Annamayya Project : కడప జిల్లాలో వరద బీభత్సం.. అన్నమయ్య ప్రాజెక్టుకు ప్రమాద ఘంటికలు, ఆందోళనలో ప్రజలు

కడప జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వానలతో వరదలు పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాజంపేటలోని అన్నమయ్య ప్రాజెక్టుకు ప్రమాద ఘంటికలు మోగాయి.

Annamayya Project : కడప జిల్లాలో వరద బీభత్సం.. అన్నమయ్య ప్రాజెక్టుకు ప్రమాద ఘంటికలు, ఆందోళనలో ప్రజలు

Annamayya Project

Updated On : November 18, 2021 / 11:11 PM IST

Annamayya Project : కడప జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వానలతో వరదలు పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాజంపేటలోని అన్నమయ్య ప్రాజెక్టుకు ప్రమాద ఘంటికలు మోగాయి. జిల్లాలోని సుండుపల్లి మండలంలోని పింఛా ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వస్తోంది. లక్ష క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, 5 గేట్లు ఎత్తి 48వేల క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు.

కాగా, పింఛా ప్రాజెక్ట్ రింగ్ బండ్ తెగి పోవడంతో ఊహకు అందని స్థాయిలో దిగువన ఉన్న అన్నమయ్య ప్రాజెక్టులోకి వరద నీరు పోటెత్తింది. దీంతో అన్నమయ్య ప్రాజెక్ట్ భద్రతపై అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రత్యేక దళాలును రంగంలోకి దింపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. అక్కడి నుంచి ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. అయితే, ఉన్న ఫలంగా హెచ్చరికలు జారీ చేయడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తలదాచుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. అక్కడే ఉండలేక, ఇల్లు వాకిలి వదిలి ఎక్కడికీ వెళ్లలేక నరకం చూస్తున్నారు.

ఇకపై రేప్ చేస్తే అది లేకుండా చేస్తారు.. రేపిస్టులు భయపడేలా కొత్త చట్టం

కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తిరుపతికి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఎస్పీ ఆదేశాల మేరకు ఇర్కాన్ సర్కిల్ దగ్గర తిరుపతికి వెళ్లే వాహనాలను దారి మళ్లిoచారు. రాయచోటి మీదుగా వాహనాలను దారి మళ్లించారు.

నైరుతి బంగాళాఖాతంలో గంటకు 18 కిమీ వేగంతో వాయుగుండం ప్రయాణిస్తోంది. చెన్నైకి ఆగ్నేయంగా 150 కిమీ దూరంలో ఉంది. రేపు ఉదయం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా మధ్య చెన్నై-పుదుచ్చేరి దగ్గర తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది.

అల్పపీడనం ఎఫెక్ట్‌తో ఏపీలో వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పటికే పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో జోరు వానలు పడుతున్నాయి. ప్రకాశం, కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండ్రోజులు కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది.

కడప జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో ఏకధాటిగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించింది వాతావరణ శాఖ. దీంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు కలెక్టర్‌. రెండు రోజుల పాటు స్కూళ్లు కాలేజీలకు సెలవులిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు.

Urine : మూత్రం ఎరుపులో రంగులో ఉంటే డేంజర్లో పడ్డట్టేనా…

అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు నష్టాలు మిగిల్చాయి. వందల ఎకరాలలో వరి, శనగ, పచ్చి మిర్చి, పత్తి పంటలు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరో నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరం వెంబడి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని ప్రకటించింది.