Home » Weather
నైరుతి రుతుపవనాలకు తోడు... అల్ప పీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయ. ఉత్తర పశ్చిమ అల్పపీడన ద్రోణి మరింత బలహీనపడినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
నైరుతి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో రెండు రోజులు పాటు ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈనెల 5న రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రమంతటా విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఉత్తర బంగాళాఖాతం దాని పరిసరాల్లో ఈనెల 11 న ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో రాగల 5 రోజులు తెలంగాణలో రాష్ట్రం అంతటా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు పూర్తిగా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయంది.
కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
ఈ ఏడాది వర్షాలపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తీపి కబురు చెప్పింది. ఈసారి రుతుపవనాల రాక ఆలస్యమైనా సాధారణ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది.
నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ఒక రోజుముందే కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం తుపానుగా మారింది. రాగల 12గంటల్లో ఇది తీవ్ర తుపానుగానూ... తర్వాతి 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగాను ఇది రూపాంతరం చెందుతుందని భారతవాతావరణ శాఖ హెచ్చరించింది.
మరో తుపాను గండం దూసుకొస్తోంది. పశ్చిమ తీరంలో తౌటే తుపాను విలయం ఇంకా మరిచిపోకముందే తూర్పు తీరంలో ‘యాస్’ తుపాను విరుచుకుపడనుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ఆదివారం(మే 23,2021) ఉదయం వాయుగుండంగా మారింది.