Smartphones Overuse : అదేపనిగా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు తెగ వాడేస్తున్నారా? తొందరగా ముసలోళ్లు అయిపోతారు జాగ్రత్త!

Smartphones Overuse : అసలే స్మార్ట్‌ఫోన్, గాడ్జెట్ల ట్రెండ్.. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఎక్కువగా స్మార్ట్ ఫోన్ల మాయలో పడిపోయారు. రెండేళ్ల పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారు. స్మార్ట్ ఫోన్లు, ఇతర గాడ్జెట్ల వాడకం మనిషి జీవితంలో ఒక నిత్యావసరంగా మారిపోయాయి.

Smartphones Overuse : అదేపనిగా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు తెగ వాడేస్తున్నారా? తొందరగా ముసలోళ్లు అయిపోతారు జాగ్రత్త!

Smartphones Overuse Overuse of smartphones or laptops can make you age faster, claims a new study

Smartphones Overuse : అసలే స్మార్ట్‌ఫోన్, గాడ్జెట్ల ట్రెండ్.. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఎక్కువగా స్మార్ట్ ఫోన్ల మాయలో పడిపోయారు. రెండేళ్ల పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారు. స్మార్ట్ ఫోన్లు, ఇతర గాడ్జెట్ల వాడకం మనిషి జీవితంలో ఒక నిత్యావసరంగా మారిపోయాయి. ఆహారం తినకుండా, నీళ్లు తాగకుండా ఉంటారేమోగానీ, ఒక క్షణం పాటు చేతిలో స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండాలేని పరిస్థితి. అంతగా స్మార్ట్ ఫోన్ గాడ్జెట్లకు వ్యసనంగా మారిపోయింది. 24 గంటల పాటు స్మార్ట్ ఫోన్ స్ర్కీన్ చూడందే ఆ రోజు గడవదు.

ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు స్మార్ట్ ఫోన్ పక్కన ఉండాల్సిందే. ఈ స్మార్ట్ ఫోన్లకు తోడుగా ల్యాప్ టాప్‌లు, స్మార్ట్ వాచ్‌లు, ఇయర్ ఫోన్‌లు వంటి ఎన్నో గాడ్జెట్‌లు మనల్ని బొమ్మల్లా ఆడిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రతిఒక్కరి జీవితంలో ఈ గాడ్జెట్లు ఒక భాగంగా మారిపోయాయి. ఈ రోజుల్లో మనం ఫోన్‌లు లేని జీవితాన్ని ఊహించుకోవడం చాలా కష్టమే. కానీ, ఈ గాడ్జెట్‌ల కారణంగా మీరు అనుకున్నదానికంటే వేగంగా మీ వయస్సును పెంచుతాయంటే నమ్ముతారా? స్మార్ట్ ఫోన్లకు వయస్సుకు సంబంధం ఏంటి అంటారా? వయస్సు పెరగదు.. కానీ, వృద్ధాప్యంలో సంభవించే అన్ని అనారోగ్య సమస్యలు ఇప్పుడే వచ్చేస్తాయి.

Smartphones Overuse Overuse of smartphones or laptops can make you age faster, claims a new study

Smartphones Overuse Overuse of smartphones or laptops can make you age faster

మీరు నమ్మిన నమ్మకపోయినా ఇది నిజమని అంటున్నారు పరిశోధకులు. టక్నిల్ టూల్స్ అతిగా ఉపయోగించడం వల్ల మన కంటి చూపు మందగించడంతో పాటు మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని తేలింది. ఈ విషయం మనకు తెలిసినప్పటికీ, నిర్లక్ష్యంగా ఉంటాము. కానీ, అది మనల్ని వృద్ధాప్య స్థితికి తీసుకెళ్తుందని కొత్త అధ్యయనంలో వెల్లడైంది. ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్” జర్నల్‌లో ప్రచురించిన ఒక జంతు-నమూనా అధ్యయనంలో ఈ షాకింగ్ వాస్తవాలు వెలువడ్డాయి. ఎందుకేంటే.. అతిగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ల వంటి గాడ్జెట్‌ల నుంచి ప్రసారమయ్యే నీలి కాంతికి ఎక్కువ బహిర్గతం కావడం కారణంగానే మనల్ని తొందరగా వృద్ధాప్యానికి దగ్గర చేస్తుందని వెల్లడించింది.

