Best 5G Smartphones 2022 : భారత్‌కు 5G వస్తోంది.. రూ.20వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్లు ఇవే.. ఏ బ్రాండ్ ఫోన్ కొంటే బెటర్ అంటే?

Best 5G Smartphones : భారత మార్కెట్లోకి 5G నెట్ వర్క్ త్వరలో వస్తోంది. చాలా మంది స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఇప్పటికే మార్కెట్లోకి 5G కొత్త స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేశారు. కనెక్టివిటీ ఫీచర్ టాప్-టైర్ స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే పరిమితం కాదు.

Best 5G Smartphones 2022 : భారత్‌కు 5G వస్తోంది.. రూ.20వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్లు ఇవే.. ఏ బ్రాండ్ ఫోన్ కొంటే బెటర్ అంటే?

Best 5G smartphones under Rs 20,000_ Moto G62, OnePlus Nord 2 CE Lite and more

Best 5G Smartphones 2022 : భారత మార్కెట్లోకి 5G నెట్ వర్క్ త్వరలో వస్తోంది. చాలా మంది స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఇప్పటికే మార్కెట్లోకి 5G కొత్త స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేశారు. కనెక్టివిటీ ఫీచర్ టాప్-టైర్ స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే పరిమితం కాదు. కస్టమర్‌లు రూ. 20వేలలోపు అనేక డివైజ్‌లను సొంతం చేసుకోవచ్చు. బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్‌లు పరిమిత బ్యాండ్ సపోర్టుతో వస్తాయి. మీరు ప్రధాన సర్కిల్‌లలో కనెక్టివిటీని పొందాలంటే ఇది సరిపోతుంది. 5G కాకుండా ఇదే రేంజ్‌లో అనేక ఫోన్‌లు మల్టీ యాప్‌లు, ఫొటోలు తీయడం, తేలికపాటి గేమింగ్ వంటి సాధారణ పనులను కూడా చేయొచ్చు. మీరు కొత్త డివైజ్ కోసం సెర్చ్ చేస్తున్నారా? ఆగస్ట్ 2022లో భారత మార్కెట్లో ఐదు 5G ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో మీకు నచ్చిన బ్రాండ్ 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయొచ్చు.

OnePlus Nord 2 CE Lite 5G :
ఈ డివైజ్ 5G సపోర్టుతో వచ్చిన ఆల్-రౌండర్ ఫోన్.. OnePlus Nord CE 2 5G అనేది బెస్ట్ ఆప్షన్. ప్లాస్టిక్ బ్యాక్ ప్యానెల్‌తో ఈ ఫోన్‌ సరసమైన ధరకే అందుబాటులోకి వచ్చింది. OnePlus అలర్ట్ స్లైడర్ లేకపోవడం కొంచెం యూజర్లను నిరాశ కలిగించే విషయమే. మీరు AMOLED స్క్రీన్‌కు బదులుగా LCD స్క్రీన్‌ని పొందవచ్చు. డిస్ప్లే 120Hz రిఫ్రెష్‌ని కలిగి ఉంది, కెమెరాలు అద్భుతంగా ఉన్నాయి. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్ దాదాపు 30 నిమిషాల్లో సున్నా నుంచి 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. OnePlus Nord 2 CE Lite 5G భారత మార్కెట్లో మొత్తం ఐదు 5G బ్యాండ్‌లతో వస్తుంది. OnePlus Nord 2 CE Lite 5G ధర రూ. 19,999గా ఉంది.

