iPhone 14 : ఐఫోన్ 14 లాంచ్ మరింత ఆలస్యం.. కరోనా కేసుల ఎఫెక్టేనా?

iPhone 14 : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ప్రతి ఏడాదిలో తమ కొత్త ప్రొడక్టులను లాంచ్ చేస్తుంటుంది. 2022 ఏడాది సెప్టెంబర్‌ రెండో వారంలో కొత్త ఫ్లాగ్‌షిప్ సిరీస్ రిలీజ్ చేస్తుంది.

iPhone 14 : ఐఫోన్ 14 లాంచ్ మరింత ఆలస్యం.. కరోనా కేసుల ఎఫెక్టేనా?

Iphone 14 Launch May Be Delayed Due To Surge In Covid Cases

iPhone 14 : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ప్రతి ఏడాదిలో తమ కొత్త ప్రొడక్టులను లాంచ్ చేస్తుంటుంది. 2022 ఏడాది సెప్టెంబర్‌ రెండో వారంలో కొత్త ఫ్లాగ్‌షిప్ సిరీస్ రిలీజ్ చేస్తుంది. ఈసారి కూడా ఆపిల్ ప్రొడక్టులను అదే సమయానికి లాంచ్ చేయాలని కంపెనీ భావించింది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటి వరకు.. iPhone 14 సిరీస్ సెప్టెంబర్‌లో అధికారికంగా లాంచ్ అవుతుందని భావించారు. ఈ కొత్త నివేదిక ప్రకారం.. ఐఫోన్ 14 లాంచ్‌లో మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఈ ఏడాదిలో iPhone 14, iPhone 14Max, iPhone 14pro, iPhone 14Pro Maxతో సహా 4 కొత్త ఐఫోన్ మోడళ్లను ఆపిల్ లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు. కానీ, ఈ ఐఫోన్ల లాంచ్ ఎంత ఆలస్యం అవుతుందనేది మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతానికి ఆపిల్ నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

ఆపిల్‌కు అతిపెద్ద తయారీ అసెంబ్లీ కేంద్రంగా చైనా ఉంది. ఇటీవలి చైనాలో కోవిడ్-19 కేసులు భారీగా పెరుగుతున్నాయి. చైనాలో కరోనా ఆంక్షల వల్ల ఐపోన్ల తయారీపై తీవ్ర ప్రభావం పడింది. దాంతో iPhone 14 లాంచ్ మరింత ఆలస్యం కావచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. చైనాలోని కొన్ని ప్రాంతాల్లో పెరుగుతున్న COVID-19 కేసులు, లాక్‌డౌన్‌లు, పరిమిత ఆంక్షలతో ఆపిల్ తమ సరఫరాదారులపై తీవ్ర ప్రభావితం చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అందులోనూ సెమీకండక్టర్ కొరత ఐఫోన్ 14 తయారీపై మరింత ప్రభావితం చేసింది.

Iphone 14 Launch May Be Delayed Due To Surge In Covid Cases (2)

Iphone 14 Launch May Be Delayed Due To Surge In Covid Cases 

గత కొన్ని వారాల్లో, చైనా సహా ఇతర దేశాలలో COVID-19 కేసుల పెరుగుదల కారణంగా అనేక Apple సరఫరాదారుల ఫ్యాక్టరీలను మూసివేయవలసి వచ్చింది. దాంతో ఐఫోన్ల ఉత్పత్తిని పరిమితం చేయవలసి వచ్చింది. iPhone 14 తయారీకి అవసరమైన కాంపోనెంట్ డెలివరీలోనూ ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఫలితంగా షిప్‌మెంట్‌లపై ప్రభావం పడనుంది. రాబోయే ఐఫోన్‌లు సాధారణంగా ప్రతి ఏడాది మే – జూన్ నాటికి భారీగా ఉత్పత్తి అవుతాయి. అయితే ఈ ఏడాదిలో ఐఫోన్ల తయారీ ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.

షాంఘై పరిసర ప్రాంతాల్లోని ఆపిల్ సరఫరాదారులు క్రమంగా తమ ఉత్పత్తిని పునఃప్రారంభించటానికి ప్రాధాన్యతనిస్తున్నాయి. 2022లో ఆపిల్ రెండు సైజుల్లో 4 ఐఫోన్‌లను లాంచ్ చేయనుంది. 6.1-అంగుళాల స్క్రీన్‌తో iPhone 14, iPhone 14 Pro ఐఫోన్లు 6.7-అంగుళాల స్క్రీన్‌తో iPhone 14 Max, iPhone 14 Pro Max మార్కెట్లోకి రానున్నాయి. అన్ని ఐఫోన్‌లు A16 బయోనిక్ చిప్‌సెట్ తో రానున్నాయని భావిస్తున్నారు. A15 బయోనిక్ కంటే కొంచెం అప్‌గ్రేడ్‌గా రానున్నాయని అంచనా.

Read Also : iPhone Users : ఐఫోన్ యూజర్లకు గుడ్‌ న్యూస్.. ఇకపై ఇంట్లోనే మీ ఐఫోన్ సెల్ఫ్ రిపేర్ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!