EPFO Customers Alert : మీ పీఎఫ్‌ అకౌంట్లో ఈ-నామినేషన్ చేయలేదా? రూ.7 లక్షలు పోయినట్టే..!

పీఎఫ్ అకౌంట్ కలిగిన ఖాతాదారులు తప్పనిసరిగా తమ అకౌంట్లో నామినీ పేరును చేర్చాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ అకౌంట్లలో నామినీ పేరును నమోదు చేయకపోతే మీకు రావాల్సిన డబ్బులు రానట్టే..

EPFO Customers Alert : మీ పీఎఫ్‌ అకౌంట్లో ఈ-నామినేషన్ చేయలేదా? రూ.7 లక్షలు పోయినట్టే..!

Epf Alert Don't Miss Out On Rs 7 Lakh Insurance For Family Members

EPFO Customers Alert : ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO) పీఎఫ్‌ ఖాతాదారులకు అలర్ట్.. ప్రస్తుత పరిస్థితుల్లో పీఎఫ్ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే పీఎఫ్ ఖాతాకు సంబంధించిన అన్ని పనులను పూర్తి అయిపోతున్నాయి. అయితే పీఎఫ్ అకౌంట్ కలిగిన ఖాతాదారులు తప్పనిసరిగా తమ అకౌంట్లో నామినీ పేరును చేర్చాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ అకౌంట్లలో నామినీ పేరును చేర్చేందుకు గడువును కూడా ఈపీఎఫ్ఓ పొడిగించింది. ఇటీవల యూజర్లు పీఎఫ్ అకౌంట్లో నామినీ చేర్చేందుకు ప్రయత్నించగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దాంతో పొడిగించిన గడువును కూడా తొలగించింది.

నామినీ పేరును చేర్చని పీఎఫ్ ఖాతాదారులు ఎవరైనా సరే వెంటనే తమ నామినీ పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు నామినీ పేరును నమోదు చేయకపోతే మీకు రావాల్సిన డబ్బులు రానట్టే.. ఎందుకంటే.. పీఎఫ్ ఖాతాదారుడికి ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయిన సమయంలో సమారుగా రూ. 7 లక్షల వరకు బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. అది కూడా నామినీగా ఉన్నవారికి ఈ ప్రయోజనం దక్కనుంది. మీ పీఎఫ్ అకౌంట్లో నామినీ పేరును చేర్చని వారు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈపీఎఫ్ నామినీని ఇప్పటివరకూ మార్చేందుకు పీఎఫ్ మెంబర్స్ కొత్త నామినేషన్ దాఖలు చేసుకోవచ్చునని ఈపీఎఫ్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Epf Alert Don't Miss Out On Rs 7 Lakh Insurance For Family Members (1)

Epf Alert Don’t Miss Out On Rs 7 Lakh Insurance For Family Members

పీఎఫ్ ఉద్యోగులకు వివిధ సర్వీసులను సకాలంలో పూర్తి చేసేందుకు వీలుగా ఈపీఎఫ్ఓ కొత్త విధానాలను తీసుకొస్తోంది. ఇప్పటికే నామినేషన్ పేరు మార్చుకోవడానికి ఖాతాదారులు ఎవరూ పీఎఫ్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్ లైన్ లోనే ఇంట్లో నుంచే మీ నామినేషన్ చేర్చుకోవచ్చు. ఈ-నామినేషన్ చేర్చడం ద్వారా ఖాతాదారుడి మరణానంతరం సదరు వ్యక్తికి నామినీగా ఉన్న వారికి రూ.7 లక్షల వరకు ఇన్సూరెన్స్ కింద అందుతాయి. అందుకే ఆన్ లైన్ ద్వారా మీ నామినీ పేరును వెంటనే చేర్చుకోవాలని ఈపీఎఫ్ ఖాతాదారులకు సూచిస్తోంది. ఇప్పటివరకూ ఈ-నామినీ చేర్చుకోకుంటే ఇప్పుడే ఈ కింది విధంగా ఫాలో అవుతూ ఈ-నామినీని నమోదు చేయండి..

EPFO Customers Alert : ఈ-నామినీ చేర్చే ప్రక్రియ ఇదే :

EPFO పోర్టల్‌ అధికారిక లింక్‌పై Click చేయండి.
మీ UAN నెంబర్, దాని పాస్‌వర్డ్‌తో Login కావాలి.
ఇంకా ఈ-నామినేషన్‌ చేర్చకపోతే మీకు Pop-UP వస్తుంది. ఈ-నామినేషన్‌పై క్లిక్‌ చేయాలి.
ఫ్యామిలీ డిక్లరేషన్‌ అప్‌డేట్‌ కోసం అక్కడ క్లిక్‌ చేయాల్సి ఉంటుంది.
మీ ఫ్యామిలీలోని కుటుంబ సభ్యుల ఆధార్‌ నంబర్‌, పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫొటో, చిరునామా, బ్యాంకు అకౌంట్‌ వివరాలను రిజిస్టర్ చేసుకోవాలి.
ఆ తర్వాత నామినేషన్‌ వివరాలపై Click చేయాలి.
ఆ తర్వాత సేవ్‌ EPF నామినేషన్‌పై క్లిక్‌ చేయాలి.
OTP Generate చేయడం కోసం e-Signపై క్లిక్‌ చేయాలి.
ఆధార్‌తో లింక్‌ చేసిన మొబైల్‌ నెంబర్‌కు OTP వస్తుంది.
ఆ OTPని నమోదు చేసి Submit చేయాలి.
మీ e-nomination రిజిస్టర్‌ అవుతుంది.
ఈ ప్రాసెస్‌ ద్వారా e-nomination ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
మీ ఆధార్‌ నంబర్‌ UANకు లింక్‌ అయి ఉందో లేదో చెక్ చేసుకోవాలి.
మీ ఆధార్‌ నెంబర్‌కు కూడా మొబైల్‌ నెంబర్‌ లింక్ అయి ఉండాలి.
అప్పుడు మాత్రమే పీఎఫ్ అకౌంట్లో ఈ-నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయగలరు.

Read Also : BSNL Fiber : BSNL చీపెస్ట్ ఇంటర్నెట్ ప్లాన్ ఇదే.. 1TB డేటా మీ సొంతం.. ధర ఎంతంటే?