Asus ROG Phone 7 Series : ఏప్రిల్ 13న Asus ROG ఫోన్ 7 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్!
Asus ROG Phone 7 Series : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు అసూస్ (Asus) నుంచి ROG ఫోన్ 7 సిరీస్ వచ్చేస్తోంది. ఏప్రిల్ 13న గేమింగ్-ఫోకస్డ్ హ్యాండ్‌సెట్ లాంచ్ కానుంది. అధికారిక లాంచ్‌కు ముందే ఈ హ్యాండ్‌సెట్ కీలక స్పెసిఫికేషన్‌లు లీక్ అయ్యాయి.

Asus ROG Phone 7 Series Key Specifications Leak Ahead of April 13 Launch Date_ All Details
Asus ROG Phone 7 Series : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు అసూస్ (Asus) నుంచి ROG ఫోన్ 7 సిరీస్ వచ్చేస్తోంది. ఏప్రిల్ 13న గేమింగ్-ఫోకస్డ్ హ్యాండ్‌సెట్ లాంచ్ కానుంది. అధికారిక లాంచ్‌కు ముందే ఈ హ్యాండ్‌సెట్ కీలక స్పెసిఫికేషన్‌లు లీక్ అయ్యాయి. Qualcomm లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoC ద్వారా అందించనుంది.
రెండు ఫోన్‌లలో ఈ సిరీస్ రానుందని టిప్‌స్టర్ పేర్కొంది. స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ కానుంది. టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ (ట్విట్టర్ @yabhishekhd) ప్రకారం.. రాబోయే Asus ROG ఫోన్ 7 సిరీస్ ROG ఫోన్ 7 అల్టిమేట్ డేటా లీక్ అయింది.
Read Also : Hyundai Ai3 Micro SUV : భారత్‌లో హ్యుందాయ్ Ai3 మైక్రో SUV టెస్టింగ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
ROG ఫోన్ 7 సిరీస్‌లో భాగంగా Asus ఈ ఫోన్ లాంచ్ చేస్తుందని పేర్కొన్నారు. Asus ROG ఫోన్ 6కి రాబోయే సక్సెసర్ లేటెస్ట్ Qualcomm Snapdragon 8 Gen 2 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. టిప్‌స్టర్ వివరాల ప్రకారం.. రాబోయే Asus ROG ఫోన్ 7 సోనీ IMX766 సెన్సార్‌తో 50-MP ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉంటుంది.

Asus ROG Phone 7 Series : Key Specifications Leak Ahead of April 13 Launch Date
అంతేకాదు 13-MP అల్ట్రా-వైడ్, 8-MP మాక్రో కెమెరా ఉంటుంది. సెల్ఫీలతో పాటు వీడియో కాల్స్ ఫోన్‌లు 32-MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉండవచ్చని భావిస్తున్నారు. అదనంగా, ఫోన్ బాక్స్ వెలుపల Android 13ని రన్ చేస్తుంది. Asus ROG ఫోన్ 7 173 x 77 x 10.3mm, బరువు 239g ఉంటుందని టిప్‌స్టర్ పేర్కొంది.
లీక్ డేటా ప్రకారం.. అసూస్ ROG ఫోన్ 7 సిరీస్ చాలా స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. Asus ROG ఫోన్ 7 అల్టిమేట్ 16GB RAM, 512GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. గతంలో Asus ROG ఫోన్ 7 గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ తేదీని ధృవీకరించింది. ఈ ఫోన్ ఏప్రిల్ 13న లాంచ్ కానుంది. ఇప్పటికే బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్ గీక్‌బెంచ్‌లోనూ కనిపించింది. లిస్టింగ్ ఫోన్ 3.19GHz గరిష్ట క్లాక్ స్పీడ్‌తో చిప్‌సెట్‌ను రానుంది. Asus ROG ఫోన్ 7 క్వాల్‌కామ్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ చిప్, స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoCని కలిగి ఉంటుందని భావిస్తున్నారు.