New IT Rules : రూల్స్ రచ్చ..కోర్టులు ఏం చెబుతాయి ?

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఐటీ రూల్స్‌ హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఐటీ రూల్స్‌పై స్టే ఇవ్వాలని ఇప్పటికే పలు మీడియా సంస్థలు కోర్టులను ఆశ్రయించాయి. ఢిల్లీ, ముంబై, కేరళ, మద్రాస్‌ హైకోర్టులతో పాటు సుప్రీంకోర్టులోనూ మొత్తం 10 పిటిషన్‌లు వేశాయి. దీంతో కోర్టులు ఏం చేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

New IT Rules : రూల్స్ రచ్చ..కోర్టులు ఏం చెబుతాయి ?

Courts

IT Rules : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఐటీ రూల్స్‌ హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఐటీ రూల్స్‌పై స్టే ఇవ్వాలని ఇప్పటికే పలు మీడియా సంస్థలు కోర్టులను ఆశ్రయించాయి. ఢిల్లీ, ముంబై, కేరళ, మద్రాస్‌ హైకోర్టులతో పాటు సుప్రీంకోర్టులోనూ మొత్తం 10 పిటిషన్‌లు వేశాయి. దీంతో కోర్టులు ఏం చేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త ఐటీ రూల్స్‌ రాజ్యంగం ప్రసాదించిన స‌మాన‌వత్వపు హ‌క్కు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వ్యతిరేకమని సోషల్‌ మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ న్యూస్‌ పోర్టల్స్‌, సోషల్‌ మీడియాను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూస్తోందని పేర్కొంటున్నాయి.

Read More : Water Dispute Supreme Court : నీళ్ల పంచాయితీని సుప్రీం పరిష్కరిస్తుందా ?

ప్రభుత్వ వ్యతిరేక ట్వీట్‌లు, పోస్ట్‌లు బాగా వైరల్‌ అవుతుంటాయి. వీటిని అసలు ఎవరో ముందు పోస్ట్‌ చేశారో తెలుసుకోవాలంటే సంబంధిత సోషల్‌ మీడియా కంపెనీ ఆ వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. కొత్త ఐటీ రూల్స్‌ ప్రకారం ఆ వివరాలు అడిగే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఈ నిబంధనతో తమ యూజర్ల ప్రైవసీ దెబ్బతింటుందని ఆయా కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొత్త నిబంధనలు దోహదం చేస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

Read More : Pune : భార్యతో కలిసి ఉంటే ఎమ్మెల్యే కాలేవన్న జ్యోతిష్కుడు..ఆ భర్త ఏంచేశాడంటే..

ఐటీ కొత్త రూల్స్‌ పరిధిలోకి గూగుల్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సాప్‌తో పాటు ఇతర సోషల్‌ మీడియా యాప్స్‌, డిజిటల్‌ మీడియా, ఓటీటీ, డిజిటల్‌ న్యూస్‌ ఫ్లాట్‌ఫామ్స్‌లోకి వస్తాయి. గత కొంత కాలంగా వాట్సాప్‌, ట్విట్టర్‌ లాంటి సోషల్‌ మీడియా యాప్స్‌ కేంద్ర ప్రభుత్వంతో ఢీ కొడుతున్నాయి. ప్రధానంగా ట్విట్టర్‌ తీరు వివాదాస్పదంగా మారింది. ట్విట్టర్‌ తీరుపై ఢిల్లీ హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read More : Bonalu Celebrations : తెలంగాణ భవన్‌లో ఘనంగా బోనాల ఉత్సవాలు

కొత్త రూల్స్‌ ప్రకారం 50 లక్షల మంది యూజర్లు దాటిన సోషల్‌ మీడియా యాప్‌ కంపెనీలు ముగ్గురు అధికారులను నియమించాలి. అందులో ఆర్‌జీఓ, చీఫ్‌ కంప్లయన్స్‌ ఆఫీసర్‌, నోడల్‌ అధికారి ఉండాలి. వారంతా భారత్‌లోనే నివసిస్తూ ఉండాలి. కోటి 75 లక్ష మంది వినియోగదారులున్న ట్విట్టర్‌ నిబంధనలు పాటించని కారణంగా మధ్యవర్తిత్వ హోదా కోల్పోయింది. దీంతో పలువురు యూజర్లు చేసిన అభ్యంతరకర పోస్టులకు గానూ ట్విటర్‌పై కూడా కేసులు నమోదయ్యాయి. తాజాగా రెసిడెంట్‌ గ్రీవెన్స్‌ అధికారిని నియమించింది.