Google Pixel 7 Series : గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ ధర భారీగా తగ్గిందోచ్.. ఇదే సరైన సమయం.. డోంట్ మిస్.. వెంటనే కొనేసుకోండి..!

Google Pixel 7 Series : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ (Google Pixel 7 Series) కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. పిక్సెల్ 7 సిరీస్ అతి తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ అందుబాటులో ఉంది.

Google Pixel 7 Series : గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ ధర భారీగా తగ్గిందోచ్.. ఇదే సరైన సమయం.. డోంట్ మిస్.. వెంటనే కొనేసుకోండి..!

Google Pixel 7 Series _ Get up to Rs. 22,500 off on Pixel 7, Pixel 7 Pro _ Here’s how

Google Pixel 7 Series : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ (Google Pixel 7 Series) కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. పిక్సెల్ 7 సిరీస్ అతి తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ అందుబాటులో ఉంది. గూగుల్ పిక్సెల్ 7, గూగుల్ పిక్సెల్ 7 pro సిరీస్ ఫ్లిప్‌కార్ట్ రిటైల్ ధరను తగ్గించే స్మార్ట్‌ఫోన్‌లపై ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు, డీల్స్‌ను ఇస్తోంది. Google Pixel 7 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 59,999 వద్ద అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కొనుగోలుపై రూ. 22,500 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు.

అదనంగా, HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 5,000 డిస్కౌంట్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అదేవిధంగా, Pixel 7 Pro రూ. 84,999 వద్ద అందుబాటులో ఉంది. అలాగే12GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చింది. రూ. 22,500 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ద్వారా ఈ ఫోన్ ధరను రూ. 62,499కి తగ్గిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ (Flipkart) యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు 5శాతం క్యాష్‌బ్యాక్‌తో పాటు, ఈ-టైలర్ HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ లావాదేవీలతో రూ. 10వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

Read Also : WhatsApp Chat Filter : వాట్సాప్‌ చాట్ లిస్టులో మీరు చూడని మెసేజ్‌లను ఈజీగా ఇలా ఫిల్టర్ చేయొచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

Google Pixel 7 ఫీచర్లు ఇవే :
గూగుల్ పిక్సెల్ (Google Pixel 7) 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.32-అంగుళాల Full HD+ (2400×1080 పిక్సెల్‌లు) OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డివైజ్ 8GB RAMతో టెన్సర్ G2 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఆప్టిక్స్ కోసం.. గూగుల్ Pixel 7 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 12MP సెకండరీ సెన్సార్‌తో అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి.

Google Pixel 7 Series _ Get up to Rs. 22,500 off on Pixel 7, Pixel 7 Pro _ Here’s how

Google Pixel 7 Series _ Get up to Rs. 22,500 off on Pixel 7, Pixel 7 Pro

సెల్ఫీల కోసం.. Google నుంచి లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 10.8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. కనెక్టివిటీ ఆప్షన్ల కోసం.. ఈ డివైజ్ 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్ 5.2, GOS, NFC, USB టైప్-C పోర్ట్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 13 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది.

Google Pixel 7 Pro ఫీచర్లు ఇవే :
Google Pixel 7 Pro Google Tensor G2 చిప్‌సెట్ ద్వారా పొందవచ్చు. హ్యాండ్‌సెట్ 6.7-అంగుళాల క్వాడ్ HD+ డిస్‌ప్లే స్పోర్టింగ్ 3120 x 1440 పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. సెటప్‌లో 48MP, 12MP సెన్సార్‌లతో వచ్చిన 50MP ప్రధాన సెన్సార్ ఉంటుంది. ముందు భాగంలో, హ్యాండ్‌సెట్ సెల్ఫీల కోసం 10.8MP కెమెరాతో వస్తుంది. పిక్సెల్ 7 ప్రో ఆండ్రాయిడ్ 13 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది. 4,926mAh బ్యాటరీని కలిగి ఉంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Chat Filter : వాట్సాప్‌ చాట్ లిస్టులో మీరు చూడని మెసేజ్‌లను ఈజీగా ఇలా ఫిల్టర్ చేయొచ్చు.. ఇదిగో ప్రాసెస్..!