Jio 5G Services : మీ స్మార్ట్ ఫోన్‌లో 5G సర్వీసు సపోర్టు చేస్తుందా? లేదంటే కొత్త 5G ఫోన్ కొనాలా? ఇప్పుడే చెక్ చేసుకోవచ్చు!

Jio 5G Services : భారత్‌లో అతిత్వరలో 5G సర్వీసులు రానున్నాయి. దేశీయ టెలికం దిగ్గజాలు 5G సర్వీసులను ప్రారంభించేందుకు పోటీపడుతున్నాయి. రిలయన్స్ జియో (Reliance Jio) 5G సర్వీసులను ప్రకటించింది.

Jio 5G Services : మీ స్మార్ట్ ఫోన్‌లో 5G సర్వీసు సపోర్టు చేస్తుందా? లేదంటే కొత్త 5G ఫోన్ కొనాలా? ఇప్పుడే చెక్ చేసుకోవచ్చు!

Jio 5G Services Will Jio’s 5G service work in your smartphone

Jio 5G Services : భారత్‌లో అతిత్వరలో 5G సర్వీసులు రానున్నాయి. దేశీయ టెలికం దిగ్గజాలు 5G సర్వీసులను ప్రారంభించేందుకు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 29న AGM సమావేశంలో రిలయన్స్ జియో (Reliance Jio) 5G సర్వీసులను ప్రకటించింది. జియో 5G సేవలను మొదట ఎంపిక చేసిన ప్రధాన నగరాల్లో ప్రారంభించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ఆ తరువాత దేశంలోని అన్ని ప్రాంతాల్లో Jio 5G Services సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. మొదటి దశలో నాలుగు ప్రధాన నగరాలైన కోల్‌కతా, ఢిల్లీ, ముంబై, చెన్నైలో 5G సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే చాలా మొబైల్ తయారీదారులు 5G స్మార్ట్ ఫోన్లను మార్కెట్లో లాంచ్ చేశాయి. దేశంలో ఇప్పుడు రాబోయే జియో 5G సర్వీసులు అన్ని స్మార్ట్ ఫోన్లలో పనిచేస్తాయో లేదో స్పష్టత లేదు. అలాగే, మీ స్మార్ట్‌ఫోన్‌లో జియో 5G సర్వీసులు (Jio 5G Services) పనిచేస్తాయా లేదా అనేది ప్రశ్నార్థకంగా ఉంది.

Jio 5G Services Will Jio’s 5G service work in your smartphone

Jio 5G Services Will Jio’s 5G service work in your smartphone

ప్రస్తుతం హై-స్పీడ్ ఇంటర్నెట్‌ని వినియోగించాలంటే ప్రస్తుతం కొత్త ఫోన్‌ని కొనుగోలు చేయాలా లేదా అనేది స్మార్ట్ ఫోన్ యూజర్లలో గందరగోళం నెలకొంది. అయితే, మీ స్మార్ట్‌ఫోన్ 5Gకి సపోర్టు ఇస్తుందో లేదో చెక్ చేసేందుకు ఒక సులభమైన మార్గం ఉంది. దురదృష్టవశాత్తూ.. మీ ఫోన్ 5G నెట్‌వర్క్‌కు సపోర్టు చేయకపోతే.. మీరు 10X స్పీడ్ పొందాలంటే కొత్త 5G ఫోన్‌ ఏదైనా ఒకటి కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

మీ ఫోన్‌లో Jio 5G సర్వీసులు పనిచేస్తాయో లేదో ఇలా చెక్ చేయండి :

* మీ స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్‌ (Settings) యాప్‌కి వెళ్లండి.
* ‘Wi-Fi & Network’ ఆప్షన్‌పై Click చేయండి.
* ఇప్పుడు ‘SIM & Network’ ఆప్షన్‌పై Click చేయండి
* ‘Preferred network type’ ఆప్షన్ క్రింద అన్ని టెక్నాలజీ లిస్టును చూడవచ్చు.
* మీ ఫోన్ 5Gకి సపోర్ట్ చేస్తే.. అక్కడ 2G/3G/4G/5Gగా లిస్టు కనిపిస్తుంది.

Jio 5G Services Will Jio’s 5G service work in your smartphone

Jio 5G Services Will Jio’s 5G service work in your smartphone

మీ స్మార్ట్‌ఫోన్ 5Gకి సపోర్ట్ చేయకపోతే.. మీరు కొత్త ఫోన్‌ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో మంచి విషయం ఏమిటంటే.. రిలయన్స్ జియో 5G సర్వీసులను భారత్‌లో ప్రారంభించేందుకు మరికొంత సమయం ఉంది. Jio 5G సర్వీసులు ప్రారంభంలో 4 మెట్రో నగరాల్లో మాత్రమే అందుబాటులోకి రానున్నాయి.

ఈ నగరాల్లో దేశ రాజధాని ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబై ఉన్నాయి. 2023 చివరి నాటికి దేశంలోని మిగిలిన ప్రాంతాలు హై-స్పీడ్ 5G ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తాయని కంపెనీ ధృవీకరించింది. ఇదిలా ఉండగా, ఎయిర్‌టెల్ కూడా అక్టోబర్ నెలలో 5G సర్వీసులను ప్రారంభించనున్నట్లు ధృవీకరించింది. భారత్‌లో మొదటగా ఏ టెలికాం ఆపరేటర్ 5G సేవలను ప్రారంభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Read Also : Reliance Jio 5G Services : అంబానీ మాటంటే మాటే.. దీపావళికి భారత్‌కు జియో 5G సేవలు.. ఆ 4 నగరాల్లోనే ఫస్ట్.. ఫుల్ లిస్టు ఇదిగో..!