Police

    Warangal: భవనం ప్రహరీ గోడ కూలి ఇద్దరు కూలీల మృతి

    June 11, 2022 / 01:41 PM IST

    వరంగల్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. నగరంలోని చార్‌బౌళిలో ఓ పాత భవనం కూల్చివేస్తున్న క్రమంలో ఒక్కసారిగా భవనం ప్రహరీ గోడ కూలింది. దీంతో గోడ కింద ఇద్దరు కూలీలు చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి.

    Thief Arrest: ఎం.ఎన్.వో.ముసుగులో చోరీలు.. పట్టుకున్న పోలీసులు

    June 11, 2022 / 12:01 PM IST

    కడప జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న నకిలీ ఎం.ఎన్.వోను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. కడప నగరంలోని శ్రీ రాం నగర్‌కు చెందిన మణిదీప్ కోవిడ్ సమయంలో ఎం.ఎన్.వోగా పనిచేశాడు. అప్పటి అనుభవాన్ని వాడుకుంటూ మణిదీప్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు.

    Jubilee Hills Rape Case: పోలీసు కస్టడీలో నేడు నిందితుల విచారణ

    June 11, 2022 / 08:44 AM IST

    జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులు పోలీసు కస్టడీలో ఉండగా, మరో ఇద్దరు నిందితుల కస్టడీకి కూడా కోర్టు అనుమతించింది. దీంతో శనివారం ఆరుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు విచారించనున్నారు.

    Jubilee Hills Rape Case: దోషులను రక్షించేందుకు పోలీసుల యత్నం: బీజేపీ నేత తరుణ్ చుగ్

    June 9, 2022 / 03:12 PM IST

    బాలికపై అత్యాచార ఘటనలో పోలీసులు అన్నిరకాల అవకతవకలకు పాల్పడ్డారు. అత్యాచారం జరిగింది ప్రభుత్వ వాహనంలోనే అని గుర్తించడానికి పోలీసులకు ఎందుకు ఆలస్యమైంది? దోషులను తప్పించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

    TTD: టీటీడీ ఉద్యోగిపై దాడి.. నిందితుడు అరెస్ట్

    June 9, 2022 / 02:22 PM IST

    తిరుమలలో గది విషయంలో టీటీడీ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన బబ్లూ, సీనియర్ అధికారి వెంకటరత్నంపై దాడి చేశాడు. దీంతో వెంకట రత్నం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు బబ్లూను అదుపులోకి తీసు�

    Andhra pradesh : ‘తోసి పడేస్తా జాగ్రత్త’ పోలీసులపై సోము వీర్రాజు వీరంగం..

    June 8, 2022 / 12:57 PM IST

    కాకినాడ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల్ని తోసేస్తూ నానా రగడ చేశారు.

    PUBG: పబ్‌జీ ఆడనివ్వలేదని తల్లిని కాల్చి చంపిన కొడుకు

    June 8, 2022 / 11:36 AM IST

    ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో దారుణం జరిగింది. పబ్‌జీ గేమ్ ఆడనివ్వలేదని తల్లిని కాల్చి చంపాడో కొడుకు. లక్నోకు చెందిన పదహారేళ్ల బాలుడు పబ్‌జీ గేమ్‌కు బాగా అలవాటు పడిపోయాడు. మొబైల్ ఫోన్‌లో రోజూ గంటల తరబడి గేమ్ ఆడుతుండేవాడు.

    Goa Beach: గోవాలో దారుణం.. విదేశీయురాలిపై అత్యాచారం

    June 7, 2022 / 10:35 AM IST

    బీచ్‌లో మహిళ ఒంటరిగా విశ్రాంతి తీసుకుంటూ ఉండగా, జోయెల్ విన్సెంట్ డిసౌజా అనే వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ముల్తానీ మట్టితో మసాజ్ చేస్తానంటూ వెళ్లిన జోయెల్, ఆమెపై అత్యాచారం చేశాడు.

    ITBP New record: ఇరవై నాలుగు వేల అడుగుల ఎత్తులో యోగా.. ఐటీబీపీ సరికొత్త రికార్డు

    June 6, 2022 / 11:53 AM IST

    ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు (ఐటీబీపీ) అరుదైన రికార్డు సృష్టించారు. 24 వేల అడుగుల ఎత్తులో యోగా చేశారు. ఉత్తరాఖండ్‌లోని మౌంట్ అబి గామిన్ పర్వతంపై పర్వతారోహణ బృందానికి చెందిన ఐటీబీపీ సిబ్బంది యోగా చేశారు.

    Jubilee Hills Rape Case: జూబ్లీహిల్స్ రేప్ కేసు.. ఎమ్మెల్యే కుమారుడి పాత్రపై దర్యాప్తు

    June 6, 2022 / 09:18 AM IST

    జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల్లో ఇప్పటివరకు నలుగురు అరెస్టుకాగా, మరో మైనర్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే కుమారుడి పాత్రపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసినట్లు సమాచారం.

10TV Telugu News