Jio Vs Airtel Vs Vodafone : జియో టు వోడాఫోన్.. రూ. 200 లోపు ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. మరెన్నో డేటా బెనిఫిట్స్..!

Jio Vs Airtel Vs Vodafone : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ తమ యూజర్ల కోసం అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. సాధారణ బడ్జెట్‌లో ప్రీపెయిడ్ ప్లాన్లపై మరెన్నో డేటా బెనిఫిట్స్, అన్ లిమిటెడ్ ఫోన్ కాల్స్ మరెన్నో బెనిఫిట్స్ అందిస్తున్నాయి.

Jio Vs Airtel Vs Vodafone : జియో టు వోడాఫోన్.. రూ. 200 లోపు ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. మరెన్నో డేటా బెనిఫిట్స్..!

Jio vs Airtel vs Vodafone plans under Rs 200 data benefits, validity, voice calls and more details

Jio Vs Airtel Vs Vodafone : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ తమ యూజర్ల కోసం అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. సాధారణ బడ్జెట్‌లో ప్రీపెయిడ్ ప్లాన్లపై మరెన్నో డేటా బెనిఫిట్స్, అన్ లిమిటెడ్ ఫోన్ కాల్స్ మరెన్నో బెనిఫిట్స్ అందిస్తున్నాయి. Wi-Fi అందుబాటులో లేని సమయాల్లో ఎక్కువ డేటా కోరుకునే యూజర్ల కోసం టెల్కోలు ఈ ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. కేవలం రూ. 200లోపు ప్రీపెయిడ్ ప్లాన్లను సొంతం చేసుకోవాలంటే ముందుగా మీరు వీటిలో మీకు నచ్చిన ప్రీపెయిడ్ ప్లాన్ ఎంచుకోవచ్చు.

స్పీడ్ డేటా బెనిఫిట్స్ సహా అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో ప్రీపెయిడ్ ప్లాన్ సొంతం చేసుకోవచ్చు. ఫోన్‌లో డేటాతో కనీస ప్లాన్ కావాలా? అయితే Jio, Airtel, Vi అన్‌లిమిటెడ్ డేటా, కాలింగ్‌తో రూ. 200లోపు ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.

Jio, Airtel, Vi (Vodafone idea) డెయిలీ డేటా బెనిఫిట్స్, అన్ లిమిటెడ్ కాలింగ్, SMS వంటి మరిన్నింటిని ఆఫర్లను అందిస్తున్నాయి. కేవలం రూ. 200లోపు ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్‌లను పొందవచ్చు. అలాగే పాకెట్-ఫ్రెండ్లీ రీఛార్జ్ కావాలనుకుంటే, రూ. 200 లోపు ప్రీపెయిడ్ ప్లాన్‌ల జాబితా మీకోసం అందిస్తున్నాం ఇందులో మీకు నచ్చిన ప్లాన్ ఎంచుకుని రీచార్జ్ చేసుకోవచ్చు.

రూ. 200 లోపు జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే :
రూ. 149 ప్లాన్ : ఈ ప్లాన్ అన్ లిమిటెడ్ కాలింగ్‌తో 1GB రోజువారీ డేటా లిమిట్ అందిస్తుంది. 20 రోజుల వ్యాలిడిటీపై రోజుకు 100 SMSలను అందిస్తుంది.
రూ. 179 ప్లాన్ : ఈ ప్లాన్ అన్ లిమిటెడ్ కాలింగ్‌తో 1GB రోజువారీ డేటా లిమిట్ అందిస్తుంది. 24 రోజుల వ్యాలిడీటీపై రోజుకు 100 SMSలను అందిస్తుంది.
రూ. 209 ప్లాన్ : ఈ ప్లాన్ అన్ లిమిటెడ్ కాలింగ్‌తో 1GB రోజువారీ డేటా లిమిట్, 28 రోజుల వ్యాలిడిటీపై రోజుకు 100 SMSలను అందిస్తుంది.

Jio vs Airtel vs Vodafone plans under Rs 200 data benefits, validity, voice calls and more details

Jio vs Airtel vs Vodafone plans under Rs 200 data benefits, validity, voice calls and more details

రూ. 200లోపు ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే :

రూ. 155 ప్లాన్ : ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 SMS, 24 రోజుల వ్యాలిడిటీతో 1GB డేటా, హెలోట్యూన్‌ల అదనపు బెనిఫిట్స్ అందిస్తుంది. Wynk మ్యూజిక్‌కి ఫ్రీ సభ్యత్వాన్ని అందిస్తుంది.
రూ. 179 ప్లాన్ : ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 SMS, 24 రోజుల వ్యాలిడిటీతో 2GB డేటా, హెలోట్యూన్స్ అదనపు బెనిఫిట్స్, Wynk మ్యూజిక్‌కు ఫ్రీ సభ్యత్వాన్ని అందిస్తుంది.
రూ. 209 ప్లాన్ : ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు, 21 రోజుల వ్యాలిడిటీతో పాటు 1GB రోజువారీ డేటా, వింక్ మ్యూజిక్‌కు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్, హెలోట్యూన్‌ల అదనపు బెనిఫిట్స్ అందిస్తుంది.
రూ. 239 ప్లాన్ : ఈ ప్లాన్ రూ. 200 కంటే కొంచెం ఖరీదైనదిగా చెప్పవచ్చు. అయితే అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు, 28 రోజుల వ్యాలిడిటీతో 1.5GB రోజువారీ డేటాను అందిస్తుంది. అదనపు బెనిఫిట్స్ ఉచిత హలో ట్యూన్‌లు, Wink Music Free సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.

రూ. 200లోపు Vi ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే :
రూ. 179 ప్లాన్: ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 SMS, 28 రోజుల వ్యాలిడిటీతో 2GB డేటా, Vi సినిమాలు, టీవీ అదనపు బెనిఫిట్స్ అందిస్తుంది.
రూ. 195 ప్లాన్: ఈ ప్లాన్ అన్ లిమిటెడ్ కాలింగ్, 300 SMS, ఒక నెల వ్యాలిడిటీతో 2GB డేటా, Vi సినిమాలు, Tv అదనపు బెనిఫిట్స్ అందిస్తుంది.

Read Also : Smartphones Overuse : అదేపనిగా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు తెగ వాడేస్తున్నారా? తొందరగా ముసలోళ్లు అయిపోతారు జాగ్రత్త!