How to Port to Airtel : జియో లేదా వోడాఫోన్ నుంచి ఎయిర్‌టెల్‌కు ఈజీగా పోర్ట్ కావొచ్చు.. ఫోన్ నంబర్ మార్చకుండానే.. ఇదిగో ప్రాసెస్..!

How to Port to Airtel : మీకు రిలయన్స్ జియో (Reliance Jio) లేదా వోడాఫోన్ (Vodafone) నంబర్ ఉందా? అయితే ఈ రెండింట్లో ఏదైనా నెట్‌వర్క్ నుంచి Airtelకి మారాలనుకుంటున్నారా? టెలికాం ఆపరేటర్ సులభమైన పోర్టబిలిటీ సర్వీసును అందజేస్తుంది.

How to Port to Airtel : జియో లేదా వోడాఫోన్ నుంచి ఎయిర్‌టెల్‌కు ఈజీగా పోర్ట్ కావొచ్చు.. ఫోన్ నంబర్ మార్చకుండానే.. ఇదిగో ప్రాసెస్..!

How to Port to Airtel _ How to port to Airtel without changing the phone number

How to Port to Airtel : మీకు రిలయన్స్ జియో (Reliance Jio) లేదా వోడాఫోన్ (Vodafone) నంబర్ ఉందా? అయితే ఈ రెండింట్లో ఏదైనా నెట్‌వర్క్ నుంచి Airtelకి మారాలనుకుంటున్నారా? టెలికాం ఆపరేటర్ సులభమైన పోర్టబిలిటీ సర్వీసును అందజేస్తుంది. ఈ సర్వీసు ద్వారా మీ ప్రస్తుత మొబైల్ నంబర్‌ను మార్చకుండానే Jio లేదా Vi నుంచి సులభంగా Airtelకి మారవచ్చు. ఏదైనా నంబర్‌ను Airtelకి పోర్ట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. మీ సిమ్‌ (SIM)ను ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్‌కు పోర్ట్ చేయడానికి.. మీ ఆధార్ కార్డ్ వివరాలు లేదా ఏదైనా ఇతర అధికారిక ID ఉంటే చాలు.. ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్‌లో మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP) ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది.

ఈ ప్రాసెస్ పూర్తి కావడానికి ఒకటి లేదా రెండు రోజులు పడుతుందని పేర్కొంది. మీరు మీ ప్రస్తుత ఆపరేటర్‌ను Airtelకి పోర్ట్ చేయాలనుకుంటే.. మీరు ఈ కింది విధంగా ఫాలో కావాల్సి ఉంటుంది. Reliance Jio, Vi, BSNL, ఇతరులతో సహా యూజర్లందరూ మొబైల్ నంబర్‌ను మార్చకుండానే ఎయిర్‌టెల్‌కి నెట్‌వర్క్‌ను పోర్ట్ చేసుకోవచ్చు.

ఈ ఫోన్ నంబర్ మార్చకుండా Airtelకి పోర్ట్ చేయాలంటే? :

* అధికారిక Airtel వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
* మెను నుంచి ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి.. ‘Port to Airtel Prepaid‘ ఎంచుకోండి.
* MNP ప్రాసెస్ ప్రారంభించేందుకు Airtel ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎంచుకోండి.
* ఈ ప్లాన్‌లు రూ. 299 నుంచి ప్రారంభమవుతాయి.
* ఆ తర్వాత.. మీ ఫారమ్‌ను నింపడం ద్వారా డోర్‌స్టెప్ KYCని షెడ్యూల్ చేసుకోవచ్చు.
* మీ KYCలో పేరు, అడ్రస్, మీరు పోర్ట్ చేయాలనుకునే ఫోన్ నంబర్, ఇతర వివరాలను నింపండి.

How to Port to Airtel _ How to port to Airtel without changing the phone number

How to Port to Airtel _ How to port to Airtel without changing the phone number

Note : SIM కార్డ్‌తో రిజిస్టర్ అయిన వ్యక్తి పేరును తప్పక ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

* అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత Submit బటన్‌పై క్లిక్ చేయండి.
* Airtel ఎగ్జిక్యూటివ్ అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేసేందుకు మీ ఇంటి వద్దకే SIMని డెలివరీ చేస్తారు.
* అయితే ముందుగా కాల్‌లో మిమ్మల్ని సంప్రదిస్తారు.
* మీరు డెలివరీ సమయంలో Airtel నుంచి అందుకున్న మీ ID ప్రూఫ్, 8 అంకెల యునిక్ పోర్టింగ్ కోడ్ (UPC)ని షేర్ చేయాలి.
* ఈ ప్రక్రియ 2 రోజుల్లో లేదా 48 గంటల్లో పూర్తవుతుంది.
* సిమ్ డెలివరీ చేసిన తర్వాత.. మీరు మీ SIMని డెలివరీ చేసే ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్‌కు రూ. 100 రుసుమును చెల్లించాలి.
* మీ MNP ప్రక్రియను Airtel థాంక్స్ యాప్‌ (Airtel Thanks App)లో ట్రాక్ చేసేందుకు ఆప్షన్ ఉంది.
* మీరు మీ పోర్ట్-ఇన్ నంబర్‌ని ఉపయోగించి యాప్‌లోకి సైన్ ఇన్ (Sign-in) చేయాలి.
* ఈ ప్రాసెస్ చేయడంలో ఇబ్బందులు ఎదురైతే.. మీ మొబైల్ నంబర్‌ను పోర్ట్ చేసేందుకు మీ సమీప Airtel స్టోర్‌కు వెళ్లవచ్చు.

Read Also : Jio Vs Airtel Vs Vodafone : జియో టు వోడాఫోన్.. రూ. 200 లోపు ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. మరెన్నో డేటా బెనిఫిట్స్..!