Telangana New CM : తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంలుగా భట్టి, సీతక్క
తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంలుగా భట్టి విక్రమార్క, సీతక్క ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Revanth Reddy
Telangana Congress : తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంలుగా భట్టి విక్రమార్క, సీతక్క ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ రాత్రి రాత్రి 8:15 గంటలకు రాజ్ భవన్ లో వీరి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సీఎల్పీ నేత ఎంపికపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను సోమవారం ఉదయం ఏఐసీసీ పరిశీలకులు స్వీకరించారు. సీఎల్పీ నేత ఎంపిక నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గేకు అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానంను రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. రేవంత్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో సహా ఇతర ఎమ్మెల్యేలు బలపర్చారు.
ఈ తీర్మానాన్ని ఏఐసీసీ పరిశీలకులు అధిష్టానానికి పంపించారు. కాంగ్రెస్ అధిష్టానం సీఎల్పీ నేత పేరును అధికారికంగా ప్రకటించటంతో రేవంత్ రెడ్డి సీఎంగాను.. డిప్యూటీ సీఎంలుగా భట్టి విక్రమార్క, సీతక్క ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాత్రి 8.15 గంటలకు వీరితో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.