Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో వయస్సు వెరిఫికేషన్‌కు మూడు ఆప్షన్లు.. సెల్ఫీ వీడియో పంపాల్సిందే!
Instagram : ప్రముఖ ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్ వస్తోంది. ఈ ఫీచర్ మీ వయస్సు ఎంతో నిర్ధారిస్తుంది.

Instagram : ప్రముఖ ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్ వస్తోంది. ఈ ఫీచర్ మీ వయస్సు ఎంతో నిర్ధారిస్తుంది. ప్రస్తుతానికి ఈ కొత్త ఫీచర్‌పై ఇన్స్టాగ్రామ్ టెస్టింగ్ చేస్తోంది. యూజర్లు ఏజ్ వెరిఫికేషన్‌లో భాగంగా తమ ఫొటో IDని అప్లోడ్ చేయడంతో పాటు రెండు కొత్త ఆప్షన్లను తీసుకొస్తోంది. ఇకపై మీ వీడియో సెల్ఫీని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే.. మీ వయస్సు ఎంతో మీ స్నేహితులను అడిగి ధ్రువీకరించాలి. అప్పుడే ఇన్స్టాగ్రామ్ మీకు మరిన్ని ఫీచర్ల యాక్సస్ చేసేందుకు అనుమతించనుంది.
ఇన్స్టాగ్రామ్ 2019లో వయస్సు ధృవీకరణ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. వయస్సు ధృవీకరణ ప్రక్రియలో యూజర్లు తమ పుట్టిన తేదీని మాత్రమే అందిస్తే సరిపోయేది. అయితే యూజర్ ఏ వయస్సు వారో కచ్చితంగా నిర్ధారించే పరిస్థితి లేదు. మీ డ్రైవింగ్ లైసెన్స్ లేదా ID కార్డ్ వంటి అధికారిక IDని అప్లోడ్ చేయడం ద్వారా వారి వయస్సును ధృవీకరించవలసి ఉంటుందని ప్రకటించింది. ఈ మెథడ్ బాగానే ఉన్నప్పటికీ, సోషల్ మీడియా దిగ్గజం వయస్సు ధృవీకరణ కోసం అడగదు. చైల్డ్ ప్రొటెక్షన్ నాన్-ప్రాఫిట్ కంపెనీ థోర్న్ 2021లో నిర్వహించిన ఒక అధ్యయనంలో, 13 ఏళ్లలోపు పిల్లలలో 40 శాతం కంటే ఎక్కువ మంది ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను వినియోగిస్తున్నారని గుర్తించింది. అందులో వయస్సు మినహాయించి అకౌంట్లను వినియోగిస్తున్నారని వెల్లడించింది.

Instagram Will Now Need Your Face Videos And Your Friends’ Confirmation For Age Verification
ఇన్ స్టాగ్రామ్ యూజర్ వినియోగానికి కనీస వయస్సు పరిమితి ఉండాలి. సైన్ అప్ చేసేందుకు యూజర్లకు 13ఏళ్ల వయస్సు ఉండాలి. ఇంతకీ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కలిగిన యూజర్ తగిన వయస్సు కలిగి ఉన్నాడా లేదా అనేది నిర్ధారించడానికి లేదు. ఈ క్రమంలోనే Instagram కొత్త మార్గాలను ప్రవేశపెడుతోంది. వయస్సు ధృవీకరణకు సంబంధించిన ప్రకటన సూచిస్తోంది. వయస్సు వెరిఫికేషన్ పూర్తి అయినవారికి అవసరం లేదు. ఎవరైనా యూజర్ తమ వయస్సులో మార్పులు చేసేందుకు ప్రయత్నించినా లేదా కొత్త అకౌంట్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నించిన సమయంలో మాత్రమే ఈ ఏజ్ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీరు వీడియో సెల్ఫీ లేదా సోషల్ వోచింగ్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.
