iPhone Secret Button : ప్రతి ఐఫోన్‌లోనూ ఒక సీక్రెట్ బటన్ ఉందని తెలుసా? ఆ బటన్ ఎక్కడ? ఎలా పనిచేస్తుందంటే?

iPhone Secret Button : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. మీ ఐఫోన్‌లో మల్టీ టాస్క్ చేయగల సీక్రెట్ బటన్ ఉందని మీకు తెలుసా? ఆ బటన్ కుడి వైపున లేదా ఎడమ వైపున ఉండదు. పైనా లేదా కింద కూడా ఆ బటన్‌ ఉండదు. మరి ఆ సీక్రెట్ బటన్ ఐఫోన్‌లో ఎక్కడ ఉంటుందంటే..

iPhone Secret Button : ప్రతి ఐఫోన్‌లోనూ ఒక సీక్రెట్ బటన్ ఉందని తెలుసా? ఆ బటన్ ఎక్కడ? ఎలా పనిచేస్తుందంటే?

Every iPhone has a secret button that can be used for changing volume, locking app, here is how to find it

iPhone Secret Button : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. మీ ఐఫోన్‌లో మల్టీ టాస్క్ చేయగల సీక్రెట్ బటన్ ఉందని మీకు తెలుసా? ఆ బటన్ కుడి వైపున లేదా ఎడమ వైపున ఉండదు. పైనా లేదా కింద కూడా ఆ బటన్‌ ఉండదు. మరి ఆ సీక్రెట్ బటన్ ఐఫోన్‌లో ఎక్కడ ఉంటుందంటే.. ఐఫోన్ వెనుక భాగంలో ఉంటుంది. ఫిజికల్ బటన్ కోసం వెతకొద్దు. ఎందుకంటే అక్కడ ఏది లేదనే విషయాన్ని గుర్తించుకోండి. మీరు ఐఫోన్‌లో ‘Black Tap’ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు. తద్వారా నిర్దిష్ట కార్యకలాపాలను నిర్వహించేందుకు వెనుక ప్యానెల్ మొత్తాన్ని బటన్‌గా ఉపయోగించవచ్చు.

అంతేకాదు.. ఐఫోన్ ఫిజికల్ బటన్‌పై నొక్కండి. బ్లాక్ ట్యాప్ ఫీచర్ iOS 14 లేదా తర్వాత రన్ అయ్యే iPhoneలలో అందుబాటులో ఉంది. మీరు బ్యాక్ ట్యాప్ ఫీచర్‌ని ప్రారంభించిన తర్వాత.. మీ iPhone వెనుక భాగంలో త్వరితగతిన రెండుసార్లు లేదా మూడుసార్లు Tap చేయడం ద్వారా కంట్రోల్ సెంటర్‌ని ఓపెన్ చేయవచ్చు. అంతేకాదు.. స్క్రీన్‌షాట్ కూడా తీయవచ్చు, యాక్సస్-నిర్దిష్ట యాక్షన్లను కూడా ప్రారంభించవచ్చు. ఇంకా మరిన్ని టాస్కులు పూర్తి చేయవచ్చు.

Every iPhone has a secret button that can be used for changing volume, locking app, here is how to find it

Every iPhone has a secret button that can be used for changing volume, locking app

మీరు Back Tapకి ఆప్షన్ కోసం షార్ట్‌కట్‌లను యాడ్ చేయవచ్చు. ఉదాహరణకు.. మీరు ఫోన్ వెనుక భాగంలో రెండుసార్లు Tap చేసి.. స్క్రీన్‌ను Lock చేయవచ్చు. అదేవిధంగా, మీరు ఒకసారి Tap చేస్తే.. రొటేషన్ ఫీచర్ లాక్ చేయవచ్చు. వెనుకవైపు ఉన్న ట్యాప్‌లను ఉపయోగించి కెమెరాను కూడా ఓపెన్ చేయవచ్చు. మీ ఐఫోన్ వెనుక ప్యానెల్‌లో రెండుసార్లు నొక్కడం ద్వారా సింగిల్ ట్యాప్ ద్వారా మీరు ఏ కార్యకలాపాలను నిర్వహించాలనుకుంటున్నారో చేయవచ్చు.

ఆసక్తికరంగా, బ్యాక్ ట్యాప్ ఫీచర్‌ని ఉపయోగించడం ద్వారా వినియోగదారులు పైకి క్రిందికి స్క్రోల్ చేయవచ్చు. ఈ ఆసక్తికరమైన ఐఫోన్ ఫీచర్‌ని మీరు ఎలా ఉపయోగించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే, బ్యాక్ ట్యాప్ ఫీచర్ ఐఫోన్ యూజర్లందరికి అందుబాటులో లేదు. మీ ఫోన్ iOS 14 లేదా తర్వాతి వెర్షన్‌లో రన్ అవుతున్నట్లయితే మాత్రమే మీరు ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. సీక్రెట్ బటన్ ఫీచర్‌ని ఉపయోగించడానికి కొత్త iPhoneకి అప్‌గ్రేడ్ చేసుకోవాలి లేదా లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌కి అప్‌డేట్ చేసుకోవాలి.

Every iPhone has a secret button that can be used for changing volume, locking app, here is how to find it

Every iPhone has a secret button that can be used for changing volume, locking app

ఐఫోన్‌లో బ్లాక్ ట్యాప్‌ను ఎలా వాడాలంటే? :
* మీ ఐఫోన్‌ను Unlock చేయండి.
* Settings వెళ్లండి. ఆపై యాక్సెసిబిలిటీపై Tap చేయండి. ఆపై టచ్‌కి వెళ్లి, Back Tap నొక్కండి.
* మీరు Back Tapని డిసేబుల్ లేదా ఎనేబుల్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది.
* డబుల్ ట్యాప్ లేదా ట్రిపుల్ ట్యాప్‌ని ట్యాప్ చేసి.. ఒక యాక్షన్ ఎంచుకోండి.
* మీరు సెట్ చేసిన యాక్షన్ ట్రిగ్గర్ చేసేందుకు మీ iPhone వెనుక భాగంలో రెండుసార్లు లేదా మూడుసార్లు నొక్కండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : BSNL Broadband Plans : 40mbps స్పీడ్‌తో BSNL నుంచి కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ ఇవే.. ధర ఎంతంటే?