Hero MotoCorp: హీరో మోటోకార్ప్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్

టూవీలర్ మ్యాన్యుఫ్యాక్చరర్లలో ఇండియాలో అగ్రగామిగా దూసుకుపోతున్న హీరో మోటోకార్ప్ కొత్త బ్రాండ్ ను లాంచ్ చేయనుంది. రానున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ తరం కోసం కొత్త బ్రాండ్ ను...

Hero MotoCorp: హీరో మోటోకార్ప్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్

Vida

Hero MotoCorp: టూవీలర్ మ్యాన్యుఫ్యాక్చరర్లలో ఇండియాలో అగ్రగామిగా దూసుకుపోతున్న హీరో మోటోకార్ప్ కొత్త బ్రాండ్ ను లాంచ్ చేయనుంది. రానున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ తరం కోసం కొత్త బ్రాండ్ ను తీసుకురానుంది. ఈ మేరకు అఫీషియల్ గా 2022 జులై 1న కొత్త బ్రాండ్ అయిన Vidaను లాంచ్ చేయనున్నారు.

హీరో మోటోకార్ప్ ఎమెరిటస్ ఛైర్మన్ డా. బ్రిజ్‌మోహన్ లాల్ బర్త్ డే సందర్భంగా ఈ కొత్త బ్రాండ్ లాంచ్ ను ప్లాన్ చేయనున్నారు. దీనిని చిత్తూరు యూనిట్ లోనే రెడీ చేస్తున్నారు. కస్టమర్లకు 2022లోనే డిస్పాచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఓ స్టేట్మెంట్ లో పేర్కొన్నారు.

హీరో మోటాకార్ప్ సీఈఓ, ఛైర్మన్ డా. పవన్ ముంజాల్ బ్రాండ్ ను 2022 మార్చి 3న ప్రకటన పరిచయం చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ మేరకు 100 మిలియన్ల గ్లోబల్ మిలియన్ సస్టైనబిలిటీ ఫండ్ ను రిలీజ్ చేస్తున్నట్లుగా తెలిపింది. ఈ ఫండింగ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు వస్తాయని ఎదురుచూస్తున్నారు. ESG సొల్యూషన్స్‌లో 10వేల కంటే ఎక్కువ మంది వ్యవస్థాపకులను ప్రోత్సహించడం లక్ష్యంగా మొదలుపెట్టనున్నారు.

Read Also: హీరో ఎలక్ట్రిక్ నుంచి అల్ట్రా స్టైలిష్ ఎలక్ట్రిక్ స్కూటర్: వచ్చేది ఎప్పుడంటే?

లాంచ్ చేయబోయే కొత్త బ్రాండ్ Vida పేరుకు అర్థం .. సన్‌రైజ్ (ఉదయించే సూర్యుడు) అని డా. పవన్ ముంజాబ్ వెల్లడించారు.