Common Charging Port : గుడ్ న్యూస్.. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌ టాప్‌లకు ఒకే రకమైన ఛార్జర్.. అంగీకారం తెలిపిన కంపెనీలు

స్మార్ట్ ఫోన్ తో పాటు ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాలు వాడే వారికి త్వరలో శుభవార్త అందనుంది. వాటిలో ఒకే రకమైన ఛార్జింగ్ పోర్ట్ లు రానున్నాయి. అంటే, అన్ని రకాల స్మార్ట్ డివైస్ కు ఒకే రకమైన ఛార్జర్ సరిపోతుంది. ఈ విధానాన్ని దశలవారీగా అమలు చేసేందుకు ఆయా కంపెనీలు, పరిశ్రమలు అంగీకరించాయి.

Common Charging Port : గుడ్ న్యూస్.. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌ టాప్‌లకు ఒకే రకమైన ఛార్జర్.. అంగీకారం తెలిపిన కంపెనీలు

Common Charging Port : ప్రస్తుతం అంతా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు, ట్యాబ్ లు వాడుతున్నారు. ఇవి మన జీవితంలో ఒక భాగమైపోయాయి. మార్కెట్ లో పలు కంపెనీల ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఉన్నాయి. అయితే ఒక్కో దానికి ఒక్కో రకమైన ఛార్జర్ వాడాల్సి రావడం పెద్ద సమస్యగా మారింది. దీని వల్ల వినియోగదారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఎన్ని స్మార్ట్ పరికరాలు అంటే అన్ని ఛార్జర్లు వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది.

అయితే, ఇక ముందు అలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. స్మార్ట్ ఫోన్ తో పాటు ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాలు వాడే వారికి త్వరలో శుభవార్త అందనుంది. వాటిలో ఒకే రకమైన ఛార్జింగ్ పోర్ట్ లు రానున్నాయి. అంటే, అన్ని రకాల స్మార్ట్ డివైస్ కు ఒకే రకమైన ఛార్జర్ సరిపోతుంది. ఈ విధానాన్ని దశలవారీగా అమలు చేసేందుకు ఆయా కంపెనీలు, పరిశ్రమలు అంగీకరించాయి. దీంతో స్మార్ట్ ఫోన్ లు, ట్యాబ్ లు, ల్యాప్ టాప్ లకు యూఎస్ బీ టైప్-సి ఛార్జింగ్ పోర్టుని అమర్చనున్నారు. అయితే ఫీచర్ ఫోన్లకు మాత్రం ప్రత్యేక పోర్ట్ ఉండనుంది.

 

స్మార్ట్ పరికరాలలో USB-C వినియోగాన్ని తప్పనిసరి చేసింది EU. ఈసారి, ఇదే విధమైన చర్యలో, భారతదేశం అన్ని స్మార్ట్ పరికరాలకు సాధారణ ఛార్జర్‌ను కలిగి ఉండాలని భావిస్తోంది. ఈ సమస్యపై చర్చలను అనుమతించడానికి భారత కేంద్ర ప్రభుత్వం మొదట్లో అంతర్-మంత్రిత్వ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. అన్ని స్మార్ట్ పరికరాల్లో USB-C ని తప్పనిసరి చేయడానికి అంగీకరించింది.

“కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటర్-మినిస్ట్రీరియల్ టాస్క్‌ఫోర్స్ సమావేశంలో వాటాదారులు ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత భారతదేశం అన్ని స్మార్ట్ పరికరాల కోసం USB రకం C ఛార్జింగ్ పోర్ట్‌కు మారుతుంది” అని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ అన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

”స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్ లు, ల్యాప్‌టాప్‌లు మొదలైన ఎలక్ట్రానిక్ పరికరాల కోసం USB టైప్-సిని ఛార్జింగ్ పోర్ట్‌గా స్వీకరించడంపై వాటాదారుల మధ్య విస్తృత ఏకాభిప్రాయం ఏర్పడింది. ఇక, ఫీచర్ ఫోన్ల కోసం వేరే ఛార్జింగ్ పోర్ట్‌ను అనుసరించవచ్చు” అని రోహిత్ సింగ్ చెప్పారు.

ముఖ్యంగా, ఒకే ఒక్క ఛార్జర్‌కు బదులుగా రెండు సాధారణ ఛార్జర్‌లను ఉంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. పోర్ట్‌లలో ఒకటి సాధారణ స్మార్ట్ పరికరాలతో అనుకూలమైన ఛార్జర్‌ను పొందుతుంది. మరొకటి తక్కువ-ధర ఫీచర్ ఫోన్ల కోసం ఉంటుంది. భారతదేశంలో ఇ-వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించడానికి, వినియోగదారులకు వాటిని సరళీకృతం చేయడంలో ఇది సహాయపడుతుంది. ASSOCHAM-EY నివేదిక ప్రకారం, 2021లో భారతదేశం 5 మిలియన్ టన్నుల ఇ-వ్యర్థాలను ఉత్పత్తి చేసిందని అంచనా.

అన్ని స్మార్ట్ పరికరాలకు ఒకేరకమైన ఛార్జింగ్ పోర్ట్ అనేది.. ఆండ్రాయిడ్ వినియోగదారులకు, భారతదేశంలో ఐఫోన్ కొనాలనుకునే వారికి శుభవార్తే అంటున్నాయి మొబైల్ డివైజ్ తయారీ పరిశ్రమ వర్గాలు.