La Voiture Noire: వంద కోట్ల కారు.. తయారీకి 65 వేల గంటలు పట్టిందట

సాధారణంగా చాలామంది మార్కెట్లో ఉన్న ఎదో ఓ కారును కొనుగోలు చేస్తుంటారు. అదే సంపన్నులైతే ప్రత్యేకంగా తయారు చేయించుకుంటారు. అన్ని హంగులు ఉండే విధంగా తమ అభిరుచికి తగినట్లుగా కార్లను డిసైన్ చేయించుకుంటారు.

La Voiture Noire: వంద కోట్ల కారు.. తయారీకి 65 వేల గంటలు పట్టిందట

La Voiture Noire (2)

La Voiture Noire: సాధారణంగా చాలామంది మార్కెట్లో ఉన్న ఎదో ఓ కారును కొనుగోలు చేస్తుంటారు. అదే సంపన్నులైతే ప్రత్యేకంగా తయారు చేయించుకుంటారు. అన్ని హంగులు ఉండే విధంగా తమ అభిరుచికి తగినట్లుగా కార్లను డిసైన్ చేయించుకుంటారు. వీరికి కార్లను డిసైన్ చేసేందుకు ప్రముఖ కంపెనులు క్యూ కడుతుంటాయి.

ఇటువంటి వారికి కార్లను డిసైన్ చేస్తే డబ్బుతోపాటు ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని కార్ల కంపెనీలు ఆరాటపడుతుంటాయి. అయితే అన్ని హంగులున్న కారును ఓ బిలియనీర్ తయారు చేయించుకున్నారు. అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే బుగాటీ కార్ల కంపెనీ దీనిని తయారుచేసింది.

New Project (6)

నలుపు రంగులో ఉండే ఈ కారు ఖరీదు 13.4 మిలియన్ డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలి అంటే సుమారు రూ.100 కోట్లు. ఈ కారును తయారు చేసేందుకు దాదాపు 65 వేల గంటలు పనిచేసారు ఇంజనీర్లు. అంత సమయం ఆ కారు కోసం కేటాయిస్తే కానీ దానిని పూర్తి చేయలేకపోయారు. ఇక ఈ కారును లా వాయిచర్ నొయిరే అని పిలుస్తారు.

La Voiture Noire (3)

 

2019లో జెనీవాలో నిర్వహించిన ఆటో షోలో ఈ కారు తొలి మోడల్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు మరో మోడల్ తయారు చేస్తున్నారు. అది ఈ ఏడాది చివరివరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నలుపు రంగులో స్పోర్ట్స్ కారును పోలి ఉంటుంది. 8.0 hp సామర్థ్యం కలిగిన ఈ కారు 16 లీటర్ల w ఇంజన్ కలిగి ఉంటుంది. దీని ముందు భాగం 3డీ ప్రింటెడ్ డిసైన్ తో చేశారు.