Hero Electric scooter: హీరో ఎలక్ట్రిక్ నుంచి అల్ట్రా స్టైలిష్ ఎలక్ట్రిక్ స్కూటర్: వచ్చేది ఎప్పుడంటే?

"హీరో ఎడ్డీ" పేరుతో రానున్న ఈ ఈ-స్కూటర్ వచ్చే త్రైమాసికంలో విడుదల చేయనున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది సంస్థ.

Hero Electric scooter: హీరో ఎలక్ట్రిక్ నుంచి అల్ట్రా స్టైలిష్ ఎలక్ట్రిక్ స్కూటర్: వచ్చేది ఎప్పుడంటే?

Hero Electric scooter

Hero Electric scooter: భారత ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటార్స్.. తమ అనుబంధ సంస్థ హీరో ఎలక్ట్రిక్ నుంచి మరో కొత్త మోడల్ ఈ స్కూటర్(E – Scooter)ను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. “హీరో ఎడ్డీ” పేరుతో రానున్న ఈ ఈ-స్కూటర్ వచ్చే త్రైమాసికంలో విడుదల చేయనున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది సంస్థ. ప్రస్తుతం భారత్ లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల జోరు ఊపుమీదుండగా.. కొత్త సంస్థలు అనేకం పుట్టుకొచ్చి ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అయితే సర్వీస్ లభ్యత, ఛార్జింగ్ సమస్యల దృష్ట్యా వినియోగదారులు కాస్త వెనకడుగేస్తున్నారు. అదే సమయంలో అథెర్, ఓలా, వంటి సంస్థలు ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసాయి. ఎంతో స్టైలిష్ గా, అధునాతన ఫీచర్లు ఉన్న ఆ వాహనాలను కొనేందుకు వినియోగదారులు ఉత్సాహం కనబరుస్తున్నారు.

Also read: Asus 8z Smartphone: హై ఎండ్ స్మార్ట్ ఫోన్ “8z”ను విడుదల చేసిన అసూస్: ధర ఎంతంటే?

అదే సమయంలో ఎప్పటి నుంచో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్న హీరో ఎలక్ట్రిక్ మాత్రం.. మార్కెటింగ్ పరంగా విఫలమై మూస పద్దతిలోనే వాహనాలను విక్రయిస్తుంది. ఈక్రమంలో అథెర్, ఓలా వంటి సంస్థలతో పాటు ఇతర ఎలక్ట్రిక్ వాహనాలకు పోటీ ఇచ్చేలా అల్ట్రా స్టైలిష్ స్కూటర్ ను తీసుకొస్తున్నట్లు హీరో ఎలక్ట్రిక్ ప్రకటించింది. ఎడ్డీ(Eddy)గా పిలిచే ఈ ఈ-స్కూటర్ లో.. ఫైండ్ మై బైక్, ఈ-లాక్, ఫాలో మీ హెడ్ లాంప్, రివర్స్ మోడ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. సుమారు రూ.72,000గా ధరతో రానున్న ఈ Eddy ఎలక్ట్రిక్ స్కూటర్ ను నడిపేందుకు లైసెన్సు, రిజిస్ట్రేషన్ అవసరం లేదని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Also read: Petrol Prices Hike : త్వరలో మళ్లీ పెట్రో బాదుడు.. లీటర్‌కు రూ.10పైనే పెంచుతారట…!