How To Get WiFi Password : WiFi పాస్‌వర్డ్ మరిచిపోయారా? మీ ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ఐఫోన్ నుంచి ఇలా రికవరీ చేయొచ్చు!

How To Get WiFi Password : ఇంటర్నెట్ యూజర్లలో చాలామంది తమ వైఫై పాస్‌వర్డ్‌ల (Wifi Password)ను తరచుగా మరచిపోతుంటారు. సేఫ్టీ అండ్ స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవాలి.

How To Get WiFi Password : WiFi పాస్‌వర్డ్ మరిచిపోయారా? మీ ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ఐఫోన్ నుంచి ఇలా రికవరీ చేయొచ్చు!

Forgot WiFi Password, Forgot WiFi Password recover, how to recover Forgot WiFi Password, How To Get WiFi Password

How To Get WiFi Password : ఇంటర్నెట్ యూజర్లలో చాలామంది తమ వైఫై పాస్‌వర్డ్‌ల (Wifi Password)ను తరచుగా మరచిపోతుంటారు. సేఫ్టీ అండ్ స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవాలి. ఏదైనా ఇతర డివైజ్‌లకు కనెక్ట్ చేసేందుకు ప్రయత్నించినప్పుడు లేదా మీ స్నేహితుడు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా పాస్‌వర్డ్‌ని అడిగినప్పుడు పాస్‌వర్డ్‌లుగా సెట్ చేసిన అన్ని కోడ్‌లు, పిన్‌లను గుర్తించుకోవడం కష్టమే. ఒకవేళ మీరు కూడా మీ వైఫై పాస్‌వర్డ్ మర్చిపోయి ఉంటే.. ఆ పాస్‌వర్డ్ తెలుసుకోవాలంటే.. మీ హోమ్ వైఫై పాస్‌వర్డ్‌ను మీ Android లేదా iOS మొబైల్ ద్వారా పాస్‌వర్డ్‌ను కనుక్కోవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్‌లలో Wifi Password  చెక్ చేయండి :
మీరు Android 10 డివైజ్ లేదా తర్వాతి డివైజ్ ఉపయోగిస్తుంటే.. మీరు కనెక్ట్ చేసిన WiFi లేదా మీ సర్వీసుకు సంబంధించిన అన్ని నెట్‌వర్క్‌ల పాస్‌వర్డ్‌ను సులభంగా చెక్ చేయవచ్చు.

సెట్టింగ్‌ ఓపెన్ చేసి.. వైఫై & నెట్‌వర్క్‌పై ట్యాప్ చేయండి :
మీరు కనెక్ట్ చేసిన WiFi లేదా Save చేసిన నెట్‌వర్క్ Lock లేదా ‘i’ ఐకాన్‌పై క్లిక్ చేయండి.

షేర్ పాస్‌వర్డ్‌ (Share Password) పై క్లిక్ చేయండి :
స్క్రీన్‌ను అన్‌లాక్ చేసేందుకు మీ డివైజ్ అన్‌లాక్ పిన్ లేదా ఫింగర్ ప్రింట్ నమోదు చేయొచ్చు.
QR కోడ్, WiFi పాస్‌వర్డ్ పైన లేదా కింద మీకు స్క్రీన్ ఓపెన్ అవుతుంది.
ఇప్పుడు, మీరు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లేదా QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా ఇతర డివైజ్‌కు కనెక్ట్ చేయవచ్చు.

Forgot WiFi Password, Forgot WiFi Password recover, how to recover Forgot WiFi Password, How To Get WiFi Password

Forgot WiFi Password, Forgot WiFi Password recover, how to recover Forgot WiFi Password, How To Get WiFi Password

ఐఫోన్‌లలో Wifi Password చెక్ చేయండిలా :
ఐఫోన్‌లో Wifi పాస్‌వర్డ్‌ను గుర్తించడం కష్టమే. Apple ప్రైవసీ చాలా ప్రొటెక్ట్ గా ఉంటుంది. భద్రతా విధానాల కారణంగా మీరు మీ iPhoneలో Save చేసిన నెట్‌వర్క్‌ల WiFi పాస్‌వర్డ్‌లను చెక్ చేయడం కష్టం. కానీ, దీనికి ఒక మార్గం ఉంది. macOS PC మీ దగ్గర ఉండాలి. MacOS PC ఉపయోగించి iOS మొబైల్‌లలో WiFi పాస్‌వర్డ్‌లను తెలుసుకోవచ్చు.

మీ ఐఫోన్‌లో సెట్టింగ్‌ (setting)ను ఓపెన్ చేయండి :
* iCloud ఓపెన్ చేయండి.
* Keychain ఆప్షన్ కనుగొనాలి. ఆపై Tap చేయండి.
* మళ్లీ సెట్టింగ్‌లకు వెళ్లి.. మీ పర్సనల్ హాట్‌స్పాట్‌ (Hotspot)ను On చేయండి.
* ఇప్పుడు మీ Macని మీ పర్సనల్ హాట్‌స్పాట్‌కి కనెక్ట్ చేయండి.
* స్పాట్‌లైట్ సెర్చ్ (CMD+Space) ఓపెన్ చేసి.. Keychain Access అని టైప్ చేసి ఎంటర్ Press చేయండి.
* ఇప్పుడు మీరు పాస్‌వర్డ్‌ కావాల్సిన వైఫై నెట్‌వర్క్ కోసం సెర్చ్ చేయండి.
* నెట్‌వర్క్ వివరాలకు సంబంధించి పాప్-అప్ విండో ఓపెన్ అవుతుంది.
* ‘Show Password’పై Tap చేయండి.
* మీ యూజర్ లాగిన్ వివరాలను ఎంటర్ చేయండి.
* మీ Mac WiFi నెట్‌వర్క్ పాస్‌వర్డ్‌ను అక్కడే చూపిస్తుంది.

Read Also : Google User Data Track : వామ్మో.. గూగుల్‌తో జాగ్రత్త.. ఫేస్‌బుక్, ఆపిల్ కన్నా ఎక్కువగా యూజర్ల డేటాను ట్రాక్ చేస్తోంది..!