Maruti Suzuki WagonR: రూ.40 లక్షల కారు.. రూ.2.3లక్షలకే రెడీ

సొంత కార్ గ్యారేజ్ లో దీనిని లుక్ ను మార్చినట్లు చెప్పాడు. తానే స్వయంగా చాలా కాలం కష్టపడి ...

Maruti Suzuki WagonR: రూ.40 లక్షల కారు.. రూ.2.3లక్షలకే రెడీ

Wagonr To Lumisine (1)

Maruti Suzuki WagonR: మీరు అనుకున్నట్లు ఇది లిమోసిన్ కారు కాదు. రూ.40 నుంచి 50లక్షల విలువ చేసే కారెక్కడ.. మారుతీ వాగనార్ ఎక్కడ. కానీ, రూపు రేఖల్లో మాత్రం దానినే టార్గెట్ చేశారు. మరో రెండు డోర్లు ఏర్పాటు చేయడంతో పాటు బాడీని కూడా పెంచారు. ఇంతకీ ఈ మాడిఫైడ్ కార్ ఎక్కడుందో తెలుసా.. పాకిస్తాన్ లో..

మొహమ్మద్ ఇర్ఫాన్ ఉస్మాన్ తన సొంత కార్ గ్యారేజ్ లో దీనిని లుక్ ను మార్చినట్లు చెప్పాడు. తానే స్వయంగా చాలా కాలం కష్టపడి దీనిపై కూర్చున్నాడట. 1977లో మొదలుపెట్టి సౌదీ అరేబియాలోనూ వర్క్ షాప్ చేశానని చెప్తున్నాడు.

ఉస్మాన్ కు చాలా కాలం నుంచి వాగనార్ ను లిమోసిన్ గా మార్చాలని ఉండేదట. పనిఒత్తిడి వల్ల అది సాధ్యపడలేదు. సౌదీ అరేబియాలో అది చేయాలని ప్రయత్నించినా కుదరలేదు. పాకిస్తాన్ వచ్చేసి సొంత గ్యారేజి మొదలుపెట్టాక కానీ, ఆ ప్రాజెక్ట్ సాధ్యపడలేదు. ప్రాజెక్ట్ చేసే ముందు లిమోసిన్ గురించి బాగా స్టడీ చేశాట. అప్పుడే వాగనార్ కరెక్ట్ ఛాయీస్ అని తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా తయారుచేసిన ప్రాజెక్టులన్నింటినీ కంపేర్ చేస్తూ.. మరెక్కడా తయారుచేయని దానిని రూపొందించాడు.

దీని కోసం పాకిస్తాన్ నుంచి వస్తువులు తెప్పింపచుకున్నాడు. ఎక్స్ ట్రా డోర్లు, రూఫ్, పిల్లర్లు, సీట్స్ మొత్తం రూ.2.3లక్షల్లో పూర్తి చేశాడు. మూడు నెలలు కష్టపడితే పూర్తయిందని చాలా వరకూ ఫినిషింగ్ కే ఎక్కువ సమయం పట్టిందని చెప్తున్నాడు.

14.5అడుగుల ఎత్తు..
ఒరిజినల్ గా ఉన్న పొడవుకు 3అడుగుల 7అంగుళాల పొడవు యాడ్ చేశారు. కారు మొత్తం 14.5 అడుగులు ఉందని 6డోర్లు ఉన్న కారులో ఒకేసారి ఆరుగురు ప్రయాణించొచ్చని చెప్తున్నాడు. దీనిని పొడిగించడం వల్ల మరో 500కేజీల బరువు మోయగలిగే సామర్థ్యం వచ్చిందట.