Best Earphones : రూ.10వేల లోపు బెస్ట్ నాయిస్ క్యాన్సిలింగ్ ఇయర్ ఫోన్లు ఇవే..

Best Earphones : ప్రతిఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్ ఎంత ముఖ్యమో.. ఇప్పుడు వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు కూడా ప్రముఖంగా మారాయి.

Best Earphones : రూ.10వేల లోపు బెస్ట్ నాయిస్ క్యాన్సిలింగ్ ఇయర్ ఫోన్లు ఇవే..

Best Active Noise Cancelling Earphones Under Rs 10,000 Sony Wf 1000xm3 And Oppo Enco X Are Top Picks (1)

Best Earphones : ప్రతిఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్ ఎంత ముఖ్యమో.. ఇప్పుడు వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు కూడా ప్రముఖంగా మారాయి. ప్రత్యేకించి వివిధ బ్రాండ్‌లు తమ స్మార్ట్ ఫోన్‌లలో 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను నిలిపివేశాయి. దాంతో మార్కెట్‌లో వందల వేల ఇయర్‌బడ్‌లు అందుబాటులోకి వచ్చేశాయి. ఫీచర్ల ప్రకారం వాటి ధర ఉంటుంది. సరసమైన ధరకే లభించే ఇయర్‌బడ్‌లు ఎన్నో ఉన్నాయి. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వంటి ప్రీమియం ఫీచర్‌లను కోరుకునే చాలా మంది కొనుగోలుదారులు ఖరీదైన ఇయర్‌బడ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. భారత మార్కెట్లో కొనుగోలు చేసే బెస్ట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ ఇయర్‌బడ్‌లలో కొన్నింటిని మీకోసం అందిస్తున్నాం. ఈ ఇయర్‌బడ్‌లు నాయిస్-క్యాన్సిలేషన్ సామర్థ్యంతో పనిచేస్తాయి. డిజైన్, సౌండ్ క్వాలిటీతో ఆకట్టుకునే బ్రాండ్లు మార్కెట్లో లభిస్తున్నాయి. సోనీ, శాంసంగ్, ఒప్పో వంటి బ్రాండ్‌లు ఉన్నాయి. ఇందులో రూ. 10,000 వరకు పెట్టికొనేందుకు సిద్ధంగా ఉంటే.. ఈ బ్రాండ్ ఇయర్ బడ్లలో నచ్చింది ఏదైనా ఒకటి కొనుగోలు చేసుకోవచ్చు.

Best Active Noise Cancelling Earphones Under Rs 10,000 Sony Wf 1000xm3 And Oppo Enco X Are Top Picks (2)

Best Active Noise Cancelling Earphones Under Rs 10,000 Sony Wf 1000xm3 And Oppo Enco X Are Top Picks

Sony WF-1000XM3 :

Sony బ్రాండ్ టాప్-క్లాస్ ఇయర్‌బడ్‌ WF-1000XM3.. ఇది యాక్టివ్ నాయిస్-క్యాన్సిలేషన్‌తో వచ్చింది. ప్రత్యేకంగా రూపొందించిన Sony WF-1000XM3 డ్యూయల్ నాయిస్ సెన్సార్ టెక్నాలజీతో వచ్చింది. కంపెనీ Q1Ne చిప్ సాయంతో అత్యంత కఠినమైన శబ్దాలను కూడా తొలగించలగలదు. ఈ ఫీచర్ ట్రాన్స్‌పరెన్సీ మోడ్‌ని ఉపయోగించి మీరు మాట్లాడటానికి అనుమతిస్తుంది. ఇయర్‌ఫోన్‌లలో 6mm డ్రైవర్లు ఉన్నాయి. అందుకే స్పష్టమైన ఆడియోను వినవచ్చు. ఇయర్‌బడ్‌లకు Android, iOS రెండింటిలోనూ Sony మొబైల్ యాప్‌లు సపోర్ట్ చేస్తాయి. సోనీ WF-1000XM3 ధర మార్కెట్లో రూ. 9,879 వద్ద అందుబాటులో ఉంది.

