Instagram Account Hack : మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందా?.. ఇలా సింపుల్‌గా రికవరీ చేసుకోవచ్చు తెలుసా?

Instagram Account Hack : మీ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) అకౌంట్ హ్యాక్ అయిందా? అయితే ఆందోళన అక్కర్లేదు. మీ హ్యాక్ అయిన ఇన్‌స్టా అకౌంట్ ఈజీగా రికవరీ చేసుకోవచ్చు. అది ఎలా అంటారా? ప్రస్తుత రోజుల్లో సైబర్ క్రైమ్ రిస్క్ ఎక్కువగా పెరుగుతోంది.

Instagram Account Hack : మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందా?.. ఇలా సింపుల్‌గా రికవరీ చేసుకోవచ్చు తెలుసా?

How to recover a hacked Instagram account A step by step complete guide

Instagram Account Hack : మీ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) అకౌంట్ హ్యాక్ అయిందా? అయితే ఆందోళన అక్కర్లేదు. మీ హ్యాక్ అయిన ఇన్‌స్టా అకౌంట్ ఈజీగా రికవరీ చేసుకోవచ్చు. అది ఎలా అంటారా? ప్రస్తుత రోజుల్లో సైబర్ క్రైమ్ రిస్క్ ఎక్కువగా పెరుగుతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో చాలామంది యూజర్ల అకౌంట్లు వారికి తెలియకుండానే హ్యాక్ అవుతున్నాయి.

యూజర్ల పర్సనల్ డేటాను హ్యాకర్లకు తస్కరిస్తున్నారు. ఆన్‌లైన్‌లో Instagram, Facebook, Twitter వంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారు అకౌంట్లను రికవరీ చేసేందుకు అనేక విధానాలను అందిస్తున్నాయి. హ్యాక్ అయిన Instagram అకౌంట్ రికవరీ చేసేందుకు ఇక్కడ కొన్ని విధానాలు ఉన్నాయి. ఇలా ప్రయత్నిస్తే మీరు ఇన్‌స్టా అకౌంటును ఈజీగా రికవరీ చేసుకోవచ్చు. ఇంతకీ ఆ అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

Instagram మెసేజ్ వచ్చిందో లేదో మీ మెయిల్ ఓసారి చెక్ చేయండి :
* మీ ఈ-మెయిల్ అడ్రస్ మారినట్లయితే.. సెక్యూరిటీ @mail.instagram.com నుంచి ఈమెయిల్ ద్వారా మీకు మెసేజ్ వస్తుంది. ఇన్‌స్టా వినియోగదారులు మెసేజ్‌లో తమ అకౌంట్ సేఫ్‌ అని ఎంచుకుంటే.. ఈ సెక్యూరిటీ ఫీచర్ వారి అకౌంట్ డేటాను మార్చడానికి అనుమతిస్తుంది.

How to recover a hacked Instagram account A step by step complete guide

How to recover a hacked Instagram account A step by step complete guide

* వినియోగదారులు తమ పాస్‌వర్డ్ వంటి ఇతర డేటాను కూడా మార్చినట్టుయితే.. వారి అకౌంట్ తిరిగి వారి ఈ-మెయిల్ చిరునామాకు లింక్ చేయలేకపోవచ్చు. లాగిన్ (Login) లింక్ లేదా సెక్యూరిటీ కోడ్ (Security Code) కోసం Instagramని రిక్వెస్ట్ చేయవచ్చు. Instagram నుంచి లాగిన్ లింక్‌ను కోరవవచ్చు. Login చేయడానికి లింక్‌తో రిక్వెస్ట్ చేసేందుకు ఈ కింది విధంగా ప్రయత్నించాలి.

* మీ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ (Instagram App)ని ఓపెన్ చేయండి. Login Pageలో Get help logging in option (Android) or Forgot password? (iPhone or web browser). అని ఉంటుంది.
* వినియోగదారులు తప్పనిసరిగా యూజర్ నేమ్ (Username), ఈ-మెయిల్ అడ్రస్ లేదా వారి అకౌంటుతో లింక్ అయిన ఫోన్ నంబర్‌ (Phone Number)ను ఎంటర్ చేయాలి. ఆపై Next బటన్‌పై నొక్కండి.
* ఇన్‌స్టా అకౌంటుతో లింక్ అయిన యూజర్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ లేదా ఫోన్ నంబర్‌కు యాక్సస్ లేకపోతే.. లాగిన్ వివరాలతో ఎంటర్ చేయాలి. ఆపై Can’t reset password?పై Tap చేయండి. Next బటన్‌పై Click చేయండి.
* Captcha కోడ్‌ను ఎంటర్ చేయండి.
* వినియోగదారులు తప్పనిసరిగా వారి ఈ-మెయిల్ అడ్రస్ లేదా ఫోన్ నంబర్‌ని ఎంచుకుని, ఆపై Next బటన్‌ను Tap చేయండి.
* వినియోగదారులు ఈ-మెయిల్ లేదా SMS లోని లాగిన్ లింక్‌ (Login Link)ని క్లిక్ చేసిన తర్వాత ఆన్ స్క్రీన్ సూచనలను ఫాలో అవ్వండి.

How to recover a hacked Instagram account A step by step complete guide

How to recover a hacked Instagram account A step by step complete guide

Instagram నుంచి సెక్యూరిటీ కోడ్ లేదా సపోర్టు కోసం రిక్వెస్ట్ చేయండి.
* లాగిన్ పేజీలో అందుబాటులో ఉన్న ‘Need more help’పై Tap చేయండి.
* ఆన్-స్క్రీన్ ప్రాంప్ట్‌లను అనుసరించి.. మీ ఈ-మెయిల్ అడ్రస్ లేదా ఫోన్ నంబర్‌ను ఎంచుకోవాలి. సెండ్ సెక్యూరిటీ కోడ్ ఎంపికను Tap చేయండి. ఆ తర్వాత స్ర్కీన్ సూచించిన విధంగా ఫాలో అవ్వండి.

యూజర్ ఐడెంటిటీ వెరిఫై చేసుకోవాలి (Verifying user identity) :
వినియోగదారు తమ ఫోటోలు లేని అకౌంట్ కోసం సపోర్టును కోరితే.. గుర్తింపును నిర్ధారించడానికి మెటా ద్వారా Sign Up చేసేందుకు ఈ-మెయిల్ అడ్రస్ లేదా ఫోన్ నంబర్ వినియోగించాలి. మీరు ఏ డివైజ్ నుంచో చేశారో అదే ట్రై చేస్తే మంచిది.

రెండవది.. ఒక వినియోగదారు తమ ఫొటోలను కలిగిన అకౌంట్ సపోర్టు అవసరమైతే.. మీరు ఫేస్ కనిపించేలా సెల్ఫీ వీడియోను తీసుకోవలసి ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల గుర్తింపును నిర్ధారించడానికి అవసరమైన డేటాను సమర్పించాలి. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ ఈ-మెయిల్ అడ్రస్‌కు మెయిల్‌ను వస్తుంది. అంతే ఆ లింక్ క్లిక్ చేసి వెరిఫై చేయడం ద్వారా మీ ఇన్ స్టా అకౌంట్ రికవరీ అవుతుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Instagram Story : మీ ఫ్రెండ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని వారికి తెలియకుండా ఇలా సీక్రెట్‌గా చూసేయొచ్చు తెలుసా?