ఓ వైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరోవైపు ఈశాన్య రుతుపవనాలు. వెరసి భారీ వర్షాలతో రాయలసీమ జిల్లాలు తల్లడిల్లాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ కడప, చిత్తూరు నెల్లూరు జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.
కడప జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మైలవరం డ్యాంకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. చరిత్రలో తొలిసారి గండికోట జలాశయం నుంచి మైలవరంకు 1,50,000 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది.
కడప జిల్లా ప్రజలకు వాయుగుండం గండంగా మారింది. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడప జిల్లా అతాలకుతలం అవుతోంది. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి భారీగా వరద వస్తోంది.
కడప జిల్లాలో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. రామాపురం వద్ద వాగులో చిక్కుకున్న 3 ఆర్టీసీ బస్సులు చిక్కుకున్నాయి. ఆర్టీసీ అద్దె బస్సులో చిక్కుకున్న ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు.
కడప జిల్లాలో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. రాజంపేట మండలం గుంటూరు వద్ద వరద ఉధృతికి వరద నీటిలో ఆర్టీసీ బస్సు కొట్టుకుపోయింది. 10మంది ప్రయాణికులు గల్లంతయ్యారు.
ఏపీలోని కడప జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వరదలు ముంచెత్తాయి. ఈక్రమంలో కార్తీక దీపాలు వదులుతుండగా..వరద నీటిలో 30మంది మహిళలు గల్లంతు..వారిలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి.
కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగింది. దీంతో ప్రాజెక్టు సమీపంలోని కాలనీలోకి భారీగా నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
కడప జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వానలతో వరదలు పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాజంపేటలోని అన్నమయ్య ప్రాజెక్టుకు ప్రమాద ఘంటికలు మోగాయి.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కడప జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. వాహనాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.