KTM RC390: కేటీఎం ఆర్సీ 390 2022 మోడల్ని విడుదల చేసిన బజాజ్
ఇప్పటికే భారత మార్కెట్లో కొనసాగుతున్న ఆర్సీ 390కే సరికొత్త మెరుగులుదిద్ది 2022 మోడల్‌గా తీసుకొచ్చింది బజాజ్ సంస్థ.

KTM RC390: కేటీఎం బ్రాండ్‌లో ఆర్సీ 390 2022 మోడల్ బైక్‌ను బజాజ్ సంస్థ సోమవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పటికే భారత మార్కెట్లో కొనసాగుతున్న ఆర్సీ 390కే సరికొత్త మెరుగులుదిద్ది 2022 మోడల్‌గా తీసుకొచ్చింది బజాజ్ సంస్థ. గత మోడల్స్‌తో పోల్చుకుంటే ఈ సరికొత్త ఆర్సీ 390లో అనేక కొత్త ఫీచర్స్‌ను జోడించింది కేటీఎం. సింగిల్-పాడ్ LED హెడ్‌లైట్, నాణ్యమైన బాడీ గ్రాఫిక్స్, 13.7-లీటర్ సామర్ధ్యం గల ఇంధన ట్యాంక్, ఇంకా సీట్ డిజైన్ కూడా కొత్త మోడల్లో మారింది. వీటితో పాటుగా..బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, WP అభివృద్ధి చేసిన అప్సైడ్డౌన్ ఫోర్క్, అడ్జస్టబుల్ రియర్ షాక్ అబ్జార్బర్..ఉన్నాయి. అయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్న అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఫీచర్ మాత్రం ఇండియా మోడల్స్‌కు లేదు.
Other Stories:Akasa Airlines: రాకేశ్ ఝున్‌జున్‌వాలా ‘ఆకాశ ఎయిర్’ మొదటి బ్యాచ్ విమానాలు సిద్ధం: జులైలోనే సేవలు
ఆర్సీ 390 2022 మోడల్ ప్రత్యేకతలు:
373CC లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్, DOHC ఇంజిన్ కలిగి ఉంది. 2022 మోడల్ ఇంజిన్‌లో 40 శాతం పెద్ద ఎయిర్‌బాక్స్ మరియు కొత్త ఇంజిన్ మ్యాపింగ్‌ను అభివృద్ధి చేశారు. దీంతో బైక్ టార్క్ పెరగడంతో పాటు మొత్తం రైడ్ క్వాలిటీని పెంచుతుందని కేటీఎం తెలిపింది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తున్న ఆర్సీ 390 గరిష్టంగా 42.9 bhp పవర్, 37 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. KTM ఫ్యాక్టరీ రేసింగ్ బ్లూ మరియు KTM ఆరెంజ్ రంగుల్లో లభిస్తున్న ఈ ఆర్సీ 390 ధర ₹ 3,14,000(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించినట్లు కేటీఎం తెలిపింది.
1Uddhav Thackeray: ఉద్ధవ్‌కు మరో షాక్.. షిండే క్యాంపులో చేరిన థానె కార్పొరేటర్లు
2Apple Lockdown Mode : ఐఫోన్లో కొత్తగా ‘లాక్డౌన్’ మోడ్.. మీ డేటా మరింత భద్రం!
3Sai Pallavi: సాయి పల్లవి కోసం లైన్ కడుతున్న రానా, నాని!
4Love Cheating : ప్రేమ పేరుతో మోసం-యువతి ఆత్మహత్యాయత్నం
5EV Charging Station: కొత్త బిల్డింగులకు ఈవీ చార్జింగ్ స్టేషన్ తప్పనిసరి.. నోయిడా పాలకవర్గం నిర్ణయం
6Maharashtra: శివసేనకు ఉద్ధవ్ ఠాక్రేనే చీఫ్.. రెబల్ ఎమ్మెల్యేల గ్రూపునకు గుర్తింపులేదు: ఎంపీ సావంత్
7JOBS : బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాల భర్తీ
8Old City Bonalu : ఆషాడ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
9Boris Johnson: రాజీనామా చేయాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయం
10Coconut Oil : వంటల్లో కొబ్బరి నూనె వాడితే!
-
RC15: బ్యాక్ టు హైదరాబాద్!
-
Sammathame: ఆహా.. సమ్మతమే ఓటీటీ డేట్ వచ్చేసింది!
-
The Ghost: కిల్లింగ్ మెషిన్‌గా రాబోతున్న నాగ్.. ఎప్పుడంటే..?
-
Ponniyin Selvan: మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ టీజర్ డేట్ ఫిక్స్..?
-
Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్.. మరో ఇద్దరు దక్షిణాది వారికి చోటు
-
Nagarjuna: ఎలక్ట్రిఫైయింగ్ అప్డేట్తో వస్తున్న ‘ది ఘోస్ట్’!
-
ICC Test Rankings : టాప్ 10లో చోటు కోల్పోయిన కోహ్లీ.. ఆరేళ్లలో ఇదే ఫస్ట్ టైం..!
-
MacBook Air M2 : అదిరే ఫీచర్లతో ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2.. ప్రీ-ఆర్డర్లు ఎప్పుటినుంచంటే?