Kadapa : కార్తీక దీపాలు వదులుతుండగా..వరద నీటిలో 30మంది గల్లంతు..రెండు మృతదేహాలు లభ్యం
ఏపీలోని కడప జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వరదలు ముంచెత్తాయి. ఈక్రమంలో కార్తీక దీపాలు వదులుతుండగా..వరద నీటిలో 30మంది మహిళలు గల్లంతు..వారిలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి.

30 People Drowned In Flood Waters Two Bodies Were Found
30 people drowned in flood waters Two bodies were found : కార్తీకపౌర్ణమి పర్వదినం సందర్భంగా శివాలయంలో దీపాలు వెలిగించి తిరిగి వస్తున్న సమయంలో 30మంది వరదనీటిలో చిక్కుకుని గల్లంతు అయ్యారు. గల్లంతు అయినవారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. పుల్లపత్తూరు లో ఒక మృతదేహం, మందపల్లి గ్రామ శివార్లలో మరో మృతదేహం లభ్యమయ్యాయి. కార్తీక పౌర్ణమి కావడంతో శివాలయంలో దీపాలను వెలిగించేందుకు వెళ్లిన మహిళలు దీపాలను వెలిగించి నదిలో వదులుతుండగా నీటి ఉదృతికి కోట్టుకుపోయారు. వారి కోసం అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లటానికి హెలికాప్టర్ కోసం ఎదురు చూసారు. వరద ఉదృతి ఎక్కవగా ఉండటంతో పులపత్తూరు, మందపల్లిలో సహాయక చర్యలు చేపట్టాలేమని అధికారులు చేతులెత్తేశారు. ఈ క్రమంలో గల్లంతు అయినవారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.
కాగా..ఏపీలో భఆరీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎటు చూసినా వరద నీరే దర్శనం ఇస్తోంది. పలు చోట్ల వరద ప్రవాహానికి వాహనాలు కొట్టుకుపోతున్నాయి. వర్షాలు, వరదల కారణంగా కడప జిల్లాలోని అన్నమయ్య జలాశయం మట్టికట్ట కొట్టుకుపోతుంది. దీంతో నది పరీవాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. పులపత్తూరు, శేషమాంబపురం, గుండ్లూరు, మందపల్లి గ్రామాలు నీటమునిగాయి. చెయ్యేరు నది ప్రవాహంలో ఇప్పటి వరకు 30 మంది కొట్టుకుపోగా వారిలో ఇద్దరు మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలినవారి ఆచూకీ తెలియాల్సి ఉంది.