Facebook Outage : ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ మళ్లీ డౌన్.. ఏకిపారేసిన నెటిజన్లు!

ప్రపంచ సోషల్ దిగ్గజం ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్ సర్వీసులు మళ్లీ నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా బుధవారం (నవంబర్ 3) అర్ధరాత్రి నుంచి ఫేస్ బుక్, ఇన్ స్టా సర్వీసులు నిలిచిపోయాయి.

Facebook Outage : ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ మళ్లీ డౌన్.. ఏకిపారేసిన నెటిజన్లు!

Facebook, Instagram Appear To Be Down For Some Users; Memes Start Pouring In On Twitter

Facebook Outage :  ప్రపంచ సోషల్ దిగ్గజం ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్ సర్వీసులు మళ్లీ నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా బుధవారం (నవంబర్ 3) అర్ధరాత్రి నుంచి ఫేస్ బుక్, ఇన్ స్టా సర్వీసులు నిలిచిపోయాయి. దాంతో యూజర్లంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారత్‌ సహా ఇతర దేశాల్లో ఫేస్‌బుక్‌, ఇన్ స్టాగ్రామ్ సర్వీసులు ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయాయి. నెటిజన్లు ఆగ్రహానికి గురయ్యారు. ప్రముఖ సంస్థ ‘డౌన్ డిటెక్టర్’ ఫేస్‌బుక్‌కు చెందిన సోషల్‌ మీడియా ప్లాట్ ఫామ్ సేవలు నిలిచిపోయినట్లు వెల్లడించింది.

భారత కాలమానం ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి 12:1 నిమిషాల సమయంలో సుమారు 4,700మంది భారత యూజర్లు సర్వీసులు నిలిచిపోవడంపై ఫిర్యాదు చేశారని డిటెక్టర్ సంస్థ తెలిపింది. ఫేస్‌బుక్‌ 150మంది, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ కు సంబంధించి 260 మంది రిపోర్ట్‌ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 9,800 మంది ఇన్‌స్ట్రాగ్రామ్‌ యూజర్లు ఫిర్యాదు చేయగా.. 3,800మంది ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ యూజర్లు, 2,600మంది ఫేస్‌బుక్‌ యూజర్లు రిపోర్ట్‌ చేసినట్లు డౌన్‌ డిటెక్టర్‌ పేర్కొంది. ఫేస్‌బుక్‌తో పాటు ఇన్‌స్ట్రాగ్రామ్‌ సర్వీసులు నిలిచిపోవడంపై #instagramdown అనే హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతుంది.
Read Also : Trisha : దుబాయ్ నుంచి అరుదైన గౌరవం అందుకున్న ఫస్ట్ సౌత్ హీరోయిన్ గా త్రిష

ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌ EMEA కమ్యూనికేషన్‌ మేనేజర్‌ అలెగ్జాండ్రూ వాయిస్కా స్పందించారు. మెసేజింగ్‌ యాప్స్‌ వర్క్ చేయడం లేదని అన్నారు. సాధ్యమైనంత తొందరగా ఆ బగ్ ఎక్కడ ఉందో గుర్తించి ఫిక్స్ చేస్తామన్నారు. అతి త్వరలోనే అందుబాటులోకి తెస్తామని చెప్పారు. మెసేజింగ్‌ సర్వీసులు నిలిచిపోయినందుకు క్షమించండి అంటూ ఇన్‌స్ట్రాగ్రామ్‌ అఫిషియల్‌ అకౌంట్‌ నుంచి బుధవారం అర్ధరాత్రి 1.33గంటలకు వాయిస్కా మెసేజ్‌ చేశారు. మరోసారి తెల్లవారు జామున 4.34 గంటల ప్రాంతంలో వీఆర్‌ బ్యాక్‌ (We are Back) బగ్‌ను గుర్తించి సమస్యను పరిష్కరించామంటూ వాయిస్కా మరోసారి మెసేజ్‌ చేశారు. సాంకేతిక సమస్య ఎలా వచ్చిందో వెల్లడించలేదు.

గత అక్టోబర్‌ నెలలో వరుసగా రెండు సార్లు ఫేస్ బుక్, ఇన్ స్టా సర్వీసులు నిలిచిపోయాయి. నవంబర్ 3న  అర్ధరాత్రి  మళ్లీ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు నిలిచిపోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫేస్‌బుక్‌ ఫ్లాట్‌ఫామ్‌లను వదిలేసి ట్విట్టర్‌ను వినియోగిస్తామంటూ  మీమ్స్‌ వేస్తున్నారు. ఆ మీమ్స్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి.