iQOO Neo 6 5G : iQOO Neo 6 వచ్చేస్తోంది.. ఈ నెల 31నే లాంచ్.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చంటే?

iQOO Neo 6 Smartphone : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం IQOO నుంచి కొత్త 5G ఫోన్ వస్తోంది. మిడ్ రేంజ్ డివైజ్ Neo 6 మార్కెట్లోకి తీసుకొస్తోంది. భారత మార్కెట్లో మే 31న iQOO Neo 6 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది.

iQOO Neo 6 5G : iQOO Neo 6 వచ్చేస్తోంది.. ఈ నెల 31నే లాంచ్.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చంటే?

Iqoo Neo 6 With Snapdragon 870 To Be Launched In India On May 31 (2)

iQOO Neo 6 Smartphone : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం IQOO నుంచి కొత్త 5G ఫోన్ వస్తోంది. మిడ్ రేంజ్ డివైజ్ Neo 6 మార్కెట్లోకి తీసుకొస్తోంది. భారత మార్కెట్లో మే 31న iQOO Neo 6 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 SoC ప్రాసెసర్, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన నియో 6 అద్భుతమైన ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. భారత్‌లో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయిన సందర్భంగా ఈ కామర్స్ అమెజాన్ వెబ్ సైట్లో లిస్టింగ్ చేయనున్నట్టు IQOO ధృవీకరించింది. రాబోయే స్మార్ట్‌ఫోన్ డిజైన్ కలర్ స్కీమ్ కూడా వెల్లడించింది. డిజైన్ నియో 6 కెమెరా లేఅవుట్‌తో వస్తోంది.

iQOO Neo 6 : ధర, లభ్యత ఎంతంటే? :
IQOO Neo 6 అనేది మిడిల్-రేంజ్ ఆఫర్. దీని ధర రూ.30,000 లోపు ఉండవచ్చని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్ మోటరోలా ఎడ్జ్ 30, శామ్‌సంగ్ గెలాక్సీ M53 ధరకు సమానంగా ఉండనుంది. బ్లూ రెయిన్‌బో గ్రేడియంట్ కలర్ ఆప్షన్‌లలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో అందుబాటులో ఉండనుంది. మే 31న అదే ప్లాట్‌ఫారమ్‌లో లాంచ్ కానుంది.

Iqoo Neo 6 With Snapdragon 870 To Be Launched In India On May 31 (1)

Iqoo Neo 6 With Snapdragon 870 To Be Launched In India On May 31

IQOO Neo 6: స్పెసిఫికేషన్‌లు
IQOO ఈ Neo 6 ఫోన్ స్పెసిఫికేషన్లు, ధరను వెల్లడించలేదు. లీక్‌ల ప్రకారం.. Neo 6 120Hz డిస్‌ప్లే సపోర్టుతో 6.62-అంగుళాల FULL-HD+ AMOLEDని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌తో పాటు 12GB వరకు RAMతో పనిచేస్తుంది.

Neo 6 రెండు, 3 ర్యామ్ వేరియంట్‌లలో వస్తుందని అంచనా. అందులో 12GB వేరియంట్ మొదటిది. స్మార్ట్‌ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4,700mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. కెమెరా విభాగానికి వస్తే.. నియో 6 స్మార్ట్ ఫోన్.. 64-MP ప్రైమరీ కెమెరాతో పాటు 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP B&W సెన్సార్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 16-MP సెల్ఫీ కెమెరా ఉంది. ఫోన్ ఆండ్రాయిడ్ 12 అవుట్ ది బాక్స్‌లో రన్ అవుతుంది.

Read Also : ATM Withdraw Money : ఏటీఎంలో డెబిట్, క్రెడిట్ కార్డు లేకుండానే డబ్బులు విత్‌డ్రా చేయొచ్చు!