Airtel mobile appలో సెక్యూరిటీ ప్రాబ్లమ్

Airtel mobile appలో సెక్యూరిటీ ప్రాబ్లమ్

తమ మొబైల్ యాప్‌లో సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఉందని ఎయిర్‌టెల్ ఒప్పుకుంది. ప్రజల్లోకి వెళ్లిపోయిన తర్వాత ప్రాబ్లమ్ క్లియర్ చేసినప్పటికీ వినియోగదారులు తమ మొబైల్ లో ఉన్న యాప్ గురించి బెంగపెట్టుకుంటున్నారు. భారత్ లో ఉన్న టాప్ 3నెట్‌వర్క్స్‌లో ఒకటైన ఎయిర్‌టెల్ యాప్‌లో సెక్యూరిటీకి సంబంధించిన బగ్ ఉన్నట్లు ఎహ్రాజ్ అహ్మద్ అనే వ్యక్తి కనిపెట్టాడు. 

దీనిపై స్పందించిన దానికి ఒప్పుకుంది. అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్‌ఫేస్(ఏపీఐ) యూనిట్ లో సమస్య ఉన్నట్లు గుర్తించారు. దీనిపై ఎయిర్‌టెల్ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘ఇక్కడొక టెక్నికల్ సమస్య ఉంది. నాలుగింటిలో ఒకటైన ఏపీఐలో సమస్య గురించి మా నోటీస్ కు వచ్చింది. డిజిటల్ ప్లాట్ ఫాంలో అత్యున్నత భద్రతా ప్రమాణాలు ఉన్న నెట్‌వర్క్ ఎయిర్‌టెల్.

కస్టమర్ల ప్రైవసీ మాకు ముఖ్యం. ఏ ఎయిర్‌టెల్ సబ్ స్క్రైబర్ ఫోన్ నుంచైనా ఇతర ఎయిర్ టెల్ వినియోగదారుడి డేటా తెలుసుకోవచ్చు. ‘పేరు, జెండర్, ఈ మెయిల్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, సబ్‌స్క్రిప్షన్ ఇన్ఫర్మేషన్, డివైజ్ క్యాపబిలిటీ ఇన్ఫర్మేషన్ ఫర్ 4జీ, 3జీ, జీపీఆర్ఎస్, నెట్‌వర్క్ ఇన్ఫర్మేషన్, యాక్టివేషన్ డేట్, యూజర్ టైప్(ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్), ప్రస్తుతం వాడే ఫోన్ IMEI నెంబర్ వంటి వివరాలు తెలుసుకునే వీలు ఉందట. 

దీనికి పరిష్కారం దొరికి బగ్ ఫిక్స్ చేసినప్పటికీ ఇప్పటికే భారత్‌లోని 325.5మిలియన్ ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్స్ ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోయింది. మొత్తానికి ఎయిర్‌టెల్ మొబైల్ యాప్ వినియోగదారుల సమచారాన్ని బట్టబయలు చేసిందన్నమాట.