Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ 5 ట్రిక్స్ తప్పక తెలుసుకోవాల్సిందే

ప్రైమ్ వీడియోలో ఫీచర్లను ఎలా పర్సనలైజ్ చేసుకోవాలో తెలియదా? యూజర్ల కోసం ఈ 5 టిప్స్ అండ్ ట్రిక్స్ అందిస్తున్నారం. ఓసారి లుక్కేయండి.

Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ 5 ట్రిక్స్ తప్పక తెలుసుకోవాల్సిందే

Amazon Prime Video 5 Tips And Tricks That Will Amplify Your Binge Watching Experience

Amazon Prime Video Tips and Tricks : ప్రముఖ పాపులర్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైవ్ వీడియో (Amazon Prime Video) యూజర్లు ఓటీటీ కంటెంట్ ఈజీగా యాక్సస్ చేసుకోవచ్చు. సింగిల్ సబ్ స్ర్కిప్షన్ తో అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్ ద్వారా నచ్చిన కంటెంట్ చూడొచ్చు. ఈ స్ట్రీమింగ్ వెబ్ సైట్లో కంటెంట్ యాక్సస్ చేసుకోవాలంటే TV, Mobile Appతో పాటు Firestick ద్వారా కూడా యాక్సస్ చేసుకునే వీలుంది. అయితే చాలామంది ప్రైమ్ వీడియో యూజర్లకు ఇందులోని ఫీచర్లను ఎలా పర్సనలైజ్ చేసుకోవాలో తెలియకపోవచ్చు. అందుకే ప్రత్యేకించి ప్రైమ్ వీడియో యూజర్ల కోసం 5 టిప్స్ అండ్ ట్రిక్స్ అందిస్తున్నాం.. అవేంటో ఓసారి లుక్కేయండి..

1. X-Ray (ఎక్స్-రే) :
అమెజాన్ ప్రైమ్ వీడియోలో అద్భుతమైన ఫీచర్ (X-Ray) ఇది. దీని ద్వారా మీరు ఏం వాచ్ చేస్తున్నారో కంటెంట్ వివరాలను స్ర్కీన్ పై పూర్తిగా చూడొచ్చు. స్మార్ట్ టీవీ లేదా ఫైర్ స్టిక్ నుంచి వాచ్ చేసినా మీ స్ర్కీన్ పై కనిపిస్తాయి. స్ట్రీమింగ్ సమయంలో వీడియో స్టాప్ చేసినప్పుడు సంబంధిత వివరాలు కనిపిస్తాయి. మీరు చూసే షోకు సంబంధించిన కంటెంట్ పేరు, క్యారెక్టర్ పేరు స్ర్కీన్ పై కనిపిస్తాయి.

2. బ్యాక్ గ్రౌండ్‌లోనూ మ్యూజిక్ ప్లే చేయొచ్చు :
మీ స్మార్ట్ ఫోన్ లో ప్రైమ్ వీడియోలో ఏదైనా మీ ఫేవరెట్ టీవీ షో వాచ్ చేస్తున్నారనుకుందాం. సడన్ గా ఫోన్ కాల్ వచ్చింది.. ఏదైనా ఫోన్ లోని వివరాలను చూసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఈ X-Ray ఫీచర్ మీరు వాచ్ చేసే వీడియో ప్లే ఆగకుండా చేస్తుంది. బ్యాక్ గ్రౌండ్ లోనూ వీడియో ప్లే అవుతూనే ఉంటుంది. ఏ వీడియో, సాంగ్ వింటున్నారో పేరు సహా మీకు చూపిస్తుంది.
లాక్‌డౌన్‌లో రిలీజైన అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి 5 బెస్ట్ వెబ్ సిరీస్ మీకోసం.. 

3. సబ్ టైటిల్స్ కస్టమైజ్ చేసుకోవచ్చు :
అమెజాన్ ప్రైమ్ వీడియోలో వేర్వేరు భాషల్లో మూవీలు, టీవీ షో కంటెంట్ అందుబాటులో ఉంది. ఇదో లైఫ్ సేవర్ ఫీచర్.. వీడియో ప్లేయర్ CC ట్యాబ్ కింద ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో మీకు అర్థమయ్యే ఫారెన్ లాంగ్వేజీ సబ్ టైటిల్స్ ఎంచుకోవచ్చు. అలాగే ఆడియో లాంగ్వేజీ కూడా ఎంచుకోవచ్చు. అన్ని భాషల్లో ఉండకపోవచ్చు. కానీ, సబ్ టైటిల్స్ మాత్రం ఎక్కువ భాషల్లో అందుబాటులో ఉంటాయి.

4. టైటిల్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు :
ఈ ఫీచర్ ద్వారా అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి టైటిల్స్ కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అయితే.. ఈ ఆప్షన్ టీవీ ప్రైమ్ వీడియో యాప్ లో అందుబాటులో లేదు. కేవలం స్మార్ట్ ఫోన్ ప్రైమ్ వీడియో యాప్స్ లో మాత్రమే అందుబాటులో ఉంది. యాప్ ఓపెన్ చేశాక రైట్ సైడ్ లో Downloaded అనే ఆప్షన్ ఉంటుంది. మీకు నచ్చిన క్వాలిటీని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీరు వాడే ఇంటర్నెట్ స్పీడ్ పై ఆధారపడి ఉంటుంది. కానీ, డౌన్ లోడ్ చేసిన కంటెంట్ 30 రోజుల తర్వాత ఎక్స్ పెయిర్ అయిపోతుంది. మీ ఇంట్లో Wi-Fi కనెక్షన్ మంచి స్పీడ్ ఉంటే మాత్రం ఏదైనా మూవీని 20 నిమిషాల్లోనే డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

5. పేరంటల్ కంట్రోల్స్ :
అమెజాన్ ప్రైమ్ వీడియోలో పిల్లల కోసం సెక్యూరిటీ ఆప్షన్లు ఉన్నాయి. దీనికి మాస్టర్ PIN కోడ్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. మీ పిల్లలు ఏయే కంటెంట్ వాచ్ చేస్తున్నారో ట్రాక్ చేయొచ్చు. అంతేకాదు.. ఏయే కంటెంట్ చూడకూడదో బ్లాక్ చేయొచ్చు. పిల్లలకు మాత్రమే ఉపయోగపడే కంటెంట్ యాక్సస్ చేసుకునేందుకు Kids మోడ్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు kid-friendly టైటిల్స్ మాత్రమే వారికి కనిపిస్తాయి.