iPhone 13 : ఆపిల్ ఐఫోన్ 13 ధర మళ్లీ తగ్గిందోచ్.. క్రోమాలో దీపావళి సేల్.. ఇప్పుడే కొనేసుకోండి..!

iPhone 13 Sale Offer : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 13 (iPhone 13 Sale) మళ్లీ ఆన్‌లైన్‌లో అతి తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది. ఈ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సేల్‌ (Flipkart Festival Sale)ను రూ. 50వేల ధరకు పడిపోయింది.

iPhone 13 : ఆపిల్ ఐఫోన్ 13 ధర మళ్లీ తగ్గిందోచ్.. క్రోమాలో దీపావళి సేల్.. ఇప్పుడే కొనేసుకోండి..!

iPhone 13 to again sell at an effective price of Rs 51,990 on Croma today

iPhone 13 Sale Offer : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 13 (iPhone 13 Sale) మళ్లీ ఆన్‌లైన్‌లో అతి తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది. ఈ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సేల్‌ (Flipkart Festival Sale)ను రూ. 50వేల ధరకు పడిపోయింది. అయితే ఈ సమయంలో ఐఫోన్‌ను కొనుగోలు చేయలేకపోయారా? ఆందోళన వద్దు.. మరో ఛాన్స్ ఉంది.. క్రోమా (Croma) ప్లాట్‌ఫారమ్‌లో దీపావళి పండుగ సేల్‌ (Diwali Festival Sale)ను ప్రకటించింది. వివిధ ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. లేటెస్ట్ డీల్‌లపై దీపావళి సేల్ క్రోమా పేజీ (Croma)లో ఐఫోన్ 13 ధర (iPhone 13) రూ. 51,990కి సేల్ కానుందని వెల్లడించింది. ఈ డివైజ్ అధికారిక ధర రూ. 69,900గా ఉంది. అయితే ప్రాథమికంగా ప్లాట్‌ఫారమ్ iPhone 13పై రూ. 17,910 తగ్గింపును అందిస్తుందని వెల్లడించింది.

iPhone 13 to again sell at an effective price of Rs 51,990 on Croma today

iPhone 13 to again sell at an effective price of Rs 51,990 on Croma today

ఈ డీల్ ఎలా పని చేస్తుందో క్రోమా ఇంకా వెల్లడించలేదు. ఐఫోన్ 13 డీల్ ఈరోజు సాయంత్రం 4:45 గంటలకు లైవ్ అవుతుందని సేల్ పేజీ పేర్కొంది. ధర తగ్గింపు అనేది బ్యాంక్ కార్డ్‌లు, ప్రీపెయిడ్ ఆర్డర్‌లపై ఆధారపడి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ యూజర్లకు అందించే విధంగా కొంత ఫ్లాట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. ప్రస్తుతం, iPhone 13 ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 57,900 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.

128GB స్టోరేజ్ మోడల్ రూ. 16,900 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. మీరు డివైజ్ దాదాపు రూ. 50వేలకు కొనుగోలు చేయవచ్చు. మీ ప్రస్తుత ఫోన్ పర్ఫార్మెన్స్, డివైజ్ ఏజ్ ఆధారంగా ఎక్స్ఛేంజ్ మొత్తం లెక్కించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రస్తుతం ప్లాట్‌ఫారమ్‌లో లిస్టు అయిన డివైజ్.. ప్రస్తుతం అమెజాన్‌లో స్టాక్‌లో లేదు. కానీ, అమెజాన్ ఐఫోన్ 12 ను రూ. 42,999 ధరతో అందిస్తోంది. క్రోమాలో చూస్తే Apple Watch SE కూడా డిస్కౌంట్ ధరతో అందుబాటులో ఉంది.

స్మార్ట్ వాచ్ ధర రూ. 19,990 వద్ద అందుబాటులో ఉంటుందని సేల్ పేజీ పేర్కొంది. Samsung Galaxy FE 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు రూ. 30వేల కన్నా తక్కువ ధరతో కొనుగోలు చేయవచ్చు. ప్రీమియం డివైజ్ ధర రూ. 26,999కి అందుబాటులో ఉంటుంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై ప్లాట్‌ఫారమ్ 10 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తుందని విక్రయ పేజీ వెల్లడించింది. అయితే ఇది ఎంపిక చేసిన ప్రొడక్టులపై అందుబాటులో ఉండవచ్చు. Croma సేల్ పేజీలో OnePlus నుంచి 43-అంగుళాల Full HD స్మార్ట్ టీవీ ధర రూ.19,999గా నిర్ణయించింది.

Read Also : iPhone 12 Massive Discount : అమెజాన్‌లో ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్.. స్టాక్ ఉండగానే కొనుక్కోండి.. ఇండియాలో ధర ఎంతంటే?