Best Active Noise Cancelling Earphones Under Rs 10,000 Sony Wf 1000xm3 And Oppo Enco X Are Top Picks (3)

Best Active Noise Cancelling Earphones Under Rs 10,000 Sony Wf 1000xm3 And Oppo Enco X Are Top Picks 

Samsung Galaxy Buds Pro

శాంసంగ్ గెలాక్సీ బడ్స్ చాలా కాలంగా బెస్ట్ ఇయర్‌బడ్‌లలో ఒకటిగా ఉన్నాయి. ప్రీమియం డిజైన్‌ను మాత్రమే కలిగి ఉన్నాయి. ఇయర్‌బడ్‌ల నుంచి ఫీచర్లు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు గెలాక్సీ బడ్స్ ప్రో వస్తుంది. గెలాక్సీ బడ్స్ లైవ్‌లో Samsung బీన్-ఆకారపు డిజైన్‌తో వచ్చాయి. బడ్స్ ప్రోలో ఓల్డ్ ఇన్-ఇయర్ డిజైన్ ఉంది. నాయిస్ ఐసోలేషన్‌కు మంచిది. బడ్స్ ప్రో అందించే మెరుగైన యాక్టివ్ నాయిస్-క్యాన్సిలేషన్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఇయర్‌బడ్‌లను తీయకుండానే మాట్లాడగలిగే ట్రాన్స్ పరెన్సీ మోడ్‌తో సహా మూడు మోడ్‌లను పొందుతారు. ఈ ఇయర్‌బడ్స్‌లోని ANC చాలా నాయిస్ సౌండ్స్ తగ్గిస్తుంది. మీకు మంచి ఆడియో అనుభవాన్ని అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ బడ్స్ ప్రో ధర మార్కెట్లో రూ.9,990కు అందుబాటులో ఉంది.

Best Active Noise Cancelling Earphones Under Rs 10,000 Sony Wf 1000xm3 And Oppo Enco X Are Top Picks

Best Active Noise Cancelling Earphones Under Rs 10,000 Sony Wf 1000xm3 And Oppo Enco X Are Top Picks

OnePlus Buds Pro

OnePlus బ్రాండ్ నుంచి ఆకర్షణీయమైన ఇయర్ బడ్స్ అందుబాటులోకి వచ్చాయి. OnePlus బడ్స్ ప్రో అందులో ఒకటి. OnePlus ఇయర్‌బడ్‌లు ఫ్యాన్సీ డిజైన్, టాప్-క్లాస్ ఆడియో క్వాలిటీతో వచ్చాయి. కానీ, మీ ఇయర్ బడ్స్‌లో సౌండ్స్ క్యాన్సిలేషన్ చేయడంలో ముందుంటాయి. OnePlus బడ్స్ ప్రోలోని ANC మీ పరిసరాల్లో వినిపించే నాయిస్ సౌండ్స్ క్లీన్ చేయగలవు. ఫలితంగా మ్యూజిక్ ఎలాంటి అంతరాయం లేకుండా వినవచ్చు. ANC కాకుండా, OnePlus బడ్స్ ప్రో వార్ప్ ఛార్జ్, LHDC సపోర్ట్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ వంటి ఫీచర్లను కూడా అందిస్తుంది. OnePlus Buds Pro TWS ఇయర్‌బడ్స్ ధర రూ. 9,990గా ఉంది. మీరు కంపెనీ వెబ్‌సైట్‌లో ఆఫర్‌లతో తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

Best Active Noise Cancelling Earphones Under Rs 10,000 Sony Wf 1000xm3 And Oppo Enco X Are Top Picks (4)

Best Active Noise Cancelling Earphones Under Rs 10,000 Sony Wf 1000xm3 And Oppo Enco X Are Top Picks 

Oppo Enco X

OnePlus మాదిరిగానే.. Oppo Enco X కూడా డిజైన్ ఫీచర్లలో పెద్దదిగా ఉంటుంది. OnePlus బడ్స్ ప్రో కన్నా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. AirPods ప్రోని పోలి ఉంటాయి. Enco X మంచి యాక్టివ్ నాయిస్-క్యాన్సిలేషన్‌తో వస్తుంది. సౌండ్స్ రిమూవ్ చేయడమే కాకుండా గాలులు వీచే శబ్దాలను కూడా ట్యూన్ చేయగలవు. Enco X మరో ఫీచర్ ఏంటంటే? ఇయర్‌బడ్‌లు హార్న్ సౌండ్ గుర్తించిన వెంటనే కుడి లేదా ఎడమ వైపున నాయిస్ క్యాన్సిలేషన్‌ను వెంటనే యాక్టివేట్ చేస్తాయి. మీ చెవులకు వినేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. Enco X కూడా ప్రీమియం ఆడియో క్వాలిటీని అందిస్తుంది. డానిష్ ఆడియో బ్రాండ్, Dynaudio ద్వారా పనిచేస్తుంది. Oppo Enco X కూడా ఇయర్‌బడ్‌ల ప్రపంచంలో ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ గా మారింది. Oppo Enco X ఇయర్‌బడ్స్ ధర రూ. 9,990గా ఉండగా.. బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

Read Also : Apple Users : ఆపిల్ యూజర్లకు అలర్ట్.. జూన్‌ 1లోపు ఈ రెండింట్లోకి మారండి.. ఎందుకంటే?