Google Wallet : ‘గూగుల్ వ్యాలెట్’ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండిలా..!

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ నుంచి అధికారిక గూగుల్ వ్యాలెట్ (Google Wallet) అందుబాటులోకి వచ్చింది.

Google Wallet : ‘గూగుల్ వ్యాలెట్’ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండిలా..!

Google Wallet The App Is Officially Available To Download How To Download And Use

Google Wallet : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ నుంచి అధికారిక గూగుల్ వ్యాలెట్ (Google Wallet) అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త Google Wallet యాప్ దాదాపు 39 దేశాల్లో గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 2018లో, Google కంపెనీ Google Wallet, Android Pay అప్లికేషన్‌లను కలిపి Google Pay యాప్‌ని రూపొందించింది. Google Chrome, Android ప్లాట్‌ఫారమ్‌లలో ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. 2020లో, Google Pay ప్లాట్‌ఫారమ్‌ను అప్‌గ్రేడ్ చేసింది. అలాగే పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌లో డీల్‌లు, Peer-to-peer పేమెంట్స్, అనేక ఇతర సర్వీసులను విత్ డ్రా చేసుకోవాలని ప్రకటించింది.

2022 మే నెలలో Google I/O ఈవెంట్‌లో వ్యాలెట్లను తిరిగి ప్రారంభించనున్నట్టు Google ప్రకటించింది. కొత్తగా అప్‌డేట్ అయిన ప్లాట్‌ఫారమ్ స్పెషల్ పేమెంట్ సమస్యలను పరిష్కరించేందుకు కార్డ్‌లు, గవర్నమెంట్ IDలు, బుకింగ్ విమాన టిక్కెట్లు, వ్యాక్సిన్ సర్టిఫికేట్ వంటివి కూడా పొందవచ్చు. వినియోగదారులు ఒక యాప్ ద్వారా వివిధ పేమెంట్లదారులకు పేమెంట్ చేసేందుకు ఈ యాప్‌ను ఉపయోగించవచ్చు. అంతేకాదు.. గూగుల్ యూజర్లు క్యాష్ లెస్ పేమెంట్స్ మరింత సులభతరం చేస్తుంది.

Google Wallet The App Is Officially Available To Download How To Download And Use (1)

Google Wallet The App Is Officially Available To Download How To Download And Use 

ఈ యాప్ డౌన్‌లోడ్ చేయడం ఎలా? :
Google Wallet యాప్ Play Store నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ పే యూజర్లు ఆండ్రాయిడ్ 5.2 OS లేదా ఆ తర్వాతి వెర్షన్‌ని ఉపయోగించాలి. తప్పనిసరిగా Google అకౌంట్, పేమెంట్ అయ్యే ఫోన్ నంబర్‌ని మాత్రమే ఉపయోగించాలి. Google Walletని లింక్ చేసేందుకు యూజర్లు తమ ప్లాట్‌ఫారమ్‌కు వివిధ బ్యాంక్ కార్డ్‌లను యాడ్ చేసుకోవచ్చు.

Read Also : Google AI Chatbot : AI చాట్‌బాట్‌‌ లెమోనీపై గూగుల్ ఉద్యోగి కామెంట్స్.. అంతే ఉద్యోగం ఊడింది!