అమెరికాలోని ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీ (Oregon State University in the US)కి చెందిన అధ్యయన సహ రచయిత జడ్విగా గిబుల్టోవిచ్ (Jadwiga Giebultowicz) మాట్లాడుతూ.. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్‌ల వంటి రోజువారీ డివైజ్‌ల నుంచి విడుదలయ్యే బ్లూ లైట్‌కు అధికంగా బహిర్గతం కావడం కారణంగా మన శరీరంలోని అనేక రకాల కణాలపై హానికరమైన ప్రభావాలు పడతాయని అధ్యయనంలో తేలింది. అంతేకాదు.. మీ చర్మం, కొవ్వు కణాల నుంచి నరాల వ్యవస్థ వరకు పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం పొంచి ఉంది. కణాలు సరిగ్గా పనిచేయకుండా పోతాయి. అవసరమైన రసాయనాలు ఉత్పత్తి కావు.

Smartphones Overuse Overuse of smartphones or laptops can make you age faster, claims a new study

Smartphones Overuse Overuse of smartphones or laptops can make you age faster

ఈ గాడ్జెట్ల కాంతికి గురైన ఈగలపై పరిశోధకులు అధ్యయనం చేశారు. అందులో ఎక్కువ కాలం చీకటిలో ఉండే ఈగలు మాత్రం ఒత్తిడి పరమైన జన్యువులను ప్రేరేపిస్తాయని పరిశోధనలో తేలింది. అధిక శక్తితో నీలి కాంతి ఎందుకు మనలో వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు రెండు వారాల పాటు నీలి కాంతికి గురైన ఫ్లైస్‌లోని జీవక్రియల మొత్తాన్ని పరీక్షించారు. అలాగే పూర్తి చీకటిలో ఉంచిన ఈగలతో వీటిని పోల్చారు. పరిశోధకులు ఫ్లై హెడ్‌ల కణాలను కూడా పరిశీలించారు.  బ్లూ లైటుకు (exposure to blue light) గురైన తర్వాత రెండు సెట్‌లలోని మెటాబోలైట్‌ల సంఖ్య గణనీయంగా మారుతున్నట్లు గుర్తించారు.

గ్లూటామేట్ స్థాయిలు తగ్గాయని పరిశోధకులు కనుగొన్నారు, అయితే ముఖ్యంగా సక్సినేట్ స్థాయిలు బాగా పెరిగినట్టు పేర్కొన్నారు. పరిశోధకుల పరిశీలనలో ఫ్లైస్‌లోని కణాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వెంటనే చనిపోతాయని గుర్తించారు. బ్లూ లైట్ (Smartphone Blue Light) వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుందనడటానికి ఇదొక ఉదాహరణగా పేర్కొన్నారు. ఈగలు (Fruit flies)  జీవక్రియల పనితీరులో తేడాను కలిగి ఉన్నాయని పరిశోధనలో తేలింది. ఎందుకంటే.. ఈగల్లోని కణజాలాలను విచ్ఛిన్నం చేసేందుకు శరీరం ఉపయోగించే పదార్ధంగా గుర్తించారు. బ్లూ లైటుకు ఎక్కువ ఎక్స్ ఫోజ్ కావడం వల్ల మానవులలో కూడా ఒత్తిడి హార్మోన్‌ను ప్రేరేపిస్తుందని తేలింది.

తద్వారా అది కణాల పనితీరుపై తీవ్ర స్థాయిలో ప్రభావితం చేస్తుంది. అందుకే వేగంగా వృద్ధాప్యం ఛాయలు కనిపిస్తాయి. నివేదికల ప్రకారం.. గాడ్జెట్ల నుంచి వచ్చే బ్లూ లైట్ మెలటోనిన్ ఉత్పత్తిని క్షీణింపజేస్తుంది. దాంతో మీలో నిద్రను ప్రేరేపించేలా చేస్తుంది. అందుకే గాడ్జెట్‌ల వినియోగాన్ని సాధ్యమైనంత తగ్గించడం చేయాలని, నిద్రపోవడానికి ముందు స్మార్ట్ ఫోన్లు, టీవీ వంటి గాడ్జెట్లను చూడొద్దని అధ్యయనం సూచిస్తోంది. లేదంటే.. తొందరగా ముసలోళ్లు అయిపోతారనడంలో ఎటువంటి సందేహం లేదు.

Read Also : Best 5G Smartphones 2022 : భారత్‌కు 5G వస్తోంది.. రూ.20వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్లు ఇవే.. ఏ బ్రాండ్ ఫోన్ కొంటే బెటర్ అంటే?