Best 5G smartphones under Rs 20,000_ Moto G62, OnePlus Nord 2 CE Lite and more

Best 5G smartphones under Rs 20,000

Moto G62 5G :
మీరు నో-ఫ్రిల్స్, క్లీన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు కొనాలని అనుకుంటున్నారా? అయితే, Moto G62 5G బెస్ట్ ఆప్షన్. దీనికి 12 5G బ్యాండ్‌ల సపోర్టు ఉంది. ఈ ఫోన్ అదే స్నాప్‌డ్రాగన్ 695 SoCని ప్యాక్ చేస్తుంది. Nord CE 2 Lite 5Gకి కూడా సపోర్టు చేస్తుంది. మంచి కెమెరాలతో వచ్చింది. Moto G62 5G కేవలం 15W ఫాస్ట్ ఛార్జింగ్‌తో భారీ 5,000mAh బ్యాటరీతో వచ్చింది. బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. భారత మార్కెట్లో Moto G62 5G ధర రూ. 17,999గా ఉంది.

Best 5G smartphones under Rs 20,000_ Moto G62, OnePlus Nord 2 CE Lite and more

Best 5G smartphones under Rs 20,000

iQoo Z6 5G :
iQoo Z6 5G స్మార్ట్ ఫోన్ 5G సపోర్టు ఇస్తుంది, కానీ వాస్తవానికి, దీనికి రెండు బ్యాండ్‌ల సపోర్టు మాత్రమే ఉంది. యూజర్లు గేమింగ్‌ ఎంజాయ్ చేయొచ్చు. వెబ్ బ్రౌజింగ్ చేసేందుకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. OnePlus Nord CE 2 Lite 5G వలె పర్ఫార్మెన్స్ అందిస్తుంది. చాలా సరసమైన ధరకే అందుబాటులోకి వచ్చింది. Motorola స్మార్ట్‌ఫోన్‌లను ఇష్టపడని యూజర్లకు ఇది మంచి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. భారత మార్కెట్లో iQoo Z6 5G స్మార్ట్ ఫోన్ ధర: రూ. 16,999గా ఉంది.

Best 5G smartphones under Rs 20,000_ Moto G62, OnePlus Nord 2 CE Lite and more

Best 5G smartphones under Rs 20,000

Redmi Note 11T 5G :
Xiaomi సబ్-బ్రాండ్ Redmi భారత మార్కెట్లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో కీలక బ్రాండ్‌లలో ఒకటిగా ఉంది. Redmi Note 11T 5G మరొక బెస్ట్ ఆప్షన్. ఈ ఫోన్ మంచి కెమెరాలను అందిస్తుంది. కనీసం డే టైమ్ లేదా సరైన లైటింగ్ లేని పరిస్థితుల్లోనూ అద్భుతంగా పనిచేస్తాయి. ఈ ఫోన్ ఏడు బ్యాండ్ సపోర్టును అందిస్తుంది. మిగతా ఫోన్లతో పోలిస్తే ఇది చాలా బెటర్ అని చెప్పవచ్చు. LCD స్క్రీన్‌తో వస్తుంది. Nord CE 2 Lite 5G మాదిరిగానే ఉంటుంది. ఇలాంటి ఫోన్‌లను ఇష్టపడే వినియోగదారులకు అనువైనది. భారత మార్కెట్లో Redmi Note 11T 5G ధర రూ. 15,999గా ఉంది.

Best 5G smartphones under Rs 20,000_ Moto G62, OnePlus Nord 2 CE Lite and more

Best 5G smartphones under Rs 20,000

Realme 9 5G :
Xioami స్మార్ట్ ఫోన్లలో Realme 9 5G అనేది బెస్ట్ స్మార్ట్ ఫోన్.. ఈ ఫోన్ అద్భుతమైన పర్పార్మెన్స్ అందిస్తుంది. అదే ధర ట్యాగ్‌ను పొందుతుంది. తొమ్మిది బ్యాండ్‌ల సపోర్టు కూడా అందిస్తుంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 5,000mAh బ్యాటరీతో 18W ఓకేయిష్ ఛార్జింగ్ స్పీడ్‌ను కూడా అందిస్తుంది. భారత మార్కెట్లో Realme 9 5G ధర రూ. 15,999గా ఉంది.

Best 5G smartphones under Rs 20,000_ Moto G62, OnePlus Nord 2 CE Lite and more

Best 5G smartphones under Rs 20,000

Read Also : Best 5G Phones : రూ.30వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!