New iPhone Discount : ఆపిల్ కొత్త ఐఫోన్లపై భారీ డిస్కౌంట్.. మే 31వరకు ఛాన్స్.. డోంట్ మిస్..!

New iPhone Discount : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఇంట్రెస్టింగ్ ఆఫర్ తీసుకొచ్చింది. కొత్త ఐఫోన్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఈ నెల (మే 31) వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది.

New iPhone Discount : ఆపిల్ కొత్త ఐఫోన్లపై భారీ డిస్కౌంట్.. మే 31వరకు ఛాన్స్.. డోంట్ మిస్..!

Apple Offering Extra Discount On Purchase Of A New Iphone Until May 31 Here Is The Deal (1)

New iPhone Discount : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఇంట్రెస్టింగ్ ఆఫర్ తీసుకొచ్చింది. కొత్త ఐఫోన్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఈ నెల (మే 31) వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. కొత్త iPhoneల కొనుగోళ్లపై అదనపు ట్రేడ్-ఇన్ క్రెడిట్‌ను అందిస్తోంది. ట్రేడ్-ఇన్ కొనుగోలుదారులు తమ పాత ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేసి అదనపు ఎక్స్ఛేంజ్ పొందవచ్చు. సాధారణం కన్నా చాలా తక్కువ ధరకు iPhoneని కొనుగోలు చేయొచ్చు.

ఈ ఆఫర్ మే 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొత్త iPhoneలో అదనపు ఎక్స్ఛేంజ్ విలువను పొందడానికి కొనుగోలుదారులు ఏదైనా ఫోన్ Android లేదా iPhone ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. ఈ కంపెనీ ఎక్స్ఛేంజ్ వాల్యూను రూ.5,200 నుంచి రూ.49,700 వరకు అందిస్తోంది. ఐఫోన్‌లలో మెరుగైన ఎక్స్ఛేంజ్ వాల్యూను అందిస్తోంది. ఆండ్రాయిడ్ డివైజ్‌లపై కూడా భారీ డిస్కౌంట్ అందిస్తోంది.

ట్రేడ్-ఇన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీరు కొత్త ఐఫోన్ కోసం ఆర్డర్ చేయవచ్చు. ఆపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ట్రేడ్-ఇన్ ఆర్డర్ చేయడానికి ముందు.. మీరు మీ సిటీలో సర్వీసు అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. Apple సర్వీసును పొందాలంటే మెట్రోలలో పికప్ డెలివరీ సౌకర్యాలను అందిస్తుంది, కానీ కొన్ని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

Apple Offering Extra Discount On Purchase Of A New Iphone Until May 31 Here Is The Deal (2)

Apple Offering Extra Discount On Purchase Of A New Iphone Until May 31 Here Is The Deal

Apple అదనపు ట్రేడ్-ఇన్ క్రెడిట్ ఆఫర్ :
అదనపు క్యాష్‌బ్యాక్ విలువ లేదా ట్రేడ్-ఇన్ క్రెడిట్‌ని పొందడానికి.. కొనుగోలుదారులు కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అవేంటంటే..

  • ఫోన్ బ్రాండ్ పేరు
  • IMEI నంబర్

ఈ వివరాలను అందించిన తర్వాత ఎక్స్ఛేంజ్ విలువ ఆటోమాటిక్‌గా స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఎక్స్ఛేంజ్ కోసం ఆర్డర్ చేసిన తర్వాత.. కస్టమర్ ఎగ్జిక్యూటివ్ వచ్చి ఆ ప్రదేశం నుంచి ఫోన్‌ను పికప్ చేసుకుంటారు. పాత ఐఫోన్‌ని పికప్ చేయడంతో పాటు కొత్తది డెలివరీ చేయడం ఒకే సమయంలో జరుగుతుంది. Apple కస్టమర్ ఎగ్జిక్యూటివ్ స్మార్ట్‌ఫోన్ ఫిజికల్ స్టేటస్ ఎలా ఉందో చెక్ చేస్తారు. మీరు వెబ్‌సైట్‌లో క్లెయిమ్ చేసిన విధంగానే ఫోన్ స్టేటస్ అలాగే ఉందో లేదో ధృవీకరిస్తారు. లేకపోతే, ఎగ్జిక్యూటివ్ ఎక్స్ఛేంజ్ వాల్యూను తగ్గించవచ్చు.

Apple ట్రేడ్-ఇన్ పాత లేదా కొత్త దాదాపు అన్ని iPhoneలను అనుమతిస్తుంది. ముఖ్యంగా, మీరు రూ. 49,700 విలువైన iPhone 12 Pro Maxని ఎక్స్ఛేంజ్ చేసినప్పుడు మాత్రమే మొత్తం వాల్యూ అందిస్తుంది. Android విషయానికొస్తే.. Apple Samsung, Xiaomi, OnePlus ఇతర బ్రాండ్‌ల నుంచి ట్రేడ్-ఇన్ స్కీమ్ కింద ఫోన్‌లను అంగీకరిస్తుంది.

Read Also :  Apple IPhone 12 : ఆపిల్ ఐఫోన్ 12పై భారీ తగ్గింపు.. ధర ఎంతంటే?