ఎవరైనా ఇన్‌స్టాగ్రామ్‌లో 18ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు యూజర్లు తమ పుట్టిన తేదీని ఎడిట్ చేయడానికి ప్రయత్నిస్తే.. వారి IDని అప్లోడ్ చేయడం, వీడియో సెల్ఫీని రికార్డ్ చేయడం లేదా తమ ఇన్ స్టా ఫ్రెండ్స్ నుంచి వయస్సు ధ్రువీకరించడం వంటి మూడు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఒక ఆప్షన్ ద్వారా మీ వయస్సును ధృవీకరించవలసి ఉంటుంది. మొదటిది మీ అధికారిక ID కార్డ్‌లో ఏదైనా అప్లోడ్ చేయాలి. రెండవది సామాజిక హామీ (social vouching).. ఇన్స్టాగ్రామ్ మీ వయస్సును నిర్ధారించడానికి మీ ఫాలోవర్లను అడగాల్సి ఉంటుంది. వౌచింగ్ చేసే వ్యక్తికి కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. అలాగే ఆ సమయంలో మరెవరికీ వోచింగ్ ఇచ్చి ఉండరాదు.
ఇందులో మీరు ముగ్గురు స్నేహితులను ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు ఎవరికి అభ్యర్థన పంపుతున్నారో వారు మూడు రోజుల్లోగా స్పందించాల్సి ఉంటుంది. మూడోది.. వీడియో సెల్ఫీ.. మీ వయస్సును నిర్ధారించేందుకు మీ స్నేహితుల నుంచి ధ్రువీకరించాల్సి ఉంటుంది. మీరు వీడియో సెల్ఫీ తీసుకున్న తర్వాత Instagram Yotiతో ఫొటోను షేర్ చేయాలి. మీ ముఖ లక్షణాల ఆధారంగా మీ వయస్సును అంచనా వేస్తుంది. ఆ తర్వాత మీ వయస్సుపై సరైన అంచనాను షేర్ చేస్తుంది. మీ డేటా 30 రోజులలోపు డిలీట్ అయిపోతుందని తెలిపింది.
Read Also : Instagram AMBER : ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. తప్పిపోయిన పిల్లల ఆచూకీ కనిపెడుతుంది..!
- Virat Kohli: ఇన్‌స్టాలో 20 కోట్ల ఫాలోవర్లతో కోహ్లీ రికార్డు.. దేశంలోనే నెంబర్ 1
- Instagram AMBER : ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. తప్పిపోయిన పిల్లల ఆచూకీ కనిపెడుతుంది..!
- WhatsApp New Feature : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇక అందరూ వాడుకోవచ్చు..!
- Human Barbie: లక్షలు ఖర్చుచేసి హ్యూమన్ బార్బీగా మారిన యువతి.. కుటుంబ సభ్యులు ఏం చేశారంటే?
- Viral Video: నవ్వు తెప్పిస్తున్న సీ లయన్.. ఇంతకీ ఏం చేసిందంటే
1Chiranjeevi : అల్లూరి విగ్రహావిష్కరణకు చిరంజీవి.. రాజమండ్రిలో భారీ స్వాగతం పలికిన మెగా అభిమానులు..
2PM Modi : ఒకే హెలికాప్టర్ లో గన్నవరం నుంచి భీమవరం బయలుదేరిన ప్రధాని మోడీ, సీఎం జగన్, ఏపి గవర్నర్
3Maharashtra: బీజేపీ, ఏక్నాథ్ షిండే మధ్య తాత్కాలిక ఒప్పందం జరిగింది.. అంతే: సంజయ్ రౌత్
4Jasprit Bumrah: ఇంగ్లాండ్ గడ్డపై మరో రికార్డ్ బ్రేక్ చేసిన బుమ్రా
5Kamal Haasan : కమల్ హాసన్ ఆఫీస్‌కి తమిళనాడు ప్రభుత్వం నోటీసులు..
6Himachal Pradesh: ఘోర బస్సు ప్రమాదం.. స్కూల్ విద్యార్థులు సహా 16 మంది మృతి
7covid: భారత్‌లో కొత్తగా 16,135 కరోనా కేసులు
8karimnagar: జమ్మికుంటలో 9వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి
9Dil Raju : కొడుకుని ఎత్తుకొని మురిసిపోతున్న దిల్ రాజు.. వైరల్ గా మారిన ఫొటో..
10PM Modi: ప్రధాని మోదీ భీమవరం టూర్ వివరాలిలా..
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!
-
Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!
-
Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్‌లోని రోగుల్లో వేరే లక్షణాలు
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు