Jio Phone 5G : రిలయన్స్ జియో 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఇండియాలో లాంచ్ ఎప్పుడు? ధర ఎంత ఉండొచ్చుంటే?

Jio Phone 5G : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) ఫోన్ 5G గీక్‌బెంచ్ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైంది. అయితే జియో 5G ఫోన్ లాంచ్ ఈవెంట్ అతి దగ్గరలోనే ఉందని నివేదిక సూచిస్తోంది. RIL ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఈ జియో ఫోన్ గురించి ఇప్పటికే ధృవీకరించారు.

Jio Phone 5G : రిలయన్స్ జియో 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఇండియాలో లాంచ్ ఎప్పుడు? ధర ఎంత ఉండొచ్చుంటే?

Jio Phone 5G spotted online, but when will it launch in India

Jio Phone 5G : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) ఫోన్ 5G గీక్‌బెంచ్ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైంది. అయితే జియో 5G ఫోన్ లాంచ్ ఈవెంట్ అతి దగ్గరలోనే ఉందని నివేదిక సూచిస్తోంది. RIL ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఈ జియో ఫోన్ గురించి ఇప్పటికే ధృవీకరించారు. 2022 ఆగస్టులో, టెలికాం దిగ్గజం 5G-రెడీ జియో ఫోన్‌ను లాంచ్ చేసేందుకు గూగుల్‌తో కలిసి పని చేస్తోందని ఆయన ప్రకటించారు.

రాబోయే Jio Phone 5G గురించి ఇప్పటివరకు అనేక కీలక వివరాలను కంపెనీ రివీల్ చేసింది. ఈ డివైజ్ అధికారిక పేరు ఏమిటో ప్రస్తుతం తెలియదు. జియో దీనికి జియో ఫోన్ 5G (Reliance Jio 5G Phone) అని పేరు పెట్టనున్నట్లు రూమర్ మిల్ ఇప్పటివరకు పేర్కొంది. ఈ డివైజ్ ప్రస్తుతం గీక్‌బెంచ్ వెబ్‌సైట్‌లో మోడల్ నంబర్ Jio LS1654QB5తో లిస్టు అయింది. రాబోయే జియో 5G ఫోన్ 4GB RAMతో వస్తుందని లిస్టు సూచిస్తోంది.

Qualcommతో కంపెనీ భాగస్వామ్యాన్ని అంబానీ ఇప్పటికే ధృవీకరించారు. మీరు Jio ఫోన్ 5G స్నాప్‌డ్రాగన్ చిప్‌తో వస్తుందని భావించవచ్చు. రాబోయే జియో ఫోన్ స్నాప్‌డ్రాగన్ 480+ SoC ద్వారా అందించనుందని లిస్టింగ్ సూచిస్తున్నాయి. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 12 OSలో రన్ అవుతుంది. ఎందుకంటే గూగుల్ ఇప్పటికే ఆండ్రాయిడ్ 13ని లాంచ్ చేసింది.

Read Also : Jio Phone Next : జియో ఫోన్ నెక్ట్స్ అమ్మకాలు ప్రారంభం.. ముందుగా రిజిస్ట్రేషన్ తప్పనిసరి

ఇతర స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. జియో ఫోన్ 5G 6.5-అంగుళాల HD+ LCD 90Hz స్క్రీన్, 5,000mAh బ్యాటరీ, 13-MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తుందని ఇప్పటివరకు లీక్‌లు పేర్కొన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీల కోసం 8-MP సెన్సార్ ఉండవచ్చు. కనీసం 18W ఛార్జింగ్‌కు కంపెనీ సపోర్ట్‌ను అందిస్తుందని చెప్పవచ్చు.

Jio Phone 5G spotted online, but when will it launch in India

Jio Phone 5G spotted online, but when will it launch in India

జియో ఫోన్ 5G ఎప్పుడు లాంచ్ కానుంది? :

కొన్ని నెలల క్రితమే టెలికాం కంపెనీ జియో ఫోన్ లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది. 5G ఫోన్ ఇప్పట్లో రాకపోవచ్చునని సూచించింది. వచ్చే ఏడాది ఎప్పుడైనా లాంచ్ అయ్యే అవకాశం ఉందని రిలయన్స్ తదుపరి AGM ఈవెంట్‌లో లాంచ్ చేసే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది.

జియో ఫోన్ 5G : ధర ఎంత ఉండొచ్చుంటే?
జియో ఫోన్ “అల్ట్రా-అఫర్డబుల్” అని అంబానీ ధృవీకరించిన విషయం తెలిసిందే. జియో 5G ఫోన్ ధర రూ. 8వేల నుంచి రూ.10వేల మధ్య ఉండవచ్చని లీక్‌లు సూచిస్తున్నాయి. అయితే కచ్చితమైన ధర ఎంత అనేది ఇంకా వెల్లడి కాలేదు. హ్యాండ్‌సెట్ ధర రూ. 15వేల లోపు ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం తక్కువ 5G ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. జియో 5G ఫోన్ లాంచ్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే మరి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Realme 10 Pro Series : భారత్‌కు రియల్‌మి 10 ప్రో సిరీస్ వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లు.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!