Asus 8z Smartphone: హై ఎండ్ స్మార్ట్ ఫోన్ “8z”ను విడుదల చేసిన అసూస్: ధర ఎంతంటే?

స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తన బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంది అసూస్. అందులో భాగంగానే ఈ కొత్త "8z" ఫోన్ ను భారత్ లో విడుదల చేసింది సంస్థ

Asus 8z Smartphone: హై ఎండ్ స్మార్ట్ ఫోన్ “8z”ను విడుదల చేసిన అసూస్: ధర ఎంతంటే?

Asus

Asus 8z Smartphone: తైవాన్ కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం అసూస్.. మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారత్ లో విడుదల చేసింది. “అసూస్ 8z” అనే హై ఎండ్ స్మార్ట్ ఫోన్ ను మంగళవారం భారత్ లో విడుదల చేసింది అసూస్. ఇండియాలో బడ్జెట్ ఫోన్లకు స్వస్తి చెప్పిన అసూస్..ప్రస్తుతం గేమింగ్ ఫోన్లను, హై ఎండ్ స్మార్ట్ ఫోన్లను మాత్రమే భారత్ లో విక్రయిస్తుంది. సరసమైన ధరలో క్వాలిటీ ఫోన్లను అందించే అసూస్ నుంచి గత కొన్ని రోజులుగా బడ్జెట్ ఫోన్లు అందుబాటులో లేకపోవడంతో.. వినియోగదారులు సైతం ఈ బ్రాండ్ పేరును మర్చిపోయారు. అయితే పీసీ, కంప్యూటర్ పరికరాలు, వైఫై పరికరాలు వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాల అమ్మకాలతో మార్కెట్లో కొనసాగుతూనే ఉంది అసూస్. ఈక్రమంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తన బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంది అసూస్. అందులో భాగంగానే ఈ కొత్త “8z” ఫోన్ ను భారత్ లో విడుదల చేసింది సంస్థ. ఈ ఫోన్ ప్రత్యేకతలు ఏంటంటే..

Also read: Traffic Challans : నేటి నుంచి ట్రాఫిక్ చలాన్ల రాయతీ అమలు.. ఆన్ లైన్ లోనే చెల్లింపు

Asus 8z Specifications:
5.92 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే.. 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. 8 GB RAM + 128 GB ROM వేరియంట్ లో మాత్రమే లభ్యమౌతుంది. గేమింగ్, బిజినెస్.. ఇలా అన్ని వర్గాల వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ 8z స్మార్ట్ ఫోన్లో Snapdragon 888 (SM8350) హై ఎండ్ ప్రాసెసర్ ను పొందుపరిచారు. ఫోన్ వెనుక భాగంలో 64MP + 16MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. వీటిలో 64MP సోనీ IMX686 ఇమేజ్ సెన్సార్ ను ఉపయోగించగా, 16MP క్వాడ్ బేయర్ టెక్నాలజీ ఉపయోగించారు. ఈ టెక్నాలజీ సహాయంతో తీసిన ఫోటోలు ఎంతో స్పష్టంగా ఉంటాయని సంస్థ తెలిపింది. ఇక ఫోన్ ముందు భాగంలో Sony IMX363 సెన్సార్ కలిగిన 12MP కెమెరాను ఏర్పాటు చేశారు.

Also read: vivo-iQoo Smartphone: ఐక్యూ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను భారత్ లో విడుదల చేసిన వివో

4000mAh బ్యాటరీతో వస్తున్న ఈ Asus 8z స్మార్ట్ ఫోన్ లో 5G, వైఫై -6, USB-C వంటి అధునాతన ఫీచర్స్ ఉన్నాయి. ఇక ఇండియాలో iQoo9 సిరీస్. ఐఫోన్ 13 మినీ, వన్ ప్లస్ 9 సిరీస్ వంటి ఫోన్లకు గట్టి పోటీ ఇస్తుందని సంస్థ తెలిపింది. మార్చి 7 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా అమ్మకాలు సాగనున్న ఈ ఫోన్ ప్రారంభ ధరను ₹42,999గా నిర్ణయించినట్లు అసూస్ బిజినెస్ హెడ్ దినేష్ శర్మ తెలిపారు. సాధారణ ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే వినియోగదారులకు ఓ సరికొత్త అనుభూతిని పంచడమే లక్ష్యంగా ఈ Asus 8z హై ఎండ్ స్మార్ట్ ఫోన్ ఆకట్టుకుంటుందని వారు పేర్కొన్నారు.

Also read: Best Smartphones : రూ.5వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. జియో నుంచి రెడ్‌మి వరకు ఓ లుక్కేయండి..!