ఫేస్‌బుక్‌ బిగ్ బిజినెస్ ట్రిక్ : ఇన్‌స్టాగ్రామ్‌లో Shopping ఫీచర్ చూశారా?

ఫేస్‌బుక్‌ బిగ్ బిజినెస్ ట్రిక్ : ఇన్‌స్టాగ్రామ్‌లో Shopping ఫీచర్ చూశారా?

ప్రముఖ సోషల్ మీడియా ఫొటో, వీడియో షేరింగ్ యాప్ ఇన్ స్టాగ్రామ్ కామర్స్ బిజినెస్ లో అడుగుపెడుతోంది. ఈ కామర్స్ షాపింగ్ సైట్లకు పోటీగా ఫేస్ బుక్ అనుబంధ సంస్థ ఇన్ స్టాగ్రామ్ షాపింగ్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది.

ఫేస్‌బుక్‌ బిగ్ బిజినెస్ ట్రిక్ : ఇన్‌స్టాగ్రామ్‌లో Shopping  ఫీచర్ చూశారా?

ప్రముఖ సోషల్ మీడియా ఫొటో, వీడియో షేరింగ్ యాప్ ఇన్ స్టాగ్రామ్ కామర్స్ బిజినెస్ లో అడుగుపెడుతోంది. ఈ కామర్స్ షాపింగ్ సైట్లకు పోటీగా ఫేస్ బుక్ అనుబంధ సంస్థ ఇన్ స్టాగ్రామ్ షాపింగ్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది.

ప్రముఖ సోషల్ మీడియా ఫొటో, వీడియో షేరింగ్ యాప్ ఇన్ స్టాగ్రామ్ కామర్స్ బిజినెస్ లో అడుగుపెడుతోంది. ఈ కామర్స్ షాపింగ్ సైట్లకు పోటీగా ఫేస్ బుక్ అనుబంధ సంస్థ ఇన్ స్టాగ్రామ్ Shopping Feature ను ప్రవేశపెట్టింది. అన్ని స్మార్ట్ ఫోన్ యాప్స్ లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. మీ ఫోన్లలో ఓసారి మొబైల్ యాప్స్ చెక్ చేసుకోండి. Instagram మొబైల్ యాప్ ఓపెన్ చేయగానే అందులో Check Out అనే బిగ్ బ్లూ Button కనిపిస్తుంది. ఈ బటన్ కింద మీ ఈమెయిల్ ఐడీని ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ అడ్రస్ ఆధారంగా మీ షాపింగ్ ఆర్డర్ ను బుక్ చేసుకోవచ్చు.

20 బ్రాండ్స్ కు పైగా అందుబాటులో :
Payment method
ద్వారా మీ అడ్రస్ వివరాలను ఎంటర్ చేయాలి. మీ వివరాలను రివ్యూ చేసిన తర్వాత మీరు ఎంపిక చేసుకున్న ఐటమ్ ఆర్డర్ రెడీ అవుతుంది. మీరు పేమెంట్ వివరాలను ఇన్ స్టాగ్రామ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు షాపింగ్ చేసేందుకు ఎంతో సులభంగా ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ రిటైలర్లకు సెల్లింగ్ ఫీ చార్జ్ చేస్తుంది. ఇన్ స్టాగ్రామ్ ఫీచర్ లో మొత్తం 20కు పైగా బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో నైక్, అడిడాస్, డైయిర్, హెచ్ అండ్ ఎమ్, మ్యాక్ కాస్మటిక్స్, మిచెల్ కోరస్, ఆస్కార్ డే లా రెంటా, పార్దా, యూనిక్లో, వార్ బై, పార్కర్, జారా ఎన్నో బ్రాండ్స్ షాపింగ్ చేయొచ్చు. 
Read Also : తక్కువ ధరలో ఎక్కువ ఉతుకు : MI వాషింగ్ మెషీన్స్ వస్తున్నాయి

గతంలో ఇన్ స్టాగ్రామ్ లో ఏదైనా ఐటమ్ కొనాలంటే.. రిటైలర్ సైట్ పై ఓ పాప్ అప్ వెబ్ వ్యూ కనిపించేది. ఈ పాప్ అప్ విండోపై షాపింగ్ కార్ట్స్ డిసిప్లే కావడంతో యూజర్లకు కాస్త ఇబ్బందిగా ఉండేది. ఇన్ స్టాగ్రామ్ యాప్ లో షాపింగ్ ఫీచర్ తీసుకురావడం వల్ల షాపింగ్ చేసే యూజర్లు తమ ప్లాట్ ఫాంపైనే ఆర్డర్ బుక్ చేసే అవకాశం కల్పించడంతో ఎక్కువ మంది షాపింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తారని ఇన్ స్ట్రాగ్రామ్ భావిస్తోంది. ఇది పేరంట్ కంపెనీ ఫేసుబుక్ కు Big Business అవుతుందని ఆశిస్తోంది. ఫేస్ బుక్ లో స్టోర్ అయ్యే యూజర్ల పేమెంట్ ఇన్ఫర్మేషన్.. ఇన్ స్టాగ్రామ్ ప్లాట్ ఫాంపై మాత్రమే వినియోగిస్తుంది.

యూజర్ల డేటా సురక్షితం :
ఎట్టి పరిస్థితుల్లోనూ యూజర్ల పేమెంట్ వివరాలను రిటైలర్లు, ఇతర యూజర్లకు షేర్ చేసే వీలు లేదని Facebook స్పష్టం చేసింది. గత ఏడాదిలోనే ఇన్ స్టాగ్రామ్ Shopping App ను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. ఈ ప్లాట్ ఫాంపై నెలకు 130 మిలియన్ల మంది యూజర్లు తమ షాపింగ్ పోస్టులపై ప్రొడక్ట్ ట్యాగులను పోస్టు చేస్తున్నట్టు పేర్కొంది. ఇన్ స్టాగ్రామ్ షాపింగ్ ప్లాట్ ఫాంపై లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్న వాటిలో Check out ఒకటిగా కంపెనీ బ్లాగ్ పోస్టులో తెలిపింది. 
Read Also : రాధికా హైస్కూల్ లవ్ : కలలోకి వస్తాడని త్వరగా నిద్రపోయేదట

×