Uttam Kumar Reddy: సీఎం అభ్యర్థి ఎంపికపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ సీఎం అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఈరోజు నిర్ణయిస్తామని ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ క్రమంలో సీఎం అభ్యర్థి ఎంపికపై పార్టీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది.

Uttam Kumar Reddy: సీఎం అభ్యర్థి ఎంపికపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Uttam Kumar Reddy

Telangana Congress : తెలంగాణ సీఎం ఎంపిక విషయంపై కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని సోమవారం ఏఐసీసీ పరిశీలకులు సేకరించిన విషయం విధితమే. ఆ నివేదికను కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్, తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మణిరావు ఠాక్రే  మంగళవారం జాతీయ పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ అయిన సందర్భంలో అందజేశారు. వీరి భేటీ తరువాత సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటన ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నారు.

Also Read : Telangana New CM : తెలంగాణ సీఎం ఎంపికపై స్పందించిన మల్లిఖార్జున ఖర్గే.. ఢిల్లీ వెళ్లిన భట్టి, ఉత్తమ్

ఢిల్లీలో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఢిల్లీ వెళ్లారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. వీరి మధ్య కొద్దిసేపు భేటీ జరిగింది. రాష్ట్రంలో పరిస్థితులు, మంత్రి వర్గ కూర్పు, ఇతర అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. వీరి మధ్య భేటీ తరువాత ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం ఎవరనేది కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందని అన్నారు. ఎమ్మెల్యేలమంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి హైకమాండ్ కు నివేదిక పంపించామని చెప్పారు. ఎవరు సీఎం అవుతారనే విషయం నేను చెప్పలేనని, ఆ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. తెలంగాణ సీఎం అభ్యర్థిగా ఎవరి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించినా తనకు ఆమోదమేనని ఉత్తమ్ చెప్పారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా నేను గెలుపొందడం జరిగిందని, ఈ నేపథ్యంలో తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఉత్తమ్ అన్నారు. అది ఎప్పుడనేది త్వరలో నిర్ణయించి వెల్లడిస్తానని తెలిపారు.

Also Read : Rajasthan: గెలిచిన 199 మంది ఎమ్మెల్యేల్లో 169 మంది కోటీశ్వరులే, 61 మందిపై క్రిమినల్ కేసులు

తెలంగాణ సీఎం అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఈరోజు నిర్ణయిస్తామని ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ క్రమంలో సీఎం అభ్యర్థి ఎంపికపై పార్టీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఖర్గేతో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. వీరి మధ్య సీఎం అభ్యర్థి ఎంపిక విషయం పై చర్చ జరిగినట్లు తెలిసింది. సీఎం ఎంపిక విషయంపై అధిష్టానం కసరత్తు తుదిదశకు చేరిందని, మంగళవారం సాయంత్రం వరకు సీఎం ఎవరనేది అధిష్టానం ప్రకటిస్తుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నారు. మరోవైపు సీఎంగా రేవంత్ రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసినట్లు, డికే శివకుమార్, మాణిక్ రావు ఠాక్రేలు  సాయంత్రం హైదరాబాద్ వచ్చిన తరువాత అధికారికంగా ప్రకటిస్తారని కాంగ్రెస్ లోని పలువురు నేతలు పేర్కొంటున్నారు.