Battlegrounds Mobile India : ఆండ్రాయిడ్ BGMI అఫీషియల్ వెర్షన్ వచ్చేసింది.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..!

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గుడ్ న్యూస్.. బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) అఫీషియల్ వెర్షన్ అందుబాటులోకి వచ్చేసింది. గూగుల్ ప్లేస్టోర్‌లో Battlegrounds Mobile India ఆండ్రాయిడ్ వెర్షన్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Battlegrounds Mobile India : ఆండ్రాయిడ్ BGMI అఫీషియల్ వెర్షన్ వచ్చేసింది.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..!

Battlegrounds Mobile India

Battlegrounds Mobile India : ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గుడ్ న్యూస్.. బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) అఫీషియల్ వెర్షన్ అందుబాటులోకి వచ్చేసింది. గూగుల్ ప్లేస్టోర్‌లో Battlegrounds Mobile India ఆండ్రాయిడ్ వెర్షన్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. జూన్ 18నే ఈ ఆన్ లైన్ గేమ్ వెర్షన్ రిలీజ్ చేయగా.. జూలై 2న బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా రిలీజ్ తేదీని ఇప్పటికే Karfton ప్రకటించింది. ఇదివరకే ఈ గేమ్ యాక్సస్ చేసుకున్న యూజర్లతో పాటు ఆండ్రాయిడ్ యూజర్లు కూడా గూగుల్ ప్లే స్టోర్ నుంచి BGMI Official Version డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

కానీ, ఐఓఎస్ (iOS) యూజర్లకు మాత్రం ఈ వెర్షన్ అందుబాటులో లేదు. Battlegrounds Mobile India (BGMI) official version డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ముందుగా ఈ లింక్ ద్వారా గూగుల్ ప్లే స్టోర్ లో(Google Play Store)కి వెళ్లండి. ఈ BGMI యాప్‌ను మొబైల్ డేటా లేదా Wi-Fi ద్వారా ఇన్ స్టాల్ చేసుకోండి. ఇదివరకే గేమ్ యాక్సస్ చేసుకున్న యూజర్లతో పాటు కొత్తగా చేరే ప్లేయర్లకు ఒకే ప్రాసెస్ ఉంటుంది.

BGMI బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇన్ స్టాల్ చేసుకోవాలంటే కనీస సిస్టమ్ రిక్వైర్స్ మెంట్స్ తప్పక ఉండాలి. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ గేమ్ యాప్ రన్ కావాలంటే Android 5.1.1 వెర్షన్ లేదా ఆపై వెర్షన్ అయి ఉండాలి. అలాగే కనీసం 2GB RAM ఉండాలి. అప్పుడే ఈ గేమ్ ఈజీగా రన్ అవుతుంది.

ఈ గేమ్ ఆడే యూజర్ల కోసం BGMI అనేక ఈవెంట్లు, రీవార్డులను రిలీజ్ చేయనున్నట్టు Krafton ప్రకటించింది. ఇండియాకు చెందిన బాటిల్ గ్రౌండ్స్ ఈవెంట్ ద్వారా పర్మినెంట్ పర్పల్ ఔట్ పిట్ ఉచితంగా పొందవచ్చు. Sign-Up. 1 మిలియన్ డౌన్ లోడ్స్, 5 మిలియన్ డౌన్ లోడ్ల ద్వారా సప్లయ్ క్రేట్ కూపన్స్ కూడా పొందవచ్చు. ఇక కానస్టేబుల్ సెట్ కు మాత్రం 10 మిలియన్ల డౌన్ లోడ్ రివార్డు పొందవచ్చు. ఆగస్టు 19వరకు ఈ రివార్డులను పొందవచ్చు. Weekend Vibes, Celebration Time, Friends for Life వంటి మరిన్ని ఈవెంట్లను త్వరలో రిలీజ్ చేయనుంది.