Jio Phone Next : జియో ఫోన్ నెక్ట్స్ అమ్మకాలు ప్రారంభం.. ముందుగా రిజిస్ట్రేషన్ తప్పనిసరి

జియో ఫోన్ నెక్ట్స్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. స్టోర్‌కు వెళ్లడానికి ముందుగా వాట్సాప్ ద్వారా లేదా కంపెనీ వెబ్ సైట్ (https://www.jio.com/next) ద్వారా బుక్ చేసుకోవాలి.

Jio Phone Next : జియో ఫోన్ నెక్ట్స్ అమ్మకాలు ప్రారంభం.. ముందుగా రిజిస్ట్రేషన్ తప్పనిసరి

Jio Phone Next

Jio Phone Next :  జియో ఫోన్ నెక్ట్స్ విక్రయాలు భారత్‌లో ప్రారంభమయ్యాయి. వీటిని కొనేవారు, స్టోర్‌కు వెళ్లడానికి ముందుగా వాట్సాప్ ద్వారా లేదా కంపెనీ వెబ్ సైట్ (https://www.jio.com/next) ద్వారా బుక్ చేసుకోవాలి. ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండా ఫోన్ కొనేందుకు వీలుండదు. జియో ఫోన్ నెక్ట్స్‌కి రిలయన్స్ ఈఎంఐ సౌకర్యం కూడా అందిస్తుంది. ఫోన్ కొనాలి అనుకునే వారు డౌన్ పేమెంట్‌గా రూ.1,999 చెల్లిస్తే సరిపోతుంది.

చదవండి : Jio Phone Next : జియో ఫోన్ నెక్స్ట్ సేల్స్ షురూ..రిజిస్ట్రేషన్ తప్పనిసరి

జియో ఫోన్ నెక్ట్స్ కోసం 70182 70182కు Hi అని వాట్సాప్ సందేశం పంపడం ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సందర్భంగా వినియోగదారులు తమ లొకేషన్‌ను షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అది పూర్తయిన తరువాత స్టోర్‌కు వెళ్లి జియో ఫోన్ నెక్ట్స్ కొనుక్కోవాల్సిందిగా వినియోగదారులకు సమాచారం వస్తుంది. ఈ సమాచారం వచ్చిన తరువాత వినియోగదారులు జియో ఫోన్ నెక్ట్స్‌ను కొనేందుకు వీలవుతుంది.

ఈ ఫోన్ ధర రూ.6,499గా నిర్ణయించారు. వినియోగదారులు ఈఎంఐ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. జియో నెక్ట్స్ సులభ యాక్సెస్ ఉండేందుకు వీలుగా దేశవ్యాప్తంగా కంపెనీ 30,000కు పైగా రిటైల్ అవుట్ లెట్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. డిజిటల్ ఫైనాన్స్ ఆప్షన్‌ను కూడా కంపెనీ అందుబాటులోకి తీసుకు వచ్చింది. తద్వారా దీన్ని ప్రతీ భారతీయుడికీ అందుబాటులోకి తీసుకువచ్చినట్లయింది.

చదవండి : Jio Phone Next : జియో ఫోన్‌ ‘Pragati OS’ ఏంటి.. ఎలా పనిచేస్తుంది? ఫీచర్లు ఏమున్నాయంటే?

మీరు జియో అందించే దిగువ ఈఎంఐ ప్లాన్స్ లో దేన్న యినా ఎంచుకోవచ్చు

ఆల్వేస్ ఆన్ ప్లాన్ : నెలకు రూ. 300 చొప్పున 24 నెలలు, నెలకు రూ. 350 చొప్పున 18 నెలలు చెల్లించాల్సి ఉంటుంది. నెలకు 5 జిబి డేటా, 100 నిమిషాల కాలింగ్ ఉచితంగా అందిస్తారు.

లార్జ్ ప్లాన్ : ఈఎంఐ నెలకు రూ. 450 చొప్పున 24 నెలలు,  నెలకు రూ. 500 చొప్పున 18 నెలలు కట్టుకోవచ్చు. ఇక ఈ ప్లాన్ ద్వారా రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాలింగ్ ఉచితంగా ఇవ్వనుంది జియో

XL ప్లాన్ : ఈఎంఐ నెలకు రూ. 500 చొప్పున 24 నెలలు,  నెలకు రూ. 550 చొప్పున 18 నెలలు. ఈ ప్లాన్ లో రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్ ఉచితంగా పొందవచ్చు.

XXL ప్లాన్ : నెలకు రూ. 550 చొప్పున 24 నెలలు, నెలకు రూ. 600 చొప్పున 18 నెలలు చెల్లించాలి. రోజుకు 2.5GB డేటా, అపరిమిత కాలింగ్ ఉచితంగా పొందవచ్చు.

జియో ఫోన్ నెక్ట్స్ స్పెసిఫికేషన్స్

జియో ఫోన్ నెక్ట్స్ అనేది ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. ఇది భారతదేశం కోసం తయారుచేయబడిన ఆండ్రాయిడ్ ఆప్టిమైజ్డ్ వెర్షన్. ఇది 5.45 అంగుళాల హెచ్ డి+ (720×1,440 pixels) డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వస్తుంది. యాంటీ – ఫింగర్ ప్రింట్ కోటింగ్ ఉంటుంది. కెమెరా విభాగంలో జియో ఫోన్ నెక్ట్స్ 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరాను, 8-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

చదవండి : JioPhone Next: దీపావళి సేల్‌లో జియోఫోన్.. తెలుసుకోవాల్సిన 5విషయాలు

రియర్ కెమెరాలో పోట్రాయిట్ మోడ్, నైట్ మోడ్, ప్రి లోడెడ్ కస్టమ్ ఇండియా- అగుమెంటెడ్ రియాలిటీ ఫిల్టర్స్ ఉంటాయి. మైక్రో – యూఎస్బీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, బ్లూ టూత్ వి4.1, వై-ఫై, డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్స్ ఉంటాయి. ఈ ఫోన్ 1.3 GHz క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 215 క్వాడ్ – కోర్ ప్రాసెసర్, 2 జిబి ర్యామ్, 512 జీబీ వరకు విస్తరించుకోగలిగిన 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. జియో ఫోన్ నెక్ట్స్ 3,500 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. రీడ్ అలౌడ్, లైవ్ ట్రాన్స్ లేట్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంటాయి.