Asus Zenbook 17 Fold : 17.3 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లేతో ఆసుస్ జెన్‌బుక్ 17 ఫోల్డ్ ల్యాప్‌టాప్.. ఇండియాలో ధర ఎంతంటే?

Asus Zenbook 17 Fold : ప్రముఖ టెక్ దిగ్గజం ఆసుస్ కంపెనీ నుంచి జెన్‌బుక్ 17 ఫోల్డ్ OLED ల్యాప్‌టాప్ వచ్చేసింది. జనవరిలో CES 2022లో మొదటిసారిగా Asus Zenbook 17 Fold డివైజ్‌ను ప్రదర్శించింది. ఈ ల్యాప్‌టాప్ అధికారికంగా భారత మార్కెట్లో లాంచ్ అయింది.

Asus Zenbook 17 Fold : 17.3 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లేతో ఆసుస్ జెన్‌బుక్ 17 ఫోల్డ్ ల్యాప్‌టాప్.. ఇండియాలో ధర ఎంతంటే?

Asus Zenbook 17 Fold OLED with 17.3-inch foldable display launched in India, costs over Rs 3 lakh

Asus Zenbook 17 Fold : ప్రముఖ టెక్ దిగ్గజం ఆసుస్ కంపెనీ నుంచి జెన్‌బుక్ 17 ఫోల్డ్ OLED ల్యాప్‌టాప్ వచ్చేసింది. జనవరిలో CES 2022లో మొదటిసారిగా Asus Zenbook 17 Fold డివైజ్‌ను ప్రదర్శించింది. ఈ ల్యాప్‌టాప్ అధికారికంగా భారత మార్కెట్లో లాంచ్ అయింది. కొత్త ల్యాప్‌టాప్ 17.3-అంగుళాల ఫోల్డబుల్ OLED డిస్‌ప్లేతో వస్తుంది.

యూజర్లు పెద్ద టాబ్లెట్ లేదా కాంపాక్ట్ మానిటర్‌గా ఉపయోగించవచ్చు. వినియోగదారులు 12.5-అంగుళాల వ్యూ యాంగిల్ పొందవచ్చు. మిగతా సర్‌ఫేస్ ఆన్-స్క్రీన్ కీబోర్డ్‌గా మారి డబుల్ అవుతుంది. ఫోల్డబుల్ ల్యాప్ టాప్ స్క్రీన్‌కు రెండు కీబోర్డులు ఉంటాయి. ల్యాప్‌టాప్ Wi-Fi 6E, డాల్బీ స్పీకర్లు, రెండు థండర్‌బోల్ట్ 4 పోర్ట్‌లు, 12వ-జెన్ ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్‌లు ఉన్నాయి.

Asus Zenbook 17 ఫోల్డ్ OLED ధర ఎంతంటే? :
ప్రపంచంలోనే మొట్టమొదటి 17-అంగుళాల ఫోల్డబుల్ ల్యాప్‌టాప్ అని ఆసుస్ పేర్కొంది. జెన్‌బుక్ 17-ఫోల్డ్ OLED డిస్‌ప్లే భారతీయ యూజర్లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో రూ. 329,990కి అందుబాటులో ఉంది. గత కొన్ని వారాలుగా రూ. 2,84,290కి ప్రీ-బుక్ చేసేందుకు అందుబాటులో ఉంది.

Asus Zenbook 17 Fold OLED with 17.3-inch foldable display launched in India, costs over Rs 3 lakh

Asus Zenbook 17 Fold OLED with 17.3-inch foldable display launched in India

Asus Zenbook 17 ఫోల్డ్ OLED స్పెసిఫికేషన్లు :
ఆసుస్ కంపెనీ BOEతో కలిసి డిస్‌ప్లేను రూపొందించింది. ల్యాప్‌టాప్ యాజమాన్య ఫోల్డబుల్ హింగ్‌లను ఉపయోగిస్తుంది. ఎర్గోసెన్స్ బ్లూటూత్ కీబోర్డ్‌తో వస్తుంది. కేవలం 5.5 మిమీ సన్నగా, 300గ్రా బరువు ఉంటుంది. కీబోర్డ్ క్లామ్‌షెల్ ఓరియంటేషన్‌లో ఫోల్డ్ అయినప్పుడు స్క్రీన్‌పై మాగ్నెటిక్‌గా స్టిక్ అవుతుంది. యూజర్లు డిస్ప్లే కింది సగం భాగాన్ని కీబోర్డ్‌గా ఉపయోగించవచ్చు. ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగా కాకుండా.. జెన్‌బుక్ 17 ఫోల్డ్ OLED బయట కవర్ స్క్రీన్‌ను కలిగి ఉండదు.

మెయిన్ డిస్‌ప్లేతో వచ్చింది. 17.3-అంగుళాల డిస్‌ప్లేతో బ్లూ లైట్ తగ్గించడానికి TUV రైన్‌ల్యాండ్-సర్టిఫికేట్ పొందింది. డాల్బీ విజన్ సపోర్ట్, 100 శాతం DCI-P3 గామట్‌ను పొందుతుంది. స్క్రీన్ 2560×1920 రిజల్యూషన్‌ను 4:3 యాస్పెక్ట్ రేషియోతో దాని అన్‌ఫోల్డ్ ఫారమ్ ఫ్యాక్టర్‌లో అందిస్తుందని ఆసుస్ తెలిపింది. ఫోల్డ్ అయినప్పుడు డిస్ప్లే 3:2 నిష్పత్తితో 1920×1280 పిక్సెల్ రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఓనర్ కీలు 30,000 కన్నా ఎక్కువ ఓపెన్-అండ్-క్లోజ్ సైకిళ్లను తట్టుకునేలా టెస్టింగ్ నిర్వహించారు.

Asus Zenbook 17 Fold OLED with 17.3-inch foldable display launched in India, costs over Rs 3 lakh

Asus Zenbook 17 Fold OLED with 17.3-inch foldable display launched in India

12వ జనరేషన్ ఇంటెల్ కోర్ i7-1250U ప్రాసెసర్ నుంచి 10 కోర్లతో (రెండు పర్ఫార్మెన్స్ కోర్స్, 8 ఎఫిషియెన్సీ కోర్స్) పవర్ అందిస్తుంది. ల్యాప్‌టాప్‌లో 16GB 5200MHz LPDDR5 RAM, 1TB PCIe 4.0 SSD కూడా ఉన్నాయి. కనెక్టివిటీ ఆప్షన్లలో 4K డిస్‌ప్లే అవుట్‌పుట్, 40 GB/s డేటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్ అందించడానికి రెండు థండర్‌బోల్ట్ 4 పోర్ట్‌లు ఉన్నాయి.

టైప్-C పోర్ట్‌లు 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తాయి. ఏదైనా USB PD ఛార్జర్‌ని ఉపయోగించి టాప్ అప్ చేయవచ్చు. 3.5mm ఆడియో జాక్ ఉంది, కానీ USB-A పోర్ట్ లేదు. Wi-Fi 6E, బ్లూటూత్ 5.2, 75WHr బ్యాటరీ, IRతో కూడిన 5-MP కెమెరా, కోర్టానా, అలెక్సా వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ వంటి ఇతర ముఖ్య ఫీచర్లు ఉన్నాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Self-Chat : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. సెల్ఫ్-చాట్ ఆప్షన్ వచ్చేసింది.. ఇక మీకు మీరే మెసేజ్ చేసుకోవచ్చు..!