BlackBerry 5G Phone : బ్లాక్‌బెర్రీ యూజర్లకు బ్యాడ్‌ న్యూస్.. బ్లాక్‌బెర్రీ 5G అల్ట్రా సెక్యూర్ ఫోన్ రానట్టే..!

మొబైల్ ఫోన్ తయారీ సంస్థ బ్లాక్ బెర్రీ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. బ్లాక్ బెర్రీ పేరంట్ స్టార్టప్ Onward Mobility 5G ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు అధికారికంగా ప్రకటించింది.

BlackBerry 5G Phone : బ్లాక్‌బెర్రీ యూజర్లకు బ్యాడ్‌ న్యూస్.. బ్లాక్‌బెర్రీ 5G అల్ట్రా సెక్యూర్ ఫోన్ రానట్టే..!

Blackberry 5g Phone Is Officially Dead Again, Onward Mobility Startup Licensed Shut Down (1)

BlackBerry 5G Phone : ప్రముఖ దిగ్గజ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ బ్లాక్ బెర్రీ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. బ్లాక్ బెర్రీ పేరంట్ కంపెనీ స్టార్టప్ Onward Mobility 5G ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఆస్టిన్ బేసిడ్ స్టార్టప్ కంపెనీ బ్లాక్ బెర్రీ 5జీ ఫోన్ ప్రయత్నాలపై వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. 5G ప్రాజెక్ట్ నుంచి బ్లాక్ బెర్రీ ఎందుకు తప్పుకుంది? అభివృద్ధి దశలోనే ఉందా? అనేది క్లారిటీ లేదు. వాస్తవానికి BlackBerry 5G Phone స్మార్ట్‌ఫోన్ గత ఏడాదిలోనే లాంచ్ అవుతుందని భావించారు. కానీ, అనుకోని కారణాల వల్ల లాంచింగ్ ఆలస్యమైంది. ఈ ఏడాది చివర్లో కీప్యాడ్‌తో 5G స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనున్నట్టు బ్లాక్‌బెర్రీ కంపెనీ ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ‘ultra-secure phone’ 5G స్మార్ట్‌ఫోన్ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు ప్రకటించింది. బ్లాక్‌బెర్రీ మొబైల్ ఫోన్లు మార్కెట్‌లో మెజారిటీ వాటాను కలిగి ఉండేవి.

కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో బ్లాక్ బెర్రీ 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రాజెక్ట్ ఎందుకు అర్థాతరంగా తప్పకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకు 5G కార్యకలాపాలను నిలిపివేసిందో కంపెనీ కూడా కారణాలను వెల్లడించలేదు. ఆండ్రాయిడ్ పోలీస్ (Android Police) ప్రకారం.. బ్లాక్ బెర్రీ పేరుతో లైసెన్స్‌ను వినియోగానికి స్టార్టప్ కంపెనీ రద్దు చేసినట్టు తెలిపింది. కంపెనీ వెబ్ సైట్లో కూడా ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంపై ప్రస్తావించినా.. అందులో ఎక్కడా కూడా బ్లాక్ బెర్రీ పేరును ప్రస్తావించలేదు. బ్లాక్ బెర్రీ పేరుకు బదులుగా సేఫ్‌గా ‘ultra-secure phone’ అని రాసుకొచ్చింది.

Blackberry 5g Phone Is Officially Dead Again, Onward Mobility Startup Licensed Shut Down

Blackberry 5g Phone Is Officially Dead Again, Onward Mobility Startup Licensed Shut Down

ఈ ఏడాదిలో బ్లాక్ బెర్రీ పేరుతో 5G స్మార్ట్ ఫోన్ QWERTY కీబోర్డుతో తీసుకొస్తున్నట్టుగా కంపెనీ ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్‌వర్డ్‌మొబిలిటీ (Onward Mobility) సంస్థను పూర్తిగా మూసివేస్తున్నట్టు తెలిపింది. కీబోర్డ్‌తో కూడిన అల్ట్రా సెక్యూర్ స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేసేది లేదని ప్రకటించడంపై విచారం వ్యక్తం చేస్తున్నామని పేర్కొంది. ఈ నిర్ణయం తొందరపాటుగా తీసుకున్నది కాదని కస్టమర్లు అర్థం చేసుకోవాలని బ్లాక్‌బెర్రీ పేరంట్ కంపెనీ ఆన్‌వర్డ్‌మొబిలిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

అల్ట్రా-సెక్యూర్ 5G బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్ గత ఏడాదిలోనే లాంచ్ అవుతుందని టాక్ నడిచింది. కరోనా పరిస్థితుల కారణంగా కంపెనీకి సంబంధించిన ప్రణాళికలన్నీ ఆలస్యమయ్యాయి. మరోవైపు జనవరి నుంచి బ్లాక్‌బెర్రీ అందించే క్లాసిక్ మోడల్స్ అన్నింటిపై బ్లాక్‌బెర్రీ ఆధారిత యాక్సెసరీస్‌కు సపోర్ట్ విత్ డ్రా చేసుకుంటున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఆయా ఫోన్‌లకు కీలకమైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అందించేది లేదని స్పష్టం చేసింది. వాయిస్ కాల్స్, SMS సహా.. అత్యవసర కాల్స్ కీలకమైన సర్వీసులను యూజర్లు ఉపయోగించలేరు. ప్రస్తుత బ్లాక్ బెర్రీ యూజర్లంతా మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌లకు మారాలని కంపెనీ సూచిస్తోంది.

Read Also : BlackBerry : బ్లాక్‌బెర్రీ కమ్‌బ్యాక్.. 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఈసారి పక్కా..!