Traffic Challans : నేటి నుంచి ట్రాఫిక్ చలాన్ల రాయతీ అమలు.. ఆన్ లైన్ లోనే చెల్లింపు
తెలంగాణ పోలీసుల శాఖ నేటి నుంచి మార్చి30 వరకు పెండింగ్ చలానాలు చెల్లించేందుకు ప్రత్యేక అవకాశం కల్పించింది. బైక్‌లు, కార్లు, లారీలు, ఆటోలపై ఫైన్లను రాబట్టేందుకు భారీ ఆఫర్లు ఇచ్చింది.

Chalans
discount of traffic challans : పెండింగ్ చలాన్ల క్లియరెన్స్‌కు ప్రత్యేక అవకాశం కల్పించిన తెలంగాణ పోలీసులు వాహనదారులకు మరో శుభవార్త చెప్పారు. చలాన్ల చెల్లింపుల కోసం గంటల తరబడి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే చలానాలు చెల్లించాలని సూచించారు.
ఈ-చలాన్ ద్వారా అన్ని పెండింగ్ చలాన్లు చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. పెండింగ్ చలాన్ల చెల్లింపునకు ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే వంటి సేవలను కూడా ఉపయోగించుకోవచ్చని సూచించారు. అటు మీ సేవ, ఈ సేవలో కూడా చలానాలు చెల్లించేలా అవకాశం కల్పించారు ట్రాఫిక్ పోలీస్‌లు.
Traffic Challan : బైక్ పై 88 చలాన్లు, రూ.28 వేల జరిమానా
తెలంగాణ పోలీసుల శాఖ నేటి నుంచి మార్చి30 వరకు పెండింగ్ చలానాలు చెల్లించేందుకు ప్రత్యేక అవకాశం కల్పించింది. బైక్‌లు, కార్లు, లారీలు, ఆటోలపై ఉన్న ఫైన్లను రాబట్టేందుకు భారీ ఆఫర్లు ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న చలాన్లపై ద్విచక్రవాహనదారులు, ఆటోలకు 75శాతం డిస్కౌంట్ కల్పించింది. కార్లకు 50శాతం చెల్లించాల్సి ఉంటుంది. తోపుడు బళ్లకు 25 శాతం చెల్లిస్తే సరిపోతుంది.
నో మాస్క్ కేసుల్లో 9 వందల రూపాయల వరకు మాఫీ చేసింది. ఎక్కువగా పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడుతున్న నేపథ్యంలో పోలీసుశాఖ పెండింగ్ చలాన్లపై రాయితీని ప్రకటించింది. హైదరాబాద్‌లో లక్షా 75 వేల చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. వాహనదారులు దాదాపు 5 వందల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది.
New Traffic Fines : GHMC వాహనాలపై భారీగా చలాన్లు
పేదవర్గాలకు వెసులుబాటు కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. నెల రోజుల వెసులుబాటులో చలాన్లు చెల్లించకపోతే చర్యలు తీసుకోనున్నారు. ఆటోలపై నిబంధనలు విధించబోమని ట్రాఫిక్ జాయింట్ సీపీ తెలిపారు. బయట జిల్లాల నుంచి వచ్చే ఆటోలపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆటో యూనియన్లకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు.