Home » Telangana Congress
తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై రేవంత్ తొలి సంతకం చేశారు.
రేవంత్ తో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేది ఎవరనే విషయంపై ఉత్కంఠ వీడింది. 11మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
విమానాశ్రయంలో డీజీపీ రవిగుప్తా, సీఎస్ శాంతి కుమారి సహా పలువురు ఉన్నతాధికారులు రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు. ఆయనకు అధికారికంగా ఏర్పాటు చేసే కాన్వాయ్ ని సిద్ధం చేశారు.
కేసీఆర్ స్కీంలను అమలు చేస్తా అని రేవంత్ చెప్పారు. దళితులకు మోసంచేస్తే బీజేపీ కార్యకర్తలు వదిలిపెట్టరు రేవంత్ అంటూ రాజాసింగ్ హెచ్చరించారు.
రేవంత్ కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రి వర్గం కూర్పు వంటి విషయాలపై సోనియాగాంధీ దృష్టికి రేవంత్ తీసుకెళ్లినట్లు తెలిసింది.
తెలంగాణ సీఎంగా ఎంపికైన రేవంత్రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆయనకు.. ఎయిర్పోర్టులో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
సీఎం పదవిని ఆశించిన చాలామంది.. అది కుదిరే పని కాదని తేలిపోవడంతో కనీసం డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ సీఎం అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఈరోజు నిర్ణయిస్తామని ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ క్రమంలో సీఎం అభ్యర్థి ఎంపికపై పార్టీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది.
తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంలుగా భట్టి విక్రమార్క, సీతక్క ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఎమ్మెల్యేల అభిప్రాయాలతో కూడిన వివరాలను ఏఐసీసీ పరిశీలకులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పంపించారు. అధిష్టానం సాయంత్రం వరకు సీఎల్పీ నేత పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.