Instagram Story : మీ ఫ్రెండ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని వారికి తెలియకుండా ఇలా సీక్రెట్‌గా చూసేయొచ్చు తెలుసా?

Instagram Story : మీ ఫ్రెండ్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీని చూసినప్పుడు.. ఆ స్టోరీని ఎంత మంది ఇతర యూజర్లు చూశారో అకౌంట్ ద్వారా చెక్ చేసుకునే వీలుంది. మీరు అవతలి వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టును చూసినట్టుగా వారికి తెలియకుండా రహస్యంగా చూడొచ్చు.

Instagram Story : మీ ఫ్రెండ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని వారికి తెలియకుండా ఇలా సీక్రెట్‌గా చూసేయొచ్చు తెలుసా?

Instagram Story _ How to Secretly view someone's Instagram Story without letting them know

Instagram Story : ప్రముఖ ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఒక్క సెలబ్రిటీలే కాదు.. ప్రతిఒక్కరూ ఇన్‌స్టాగ్రామ్ వాడేందుకు ఇష్టపడతారు. అలాంటి ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్లను ఆకట్టుకునే ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఇన్ స్టా యూజర్లు తమ ఫొటోలు, వీడియోలను స్నేహితులతో షేర్ చేసుకుంటుంటారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు, రీల్స్, పోస్ట్‌లు ప్రతిఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారాయి. ఇన్‌స్టాలో ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు (Instagram Stories), ఇన్‌స్టా రీల్స్ (Instagram Reels), పోస్టులు చేసేందుకు వీలుంది. సోషల్ మీడియా వేదికగా చాలామంది తమ లైఫ్‌కు సంబంధించి విషయాలను బహిరంగంగా ప్రస్తావిస్తుంటారు.

అయితే ఈ ఇన్‌స్టాగ్రామ్ లో పెట్టిన ప్రతిపోస్టును ఎవరైనా చూసేందుకు వీలుంది. మీ ఫ్రెండ్ ఇన్‌స్టా పోస్ట్‌లను చూసినట్లయితే వారికి వెంటనే తెలిసిపోతుంది. మెటా యాజమాన్యంలోని యాప్ స్టోరీలను చూసినట్టుగా పోస్టు చేసినవారికి తెలుస్తుంది. అయితే మీరు మీ ఫ్రెండ్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీని చూసినప్పుడు.. ఆ స్టోరీని ఎంత మంది ఇతర యూజర్లు చూశారో అకౌంట్ ద్వారా చెక్ చేసుకునే వీలుంది. మీరు అవతలి వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టును చూసినట్టుగా వారికి తెలియకుండా రహస్యంగా చూడొచ్చు. అందుకు కొన్ని మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ‘Story View Last’లో మీ ప్రొఫైల్‌ను చూడకుండా చేయొచ్చు. అప్పుడు మీరు చూసిన విషయం తెలియదు. ఇంతకీ అది ఎలానంటే.. అందుకు 3 సులభమైన మార్గాలు ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలను యూజర్లకు తెలియకుండా ఎలా చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Instagram Story _ How to Secretly view someone's Instagram Story without letting them know

Instagram Story _ How to Secretly view someone’s Instagram Story without letting them know

మీరు చూసే స్టోరీకి బదులుగా లైన్‌లో IG Storyపై Tap చేయండి
మీరు పాజ్ చేసిన స్టోరీని Tap చేయండి. ఎడమవైపుకు Swipe చేయడానికి డ్రాగ్ చేయండి.
మీరు చూసే స్టోరీని పొందడానికి మీరు స్టోరీని నెమ్మదిగా ఎడమవైపుకి డ్రాగ్ చేయాల్సి ఉంటుంది.
మీరు రెండు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల మధ్యలో ఉంటారు.
అప్పుడు మీరు వ్యూయర్స్ లిస్టులో రాకుండానే మీకు నచ్చిన స్టోరీని చూడవచ్చు.

Note : ఇన్ స్టా స్టోరీని స్వైప్ చేయకుండా చూసుకోవాలి. ఎందుకంటే మీరు వారి స్టోరీని చూసినట్లు వారికి తెలుస్తుంది. IG స్టోరీ స్నీక్ ప్రివ్యూ ద్వారా మీరు ఏదైనా స్టోరీని వారికి తెలియకుండా చూడవచ్చు.

Airplane మోడ్‌లో :
మీ Android లేదా iOS ఫోన్‌లో Instagram యాప్‌ను ఓపెన్ చేయండి.
Stories లోడ్ కావడానికి కొన్ని సెకన్లు వేచి ఉండండి.
మీ ఫోన్ Airplane మోడ్‌ని On చేయండి.
ఇప్పుడు మళ్లీ ఇన్‌స్టాగ్రామ్‌ని ఓపెన్ చేయండి.
మీరు చూడాలనుకున్న స్టోరీని ఓపెన్ చేసి చూడవచ్చు.

వెబ్ (Web) ద్వారా ఎలా చూడొచ్చుంటే? :
‘Chrome IG Story’ Chrome ఎక్స్‌టెన్షన్‌ను ఇన్‌స్టాల్ చేయండి.
ఇన్‌స్టాగ్రామ్ వెబ్ వెర్షన్‌ (Instagram Web Version)ను ఓపెన్ చేసి లాగిన్ చేయండి.
Chrome ఎక్స్‌టెన్షన్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లోని అన్ని స్టోరీలను యూజర్లకు తెలియకుండానే చూడవచ్చు.

Read Also : Instagram Account : ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. మీ అకౌంట్ ఈజీగా డిలీట్ చేయొచ్చు!