Jio 5G Services Next Month : వచ్చే నెలలోనే జియో 5G సర్వీసులు.. కొత్త 5G ఫోన్ కొనాల్సిందేనా? మీ ఫోన్ సపోర్టు చేస్తుందో లేదో ఇలా చెక్ చేయండి!

Jio 5G Services Next Month : 5G సర్వీసులను పొందాలంటే ముందుగా మీ ఫోన్ 5G నెట్‌వర్క్‌కు సపోర్టు చేయాలి. మీ ఫోన్ 5G నెట్‌వర్క్‌కు సపోర్టు ఇస్తుందో లేదో మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు. మీ ఫోన్ 5Gని సపోర్ట్ చేస్తుందో లేదో తెలియాలంటే ఈ కింది విధంగా ఫాలో అవ్వండి.

Jio 5G Services Next Month : వచ్చే నెలలోనే జియో 5G సర్వీసులు.. కొత్త 5G ఫోన్ కొనాల్సిందేనా? మీ ఫోన్ సపోర్టు చేస్తుందో లేదో ఇలా చెక్ చేయండి!

Jio 5G service is launching next month, do you need a 5G phone use it

Jio 5G Service Next Month : అతి త్వరలో భారత్‌లోకి 5G నెట్‌వర్క్ అందుబాటులోకి రానుంది. దేశీయ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel), వోడాఫోన్ ఐడియా (Vodaphone idea) తమ యూజర్ల కోసం 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇందులో రిలయన్స్ జియో (Reliance Jio) ఇతర పోటీదారుల కన్నా ముందుగానే దేశంలో జియో 5G సర్వీసులను (Reliance Jio 5G Serivces) అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన వార్షిక సాధారణ సమావేశం (AGM) 2022లో కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) వచ్చే దీపావళికి జియో 5G సర్వీసులను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు.

Jio 5G service is launching next month, do you need a 5G phone use it

Jio 5G service is launching next month, do you need a 5G phone use it

అయితే, ప్రారంభ రోజుల్లో ఎంపిక చేసిన సిటీల్లో మాత్రమే 5G సర్వీసులు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఎంపిక చేసిన నగరాల్లో దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా ఉన్నాయి. ఇతర నగరాల్లోని వినియోగదారులకు డిసెంబర్ 2023 నాటికి Jio 5G హై-స్పీడ్ ఇంటర్నెట్‌ (Jio 5G High Speed Internet)కు యాక్సెస్ పొందవచ్చునని అంబానీ ధృవీకరించారు. డిసెంబర్ 2023 నాటికి దేశంలోని అన్ని పట్టణాలు, తాలూకాలు, తహసీల్‌లకు Jio 5G సర్వీసులు అందుబాటులోకి వస్తాయని RIL చైర్మన్ స్పష్టం చేశారు. Jio True 5G బ్రాడ్‌బ్యాండ్ మరింత హైస్పీడ్ వస్తుందని కంపెనీ పేర్కొంది.

Jio 5G ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత అధునాతన 5G నెట్‌వర్క్‌గా అవతరిస్తుందని తెలిపింది. రిలయన్స్ జియో 4G నెట్‌వర్క్‌పై Zero Dependency కలిగిన స్టాండ్-అలోన్ 5G పిలిచే 5G లేటెస్ట్ వెర్షన్‌ను అందిస్తుందని AGM RIL చైర్మన్ చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. 4G సర్వీసులతో పోలిస్తే.. 5G స్పీడ్ 10 రెట్లు ఉంటుందని చెప్పారు.

Jio 5G service is launching next month, do you need a 5G phone use it

Jio 5G service is launching next month, do you need a 5G phone use it

జియో 5G సర్వీసులను పొందే 4 నగరాల్లోని కస్టమర్లకు అందుబాటులోకి రానున్నట్టు తెలిపారు. హై-స్పీడ్ ఇంటర్నెట్‌ సపోర్టు చేసే 5G ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? 5G సర్వీసులను పొందాలంటే ముందుగా మీ ఫోన్ 5G నెట్‌వర్క్‌కు సపోర్టు చేయాలి. మీ ఫోన్ 5G నెట్‌వర్క్‌కు సపోర్టు ఇస్తుందో లేదో మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు. మీ ఫోన్ 5Gని సపోర్ట్ చేస్తుందో లేదో తెలియాలంటే ఈ కింది విధంగా ఫాలో అవ్వండి.

* Android ఫోన్‌లో Settings యాప్‌కి వెళ్లండి.
* ‘Wi-Fi & Network’ ఆప్షన్‌పై Click చేయండి.
* ఆ తర్వాత ‘SIM & Network’ ఆప్షన్‌పై Click చేయండి.
* Preferred network type కింద అన్ని టెక్నికల్ లిస్టును చూడవచ్చు.
* మీ ఫోన్ 5Gకి సపోర్ట్ చేస్తే.. 2G/3G/4G/5Gగా లిస్టు కనిపిస్తుంది.

మీ ఫోన్ 5G నెట్‌వర్క్‌కు సపోర్టు ఇవ్వకపోతే.. మీరు హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను పొందేందుకు 5G- సపోర్టెడ్ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో అనేక బ్రాండ్ల 5G సపోర్టెడ్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. Xiaomi, OnePlus, Realme, Samsung వంటి స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఇప్పటికే వివిధ ధరలలో 5G స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నారు. వాస్తవానికి.. మీ బడ్జెట్ తక్కువగా ఉంటే.. Realme, Lava వంటి కొన్ని కంపెనీలు రూ. 10వేల లోపు 5G ఫోన్‌లను లాంచ్ చేస్తున్నట్లు ధృవీకరించాయి.

Read Also : Jio 5G Services : మీ స్మార్ట్ ఫోన్‌లో 5G సర్వీసు సపోర్టు చేస్తుందా? లేదంటే కొత్త 5G ఫోన్ కొనాలా? ఇప్పుడే చెక్ చేసుకోవచ్చు!