Merry Christmas 2020 : WhatsAppలో స్టిక్కర్ ఎలా పంపడం

Merry Christmas 2020 : WhatsAppలో స్టిక్కర్ ఎలా పంపడం

Christmas stickers on WhatsApp : క్రిస్మస్ (Christmas) సంబరాలు మొదలయ్యాయి. భారత దేశ వ్యాప్తంగా చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా చర్చీలను అందంగా అలంకరించారు. కరుణామయుడైన ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను నిర్వహించేందుకు రెడీ అయిపోతున్నారు. సోషల్ మీడియాలో ఫ్రెండ్స్‌కు, బంధువులకు శుభాకాంక్షలు తెలియచేస్తూ..పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో..WhatsApp కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. సృజనాత్మకత, అందమైన స్టిక్కర్ల (sticker icon)ను పంపడానికి అనేక యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్‌లో క్రిస్మస్ (Christmas) లేదా న్యూ ఇయర్ (New Year) స్టిక్కర్లను ఎలా పంపించాలో చూద్దాం..

* గూగుల్ ప్లే స్టోర్‌ (Google Play Store)లో వాట్సాప్‌ (WhatsApp)లో క్రిస్మస్ (Christmas) స్టిక్కర్ అని టైపు చేయాలి.
* చాలా యాప్స్ లభిస్తాయి. ఇందులో మీకు నచ్చిన థర్డ్ పార్టీ యాప్స్ లేదా క్రిస్మస్ స్టిక్కర్స్ ఫర్ వాట్సాప్, క్రిస్మస్ స్టిక్కర్స్ ప్యాక్ 2020 డౌన్ లోడ్ చేసుకోవాలి.
* యాప్స్ ఓపెన్ చేశాక..క్రిస్మస్, న్యూ ఇయర్, థాంక్స్ గివింగ్ స్టిక్కర్లు కనిపిస్తాయి.

* వాట్సాప్‌లకు స్టిక్కర్‌ (sticker)లను జోడించడానికి, స్టిక్కర్‌ల విండోలో ఉన్న ‘+’ బటన్‌ను ప్రెస్ చేయాలి.
* స్టిక్కర్లను ఆడ్ చేయడానికి ‘Add’ ప్రెస్ చేయాలి.
* వాట్సాప్ యాప్‌ (WhatsApp)లో కొత్త క్రిస్మస్ స్టిక్కర్స్ కనిపిస్తాయి. ఎవరికైతే పంపించాలో..వారితో చాట్ చేయండి.
* టైపింగ్ బార్‌లో ఉన్న స్మైలీ ఐకాన్‌ (smiley icon)పై క్లిక్ చేసి స్టిక్కర్స్ ఎంచుకుని మీ బంధుమిత్రులకు, ఫ్రెండ్స్‌కు పంపించండి.